హుజురాబాద్‌లో జరిగేది చిన్న ఉపఎన్నికా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తుతున్న సమయంలో.. అదో చిన్న ఉపఎన్నిక అని కేటీఆర్ ఎందుకన్నారు? లోకల్ లీడర్లే అంతా చూసుకుంటారన్న ఆయన మాటల వెనక మతలబు ఏంటి? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న విశ్లేషణేంటి? లెట్స్ వాచ్!
హజురాబాద్ ఉపఎన్నిక మీద కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఆసక్తి!
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్‌లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్. మంత్రి హరీష్‌రావు బాధ్యతలు తీసుకుని పార్టీని గేరప్ చేస్తున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు.. పార్టీ సీనియర్ నాయకులు ఇంఛార్జ్‌లుగా ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ ఉపఎన్నికపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనేక విశ్లేషణలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్..మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఆసక్తి నెలకొంది.
బైఎలక్షన్‌పై హైరానా అక్కర్లేదన్న కేటీఆర్!
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఉపఎన్నికపై అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. హజురాబాద్ అనేది చిన్న ఉపఎన్నిక అని.. దానితో ప్రభుత్వం కూలిపోయేది లేదు.. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు అని కామెంట్ చేశారు కేటీఆర్. పైగా బైఎలక్షన్‌పై హైరానా అవసరం లేదనని తేల్చేశారు. హుజురాబాద్ టీఆర్ఎస్‌కు కంచుకోటగా విశ్లేషించారాయన.
ఉపఎన్నికను చిన్నఎన్నికగా పేర్కొన్న కేటీఆర్!
గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలోనూ మరోసారి హుజురాబాద్ ఉపఎన్నికను ప్రస్తావించారు కేటీఆర్. ఉపఎన్నిక చిన్న ఎన్నికగా మరోసారి అభివర్ణించారు. లోకల్ లీడర్లు చూసుకుంటారని పునరుద్ఘాటించారు కూడా. దీంతో హుజురాబాద్ ఉపఎన్నికపై కేటీఆర్ కామెంట్స్ వెనక అంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. మంత్రి హరీష్‌రావు, మరో సీనియర్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌లు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఫోకస్ పెట్టారు. ఇలా గులాబీ పార్టీ సీరియస్‌గా బైఎలక్షన్‌పై దృష్టి పెట్టిన తరుణంలో కేటీఆర్ ఎందుకలా అన్నారు అని ఆరా తీస్తున్నారట.
కేటీఆర్ కామెంట్స్‌పై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ!
ఇప్పట్లో అక్కడ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేలా లేదు. దీపావళి తర్వాతే పోలింగ్ ఉండొచ్చని అనుకుంటున్నారు. అప్పటి వరకు రాజకీయ వేడిని కాపాడుకుంటూ రావడం టీఆర్ఎస్, బీజేపీలకు సవాలే. అందుకే కేటీఆర్ కామెంట్స్‌పై పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. మరి.. అంతిమంగా ఈ వ్యాఖ్యల పరిణామాలు ఎలా తేలతాయో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్‌లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!