Off The Record : తెలంగాణ బీజేపీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందా?
- తెలంగాణ బీజేపీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందా?
- కొందరు నేతల తీరుపై పార్టీ పెద్దల అసహనం
- జిల్లా అధ్యక్షుల నుంచే యాక్షన్ మొదలవబోతోందా?
- కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు దారుణంగా ఉందన్ననివేదికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీలో యాక్షన్ సీక్వెల్ మొదలవబోతోందా? పార్టీ పెద్దలు గట్టిగానే కత్తులు నూరుతున్నారా? పూర్తి ప్రక్షాళనకు సమయం ఆసన్నమైనట్టు భావిస్తున్నారా? దొరికిన డబ్బును దొరికినట్టు బొక్కేస్తున్న వాళ్ళ మీద వేటేయడానికి రంగం సిద్ధమైందా? ఎవరా నాయకులు? వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటోంది నాయకత్వం? కమలంలో క్రమశిక్షణ లోపిస్తోందా? కొందరు జిల్లా అధ్యక్షుల పని తీరు బాగాలేదా…? ఎన్నికల డబ్బును కూడా మిస్యూజ్ చేశారా అంటే… అన్ని ప్రశ్నలకు ఎస్ అన్నదే పార్టీ వర్గాల మాట. ఈ అవలక్షణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పూర్తి ప్రక్షాళనకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొందరి వ్యవహారంపై పార్టీ పెద్దలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకలా ప్రవర్తిస్తున్నారు…? అసలు వాళ్లేమనుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అందుకే జిల్లా స్థాయి నుంచి పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రక్రియను ఎక్కడో ఒక చోట నుంచి మొదలు పెట్టాలి కాబట్టి ముందు క్రమశిక్షణను ఉల్లంఘించిన వారితోనే యాక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
అలాంటి వాళ్ళ విషయంలో కఠినంగానే ఉండాలని అనుకుంటోంది నాయకత్వం. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం కొందరు జిల్లా అధ్యక్షుల పనితీరు అధ్వాన్నంగా ఉందట. కొందరు అస్సలు పని చేయడం లేదు, మరి కొందరి పెర్ఫార్మెన్స్ ఏం బాగోలేదని చెబుతున్నారు. ఆ లెక్కన కనీసం పది మంది జిల్లా అధ్యక్షులనైనా మార్చాలన్న ప్రతిపాదనలు ఉన్నాయట. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చుల కోసం పార్టీ పంపించిన డబ్బును అడ్డంగా నొక్కేశారట కొందరు జిల్లా అధ్యక్షులు.
ఈ వ్యవహారంలో ఢిల్లీ పెద్దలు బాగా సీరియస్ అయినట్టు సమాచారం. ఇదేం పద్ధతి, అవేం బుద్ధులు అని రాష్ట్ర నాయకుల్ని అడిగినట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితులు, పరిణామ క్రమంలోనే కొందరు జిల్లా అధ్యక్షులను మార్చమని సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఎక్కడో ఒక చోటి నుంచి త్వరగా యాక్షన్ మొదలుపెట్టమంటూ రాష్ర్ట అధ్యక్షుడి మీద కూడా వత్తిడి వస్తోందట. ఒకవేళ డైరెక్ట్‌గా మార్చడానికి ఇబ్బందులు ఉంటే….మొదట నోటీసులు ఇచ్చి తరవాత చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో కూడా స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్ రావు ఇవే తరహా సంకేతాలు ఇచ్చారు. కొందరు జిల్లా అధ్యక్షులను మార్చాలంటూ మరోవైపు స్థానిక నేతలు కూడా ఒత్తిడి చేస్తున్నారు… మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, తర్వాత ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక టైంలోనూ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై కూడా ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది. అందులో కొద్దిమంది పెద్దలు ఉండడం, కేంద్ర పార్టీ చర్యలు తీసుకోవాల్సి రావడంతో వారి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారట. ఓవరాల్‌గా పెద్దల విషయంలో కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి పర్మిషన్ వచ్చాక యాక్షన్ పార్ట్ స్టార్ట్ అవుతుందని అంటున్నాయి బీజేపీ వర్గాలు.
Also Read
- Tags
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
-
TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!