OTR : తాతతో తంపులు తప్పవా? మనవరాలు ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాతతో తంపులు తప్పవా…? ఈయన ఎక్కడొచ్చార్రా…. బాబూ… అంటూ మనవరాలు మొత్తుకుంటున్నారా? లోకల్ వార్‌కు ముందు తాత మిత్రపక్షంలో చేరడాన్ని ఎమ్మెల్యే అయిన మనవరాలు నెత్తిమీద కుంపటిలా ఫీలవుతున్నారా? ఎవరా తాతా మనవరాళ్ళు? ఏంటా రాజకీయ కుటుంబ కథా చిత్రమ్? ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు… ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ తరపున ఇక్కడి నుంచి చట్ట సభకు వెళ్ళారాయన. 2024లో కూడా వైసీపీ తరపున పోటీ చేసి… తన మనవరాలు వరసయ్యే టీడీపీ అభ్యర్థి సత్యప్రభ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాస్త అటు ఇటుగా ఉన్న వరుపుల గత వారం జనసేన కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో…. గ్లాస్ కండువా కప్పుకుంటే తన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులకు కూడా ప్రాధాన్యం వస్తుందని లెక్కలేశారట ఈ సీనియర్ లీడర్. వరుసకు తాత, మనవరాలే అయినా… గత ఎన్నికల్లో సుబ్బారావు, సత్య ప్రభ ప్రత్యర్థులుగా ఉన్నారు. అంతకుముందు ఎన్నికల్లో సత్యప్రభ భర్త వరుపుల రాజా సుబ్బారావుతో పోటీపడ్డారు. రాజా చనిపోయాక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సత్యప్రభ. అయితే…. ఇప్పుడు తాత మిత్రపక్షంలో చేరడంఎమ్మెల్యేకి అంతగా ఇష్టం లేదట. అయినప్పటికీ అది జనసేన అంతర్గత వ్యవహారం కాబట్టి కామ్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. నియోజకవర్గంలో సాధారణంగా ఎమ్మెల్యేదే డామినేషన్. కానీ సుబ్బారావు చేరికతో ప్రత్తిపాడు కూటమిలో కొత్త పేచీలు వస్తున్నాయట. దాంతో…. అసలు ఆయన వల్ల ఉపయోగం ఏముంది? రిటైర్మెంట్ వయసులో పార్టీమారి ఏం చేస్తారంటూ సత్యప్రభ వర్గం ప్రశ్నిస్తోందంటున్నారు. గత ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్లను మిత్రపక్షం ఎలా ఎంకరేజ్ చేస్తుందని అడుగుతున్నారట. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వరుపుల రాజాపై లంపకలోవ సొసైటీలో అవకతవకలు జరిగాయని కేసు నమోదైంది. దాని వెనక అప్పట్లో సుబ్బారావు ప్రోత్సాహం ఉందన్నది సత్యప్రభ వర్గం డౌట్.
అలాంటి వారితో కలిసి ఎలా పనిచేయగలమని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీలోని ఒక వర్గం కూడా.. తెర వెనక కథ నడిపి మాజీ ఎమ్మెల్యేకి జనసేనలోకి లైన్ క్లియర్ చేయించిందన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మరోవైపు సుబ్బారావు మాత్రం రాజకీయాలంటే చాలా ఉంటాయని, అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలోనే అసలు కిటుకు ఉంటుందంటూ గడుసుగా సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. అవకాశం వచ్చినప్పుడు ఆ మాత్రం లీడ్ తీసుకోరా అంటూ రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారట ఆయన. బంధుత్వం వేరు, రాజకీయం వేరంటూ కూల్‌గా సమాధానాలు చెప్తున్నారట ఆయన. ఇదంతా పక్కన పెడితే ప్రత్తిపాడు జనసేనకు కో ఆర్డినేటర్ ఎవరూ లేరు. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి పార్టీ బాధ్యతల కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మేడిశెట్టి బాబి కూడా మరో వర్గంగా ఉన్నారు. అసలే నియోజకవర్గంలో పార్టీ రెండు షేడ్స్‌గా ఉంటే… మళ్ళీ సుబ్బారావు వచ్చి ఏం చేస్తారని జనసైనికుల్లోనే చర్చ జరుగుతోందట. ఆయన కూడా ఇంకో గ్రూపును క్రియేట్ చేస్తే గందరగోళం తప్ప ఏమీ ఉండదని అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పొత్తులకు అనుగుణంగా సీట్ షేరింగ్ ఉంటుంది. దానికితోడు పార్టీలోనే మూడు వర్గాలంటే.. ఎవరు వచ్చి ఏం చేస్తారో అర్ధం కాదని అంటున్నారట. మొత్తానికి తాత గ్లాస్ పట్టుకోవడంతో మనవరాలైన ఎమ్మెల్యే అలా జరిగి ఉండకూడదని అంటున్నారట. ఆయనగారి లాజిక్కులు మ్యాజిక్కులతో కొత్త తలనొప్పులు వస్తాయని అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు సుబ్బారావు మాత్రం తమ పార్టీ ప్రయారిటీ తమకు ఇచ్చి తీరాల్సిందేనని అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. ఇప్పటికే నియోజకవర్గం జనసేనలో రెండు గ్రూపులు ఉండగా….ఇక మీదట కొత్త పంచాయతీలు తప్పవంటూ మానసికంగా సిద్దమైపోతున్నారట ప్రత్తిపాడు జనసైనికులు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?