వచ్చేఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీఆర్‌ఎస్ నేతల ఎత్తుగడలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గెలిచేవరకు ఒక టెన్షన్. గెలిచిన తర్వాత పదవి నిలుపుకొనేందుకు మరో టెన్షన్. నియోజకవర్గంలో పట్టు సాధించడంతోపాటు.. పార్టీలోని ప్రత్యర్థులపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే. లేదంటే వచ్చే ఎన్నికలనాటికి టికెట్ గ్యారెంటీ ఉండదు. ప్రస్తుతం ఆ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి అదేనట. సిట్టింగ్‌లు.. ఫిట్టింగ్‌లు ఓ రేంజ్‌లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు?
వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే టికెట్ కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మరోసారి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తుంటే.. ఈసారి ఎలాగైనా టికెట్ సాధించి బరిలో దిగాలని మరికొందరు సీనియర్లు పావులు కదుపుతున్నారట. ఇప్పటి నుంచి ప్లాట్‌ఫారం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలే పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి.
బోథ్‌లో టీఆర్‌ఎస్ ఓవర్‌లోడ్!
బోథ్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఓవర్‌లోడ్ అయిందని గులాబీ శిబిరంలో వినిపించే మాట. ఇక్కడ ఎమ్మెల్యేగా రాథోడ్ బాపూరావ్ ఉన్నారు. మాజీ ఎంపీ నగేష్, గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అనిల్ జాదవ్‌లు బలం చాటుకునేలా కార్యక్రమాలు సాగిస్తున్నారట. వీరిద్దరూ టికెట్‌పై కన్నేసినట్టు సమాచారం. అనుచరులను వెంటేసుకుని తిరగడం.. కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ వేసుకుంటున్నారట. ఎమ్మెల్యే కూడా పార్టీలోని ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళ్తుండటంతో టీఆర్‌ఎస్ రాజకీయం వాడీవేడీగా ఉందట.
ఖానాపూర్‌లో ఎమ్మెల్యే వర్సెస్ ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్
ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం సైతం ఆధిపత్యపోరుతో హీటెక్కుతున్నట్టు చెబుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ రెండోసారి గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారట ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్. ఎక్కువ సమయం ఉట్నూరులో ఉంటూ మంత్రాంగాలు చేస్తున్నట్టు సమాచారం. అటు ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇటు జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రచిస్తున్న వ్యూహాలు.. రేపోమాపో ఎన్నికలు అన్నట్టుగా ఉన్నాయట.
ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు వర్సెస్ కోవా లక్ష్మి
జిల్లాలో మరో ఎస్టీ నియోజకవర్గం ఆసిఫాబాద్‌లోనూ పాలిటిక్స్ గరంగరంగా ఉన్నాయట. గత ఎన్నికలలో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు గెలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఓడిపోయారు. ఆత్రం సక్కు తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరగా.. కోవా లక్ష్మి జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. నేతల మధ్య సఖ్యత లేదన్నది ఓపెన్ టాక్. నియోజకవర్గంలో ఎవరి వర్గం వారిదే. ఆధిపత్యం కోసం అప్పడప్పుడూ నేతలు చేసే పనులు రచ్చ రచ్చకు దారితీస్తుంటాయి కూడా. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని అనుచరులకు చెబుతున్నారట కోవా లక్ష్మి. ఈ విషయం పసిగట్టిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు.. తనదైన శైలిలో బలం చాటుతూ వెళ్తున్నారట.
ప్రత్యర్థుల కదలికపై కన్నేసిన సిట్టింగ్‌లు!
ఈ మూడు నియోజకవర్గాల్లో గ్రూప్‌వార్ తారాస్థాయికి చేరుకుంటున్నా.. నేతలు కలిసినప్పుడు మాత్రం నవ్వుతూనే పలకరించుకుంటున్నారు. ప్రత్యర్థుల కదలికలపై ఓ కన్నేసి ఉంచారట. మరి.. ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల్లో రాజకీయం ఎన్ని రంగులు మారుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్‌పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
-
Hi: ఆగస్టు 14న కవిన్‌తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!