Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Tdp Leader Devineni Uma

టీడీపీలో మరో వికెట్… జైలుకు వెళ్లిన మరో నేత…!

Published Date :July 30, 2021 , 10:26 pm
By Manohar
టీడీపీలో మరో వికెట్… జైలుకు వెళ్లిన మరో నేత…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ టీడీపీలో మరో వికెట్ పడింది. అంటే పార్టీ నుంచి వెళ్లడం కాదండోయ్.. జైలుకు వెళ్లడం. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సెంట్రల్‌ జైళ్లకు వెళ్లడం కామనై పోయింది.

అచ్చెన్న, కొల్లు అరెస్ట్‌ అయినా వెనక్కి తగ్గని ఉమా!

ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు అయ్యారు. దమ్ముంటే తనను అరెస్టు చెయ్యాలంటూ రెండేళ్లుగా సవాళ్లు చేస్తున్న ఈ మాజీ మంత్రిని వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీలో అందరికంటే ముందుగా ఈ మాజీ మంత్రే జైలుకు వెళ్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఇరిగేషన్ కాంట్రాక్ట్‌ల విషయంలో శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అనేది ఆ ప్రచారం సారాంశం. అయితే వాటికి వెరవకుండా రోజూ ప్రభుత్వంపై చెలరేగిపోయారు ఉమా. తనతోపాటు నాడు కేబినెట్‌లో పనిచేసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు అరెస్టు తర్వాత కూడా ఉమా తగ్గలేదు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో అధికార పార్టీకి ఆయన మరింత టార్గెట్ అయ్యారు.

ఈసారి పక్కా ప్రణాళికతో సక్సెస్‌ చేసిన పోలీసులు!

అప్పటి మంత్రిగా ఆయన శాఖల్లో జరిగిన అవకతవకలపై ఉమా బుక్‌ అవుతారని అంతా భావించారు. అయితే సొంత నియోజకవర్గంలో సొంత మనుషుల మధ్య జరిగిన చిన్న వివాదంలో ఉమా అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. తిరుపతి గురించి జగన్‌ తప్పుగా మాట్లాడారంటూ ఏదో వీడియో చూపించిన వ్యవహారంపై ఉమాపై కర్నూలులో కేసు నమోదైంది. దానిపై కోర్టుకు వెళ్లి అరెస్ట్‌ కాకుండా తప్పించుకున్నా.. ఈసారి మాత్రం పోలీస్‌ పక్కా ప్రణాళికతో ఎప్పుడో అనుకున్న కార్యక్రమాన్ని ఇప్పుడు సక్సెస్‌ చేసేశారు.

మూడుకు చేరిన మాజీ మంత్రుల అరెస్ట్‌ల సంఖ్య!

గొల్లపూడిలో సవాల్ అంటూ గతంలో నానా యాగీ చేశారు ఉమా. పోలీసుల కళ్లుగప్పి నిరసన చేస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఆ ఎపిసోడ్ ద్వారా మంత్రులతో వచ్చిన మాటకు మాట వివాదాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు యత్నించారాయన. ఇలా రెండేళ్ల కాలంలో వరస పరిణామాలతో విసుగెత్తిన ప్రభుత్వం ఉమాపై బాగానే ఫోకస్ పెట్టింది. తాజా గొడవలో జైల్లోకి నెట్టింది. దీంతో నాడు బాబు కేబినెట్‌లో ఉండి అరెస్ట్‌ ఐన మాజీ మంత్రుల సంఖ్య మూడుకు చేరింది. వీరు కాకుండా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర జైలుకు వెళ్లి వచ్చారు. మాజీ విప్ కూన రవికీ అరెస్ట్‌ తప్పలేదు. కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలు జైలుకు వెళ్లి వచ్చారు. ఒక పెళ్లికి వెళ్లి అనూహ్యంగా కేసులో బుక్కైయ్యారు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి పరిస్థితీ అంతే.

అరెస్ట్‌లకు మానసికంగా సిద్ధమైన టీడీపీ నేతలు!

టీడీపీ నేతలు ఇప్పుడు ఏదైనా వివాదంలో ఇరుక్కుంటే చాలు పాత కేసులు తవ్వి జైలుకు పంపుతున్నారనేచర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు చంద్రబాబు కేబినెట్‌లోని సగం మంది ఏదో ఒక కేసులో ఇరుక్కున్నారు. నాడు చంద్రబాబు పర్యవేక్షణలో ఉన్న ఫైబర్‌గ్రిడ్‌, కార్మిక శాఖ పరిధిలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధుల గోల్‌మాల్‌ కేసుల్లో మరికొన్ని అరెస్ట్‌ ఉంటాయని అనుకుంటున్నారు. మొదట్లో కేసులకు భయపడిన పార్టీ నాయకత్వం కూడా ఇప్పుడు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేసులు తప్పవు.. ఓ వారం పదిరోజులు జైలూ తప్పదనేది టీడీపీలో ప్రధాన చర్చ. అందుకే ఏ కొత్త అరెస్టూ వారిని నివ్వెర పర్చడం లేదట. మొత్తంగా మరో మాజీ మంత్రి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు వెళ్లారు. రానున్న రోజుల్లో ఇంకెందరు వెళతారో తెలీని పరిస్థితి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Devineni Uma
  • TDP Leader
  • tdp leader devineni uma

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions