Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Ysrcp Mudragada

Off The Record : మళ్లీ ఆయనేనా.. కుతకుతలాడుతున్న వైసీపీ నేతలు?

Published Date :February 10, 2026 , 10:24 pm
By Gogikar Sai Krishna
  • పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాక సైలెంట్‌
  • అంబటి ఎపిసోడ్‌లో లేఖాస్త్రంతో మళ్ళీ యాక్టివ్‌
  • ప్రభుత్వం కాపులను టార్గెట్‌ చేస్తోందంటూ లెటర్‌
  • పార్టీ చెప్పకుండా ఆయన అలా స్పందిస్తారా అన్న డౌట్స్‌
Off The Record : మళ్లీ ఆయనేనా.. కుతకుతలాడుతున్న వైసీపీ నేతలు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైసీపీ కాపు నేతలు కొందరు కుతకుతలాడిపోతున్నారా? అధిష్టానానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అవలేదా అంటూ నిర్మొహమాటపు కామెంట్స్‌ చేస్తున్నారా? జరిగిన డ్యామేజ్‌ చాలదా…? మళ్ళీ ఆయన్నే ముందుకు తీసుకొచ్చి ఏం సందేశం ఇద్దామనుకుటున్నారని తెగ ఫీలైపోతున్నారా? ఎవరి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆయన విషయంలో ఉన్న అభ్యంతరాలేంటి? ముద్రగడ పద్మనాభం అలియాస్‌ పద్మనాభరెడ్డి. వైసీపీ లీడర్‌. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తానని శపథం చేసి నెరవేరక పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారీ కాపు లీడర్‌. ఎన్నికల తర్వాత పెద్ద యాక్టివ్‌గా లేరు. ఆయన కొడుకు గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు అంబటి ఎపిసోడ్‌లో మరోసారి లేఖాస్త్రంతో ఆయన బయటికి రావడం ఇటు రాజకీయవర్గాల్లోను, అటు కాపు కులంలో కూడా చర్చనీయాంశం అయింది. రాష్ట్ర ప్రభుత్వం కాపులను కావాలనే టార్గెట్ చేస్తోందంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ముద్రగడ. గతంలో వంగ‌వీటి రంగా ,తర్వాత తాను, ప్రస్తుతం అంబటి అంటూ సుదీర్ఘంగా తన లెటర్‌లో ప్రస్తావించారు. మా కాపు జాతిని పక్క రాష్ట్రంలో అయినా కలిపేయాలంటూ…. ప్రభుత్వ పెద్దలను టార్గెట్‌ చేశారు పద్మనాభ రెడ్డి. సరిగ్గా ఇక్కడే అసలు చర్చంతా మొదలైంది. పేరు మార్చుకున్నాక బాగా సైలెంట్‌ అయిపోయిన నాయకుడు… పార్టీ నుంచి బ్రీఫింగ్‌ లేకుండా ఆ స్థాయిలో స్పందించే అవకాశం ఉండదన్నది ఎక్కువ మంది వాదన.

అంతా ఒక లెక్క ప్రకారం జరుగుతోందని అంటున్నారు. కాకినాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటు ఉన్నాయి. ఇక్కడి గెలుపు ఓటములను కాపు ఓటర్లే డిసైడ్‌ చేస్తారు. గత ఎన్నికల్లో వైసీపీ ఆరు చోట్ల కాపులకు ఛాన్స్‌ ఇచ్చింది. ఎంపీ టిక్కెట్‌ కూడా అదే సామాజిక వర్గానికి దక్కింది. కానీ… ఫలితాలు మాత్రం పూర్తి తేడాగా వచ్చాయి. ఆ సామాజిక వర్గం ఓటర్లు వైసీపీని పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోందన్న వాదన బలంగా ఉంది. ఫ్యాన్ పార్టీ కాపు నేతలు ఇప్పుడు ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం వైఖరే తమ కొంప ముంచిందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన పద్మనాభం పరిధి దాటి మాట్లాడారని, అదే పెద్ద మైనస్‌ అయిందన్నది కాకినాడ జిల్లా వైసీపీ కాపు నేతల అభిప్రాయం. ఆయన తీరు సొంత కులంలోనే తమకు నెగిటివ్ అయిందని అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని గమనించకుండా… తిరిగి ఇప్పుడు కూడా… తగుదునమ్మా అంటూ… పార్టీ మరోసారి ఆయన్ని తెర మీదికి తీసుకురావడం, హైప్ క్రియేట్ చేయడం అవసరమా అని గుసగుసలు ఆడుకుంటున్నారట. అయినా… ఆయన ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్‌, ప్రస్తుత రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదంటూ కొందరు వైసీపీ కాపు నాయకులే సెటైర్స్‌ వేస్తున్నట్టు సమాచారం.

2009లో కాంగ్రెస్ తరపున పిఠాపురంలో పోటీ చేసిన ముద్రగడ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారని, 2014లో ప్రత్తిపాడు నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి కనీసం పదివేల ఓట్లు కూడా తెచ్చుకోలేదని, ఇక 2024లో ఆయన పర్ఫామెన్స్ ఏ మాత్రం ఉందో అంతా చూశారుకదా అంటూ… కాకినాడ జిల్లా వైసీపీ నేతలు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారట.జిల్లాలో ఆయన పరిస్థితి ఏంటో మాకు తెలుసు. అందుకే దూరంగా ఉంటున్నామంటూ లోకల్‌ లీడర్స్‌ క్లారిటీగా చెప్పేస్తున్నారు. మిగతా వారికి విషయం తెలియక భ్రమల్లో ఉన్నారంటూ డైరెక్ట్‌ కామెంట్స్‌ టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు, ఆయన ఎప్పుడో కులం మార్చేసుకుని పద్మనాభరెడ్డి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కాపు పెద్దగా ప్రొజెక్ట్‌ చేయడం, ఆయనే రక్షకుడిలాగా లెటర్స్‌ రాయడం, మా ప్రతినిధిగా మాట్లాడ్డం ఏంటని అంటున్నారట జిల్లా కాపు నాయకులు. ఇంకొందరైతే… పార్టీ పెద్దలు కూడా గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితులను గమనించాలి, ఎవరి పలుకుబడి ఎంతో చూసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. గట్టిగా, నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… ప్రస్తుత జనరేషన్‌కు ఆయన మార్క్‌ పాలిటిక్స్ సరిపోవని, పద్మనాభం వల్ల కులంలో కొత్తగా వచ్చే బలం ఏమీ ఉండబోదన్నది వాళ్ళ మాట. పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కూడా అప్డేట్ అయితే బాగుంటుందని కూడా అంటున్నారు కొందరు కాకినాడ వైసీపీ కాపు నాయకులు. ఇలాంటి వ్యవహారాల వల్ల లోకల్‌గా తమకు డ్యామేజ్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ముద్రగడను కాపు నాయకుడి హోదాలో వైసీపీ అధిష్టానం ఎక్కువగా ప్రొజెక్ట్‌ చేయడం కొత్త కిరికిరిలకు దారితీస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది జిల్లాలో. అసలు కులంలోనే లేనని ఆయన ప్రకటించుకున్న తర్వాత ఆయనతో మళ్లీ ఈ పంచాయతీలు అవసరమా అన్నది ఎక్కువ మంది కాపు నేతల క్వశ్చన్‌. ఇకనైనా కుల పరమైన సున్నితమైన అంశాల జోలికి పద్మనాభ రెడ్డిని తీసుకురావద్దని సీరియస్‌గానే అంటున్నారు కొందరు. ఈ ఎపిసోడ్‌ ఏ టర్న్‌ తీసుకుంటుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • OTR
  • YSRCP

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions