Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Amberpet Trs Politics

అంబర్‌పేట్‌ టీఆర్ఎస్‌లో పార్టీ కమిటీల చిచ్చు..!

Published Date :October 8, 2021 , 9:01 pm
By Manohar
అంబర్‌పేట్‌ టీఆర్ఎస్‌లో పార్టీ కమిటీల చిచ్చు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్నికల వరకు కలిసే ఉన్నారు. అన్నొస్తున్నాడంటే సందడి చేశారు. కానీ.. పార్టీ కమిటీల ప్రకటన వారి మధ్య గ్యాప్‌ తీసుకొచ్చేసింది. కత్తులు నూరుతున్నారట. గల్లీ గల్లీ గరంగరంగా మారినట్టు అధికారపార్టీ వర్గాల టాక్‌. ఇంతకీ ఏంటా పంచాయితీ?

ఎమ్మెల్యే కాలేరుపై కార్పొరేటర్లు, సొంత పార్టీ నేతల గుర్రు..!

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

కాలేరు వెంకటేష్‌. హైదరాబాద్‌ సిటీలో అంబర్‌పేట్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని GHMC కార్పొరేటర్లు, మాజీలు కాలేరు పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు తమ డివిజన్‌కు ఎమ్మెల్యే వస్తున్నారంటే.. కార్పొరేటర్లకు కాళ్లూ చేతులు ఆడేవి కావు. అలాంటిది సీన్‌ రివర్స్‌. స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు. డివిజన్లలో టీఆర్‌ఎస్‌ సంస్థాగత కమిటీల ప్రకటనే వారి మధ్య నిప్పు రాజేసిందని టాక్‌.

ఎమ్మెల్యే అనుచరులతో కమిటీలను నింపేశారని నేతలు గరంగరం..!

తమ పదవీ కాలం పదికాలాలపాటు పదిలంగా ఉండాలని కార్పొరేటర్లు భావించడం కామన్‌. ఇందుకోసం పార్టీ కమిటీలలో అనుచరులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ అనుచరులకు ఆ కమిటీలలో చోటు కల్పించాలని అనుకున్నారట. కానీ.. కమిటీల ప్రకటనకు వచ్చే సరికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌.. స్థానిక పార్టీ కార్పొరేటర్లను లైట్‌ తీసుకున్నారట. నియోజకవర్గంలోని అన్ని కమిటీలలో తన అనచరులను నింపేశారని కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పైగా.. ఆ కమిటీలపై చేసిన అర్ధరాత్రి ప్రకటనలు మరింత మంట పుట్టించాయట.

డివిజన్ల వారీగా కార్పొరేటర్లు.. మాజీలు సమావేశాలు..!

ప్రస్తుతం అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వచ్చేసిందట. రెండు వర్గాలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదట. రోడ్డున పడి రచ్చ చేసుకునేలా ఉన్నాయట గొడవలు. ప్రస్తుతం కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు డివిజన్ల వారీగా అనుచరులతో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఎమ్మెల్యే ఏకపక్షంగా కమిటీలను ప్రకటించారని.. వాటిని రద్దు చేసేలా టీఆర్ఎస్‌ పెద్దలపై ఒత్తిడి తేవాలని తీర్మానిస్తున్నట్టు టాక్‌.

కాలేరుపై పార్టీ పెద్దలకు కార్పొరేటర్ల ఫిర్యాదు?

అంబర్‌పేట్‌ నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉంటే.. రెండుచోట్లే టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గెలిచారు. వారిద్దరూ ఏకంగా టీఆర్ఎస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే.. కార్పొరేటర్లను, పార్టీ నేతలను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నలు సంధిస్తున్నారట. మరి.. ఈ గల్లీ సెగలను గులాబీ పెద్దలు ఎలా చల్లారుస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amberpet
  • amberpet trs
  • amberpet trs politics
  • Politics
  • TRS

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions