ఎన్నికల వరకు కలిసే ఉన్నారు. అన్నొస్తున్నాడంటే సందడి చేశారు. కానీ.. పార్టీ కమిటీల ప్రకటన వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చేసింది. కత్తులు నూరుతున్నారట. గల్లీ గల్లీ గరంగరంగా మారినట్టు అధికారపార్టీ వర్గాల టాక్. ఇంతకీ ఏంటా పంచాయితీ? ఎమ్మెల్యే కాలేరుపై కార్పొరేటర్లు, సొంత పార్టీ నేతల గుర్రు..! కాలేరు వెంకటేష్. హైదరాబాద్ సిటీలో అంబర్‌పేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని GHMC కార్పొరేటర్లు, మాజీలు కాలేరు పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు తమ డివిజన్‌కు…