Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?
- గాంధీ ఫ్యామిలీకి అత్యంత లాయల్ వీహెచ్
- పార్టీ అధికారంలోకి వచ్చాక పదవి కోసం ఎదురు చూపులు
- ఎవరెవరికో వస్తున్నా నాకు రాలేదన్న నైరాశ్యం
- గతంలో రేవంత్‌ను వ్యతిరేకించినా పీసీసీ అధ్యక్షుడయ్యాక అనుకాలం
కాంగ్రెస్ హన్మంతుడికి పవర్ సంజీవిని దొరకదా? అసలు దొరికే ఛాన్స్ ఉందా…? లేదా…? తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, తన వయసు ఉన్నోళ్ళకు పదవులు వచ్చినా, పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకు సైతం అవకాశాలు వచ్చినా… ఆయనకు మాత్రం ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు? టైం కోసం వెయిటింగా..? లేక సర్దుకోమన్న సంకేతమా? లెట్స్ వాచ్.. వి.హనుమంతరావు…. కాంగ్రెస్ సీనియర్ లీడర్. అంతకుమించి పార్టీకి లాయలిస్ట్. పుట్టి బుద్దెరిగాక హస్తం గుర్తు తప్ప మరోటి తెలియని సిన్సియర్ కాంగ్రెస్ వాది. ఒకరకంగా చెప్పాలంటే… గాంధీ ఫ్యామిలీ అంటే పిచ్చి. అది కూడా… ఎంతలా అంటే… తాను ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నప్పుడు సోనియా గాంధీ ఫోన్ చేసి మాట్లాడగానే కోలుకున్న వ్యక్తి . అలాంటి నాయకుడు ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో ఒక పదవి వస్తుందని ఆశించారు.
అయినా రెండున్నరేళ్లు గడిచిపోయినా… కనీసం ఆ వాసన కూడా రాకపోవడంతో ఇక ఛాన్స్ వస్తుందో రాదోనన్న నైరాశ్యం పెరుగుతోందట. చాలామంది జంపింగ్ జపాంగ్‌లు ఉన్నా… పార్టీకి పవర్ లేనప్పుడు, కష్టకాలంలో కూడా మూడు రంగుల జెండా కిందే ఉన్నారాయన. ఆరోగ్యం సహకరించుకున్నా… నిత్యం ఏదో ఒక చోట… కాంగ్రెస్ కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు హన్మంతరావు. పీసీసీ అధ్యక్షుడు అవకముందు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినా…ఒకసారి ఆయన్ని నియమిస్తూ… పార్టీ నిర్ణయం తర్వాత…దానికే కట్టుబడి రేవంత్‌కు అనుకూలంగా పని చేశారాయన. దీన్ని బట్టే అధిష్టానం నిర్ణయాన్ని ఎంతలా గౌరవిస్తారో అర్ధం చేసుకోవచ్చని అంటారు రాజకీయ పరిశీలకులు. అలాంటి సీనియర్‌కు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా.. ఎలాంటి పదవి దక్కలేదన్న ఫీలింగ్ గాంధీభవన్‌లో చాలామందికి ఉందట.
Also Read
గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కేకే, డీఎస్ లాంటి వాళ్ళు పార్టీ మారారు. బయటా పదవులు పొందారు. కానీ వీహెచ్ మాత్రం పవర్‌తో సంబంధం లేకుండా…పార్టీలోనే ఉన్నారు. బయటకు వెళ్లిన నేతలు మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చారు, పదవులు కూడా పొందారు. వాళ్ళకే కాదు…. వాళ్ళ పిల్లలకు కూడా పోస్ట్‌లు వచ్చాయిగానీ….వీహెచ్‌కు రాకపోగా… ఆయన ఇప్పటికీ పార్టీ కోసం తపిస్తూనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడిదాకో.. ఎందుకు? తాజాగా ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు హన్మంతరావు. ఆ విషయాన్నే చెప్పుకుంటూ తెగ మురిసిపోతున్నారట ఆయన. రాహుల్ గాంధీని కలిశా… ఓబీసీ గురించి మాట్లాడా అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే ఆయనకు ఎనర్జీలాగా పని చేస్తుందన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు పదవులు పొందారు, తర్వాత వచ్చిన వాళ్ళకూ దక్కాయిగానీ…కురువృద్ధుడు వీహెచ్ మాత్రం అలాగే ఉండిపోయారంటూ చర్చ జరుగుతోంది కాంగ్రెస్‌లో. బీసీ సామాజిక వర్గానికి చెందిన హన్మంతరావుకు పార్టీ జాతీయ ఓబీసీ బాధ్యతలు ఇస్తారని చర్చ జరిగింది.
కానీ… దక్కలేదు. దీంతో… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు ఏదైనా అవకాశం ఇస్తారా..? లేదంటే ఏదో ఒక సభలో సభ్యుడిగా ఛాన్స్ ఉంటుందా? అన్నది చూడాలంటున్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి లాంటి నేతలు vh కి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారుగానీ వర్కౌట్ అవలేదు. vh అవకాశం కోసంఎదురు చూస్తుంటే… పార్టీ నాయకత్వం సరైన సమయం కోసం చూస్తోందా? సందర్భం కోసం వెయిటింగా అనేది చూడాలి. శ్రీరాముడికి హనుమంతుడు ఎంత విధేయంగా ఉన్నాడో…. ఈ హన్మంతు కూడా కాంగ్రెకు అంతే లాయల్‌గా ఉన్నారని, మరి ఆయనకు సంజీవని దొరుకుతుందో లేదో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం
-
Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…
-
US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
-
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!