OTR : వైఖరి మార్చిన బీజేపీ ఆత్మరక్షణలో ఇంకెన్నాళ్ళంటూ తాజాగా పార్టీలో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ స్టైల్ మార్చిందా? ఇక కామ్‌గా ఉంటే లాభం లేదని డిసైడ్ అయిందా? తన సహజ శైలికి, గతానికి పూర్తి భిన్నంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాయిస్ పెంచడం అందులో భాగమేనా? రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మారిన కాషాయ వైఖరేంటి? కొత్త యుద్ధం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్, ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డి కొంత కాలంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. అందులోనూ… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీద విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో… తమ మీద వస్తున్న విమర్శలకు వివరణలు ఇచ్చుకోవడంతోనే కాషాయ నేతలకు పుణ్యకాలం గడిచిపోతోంది. అయితే….. తాజాగా ఆ పార్టీలో కొత్త చర్చ మొదలైందట. ఇలా… ఇంకెంత కాలం? ఆత్మరక్షణలో పడి సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే… మొత్తంగా పార్టీకే నష్టమన్న అభిప్రాయం బలపడుతోందట. అందుకే ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదన్న క్లారిటీకి వచ్చి…. రివర్స్ అటాక్ మొదలు పెట్టిందట కమలం. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే… ఈ విషయం అర్దమవుతోందని, తెలంగాణ బీజేపీ పూర్తిగా అఫెన్స్ మోడ్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మామూలుగా అయితే… కిషన్‌రెడ్డి తీరు అది కాదని, తన సహజ శైలికి భిన్నంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల మీద హాటు ఘాటు విమర్శలు చేస్తున్నారంటే అది కచ్చితంగా మారిన పార్టీ వైఖరిలో భాగమేనని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి మీద కౌంటర్ ఎటాక్ చేయకపోతే పార్టీ కేడర్‌లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం బీజేపీ లీర్స్లో ఉందట. అందుకే ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు. కేంద్రమంత్రి తాజాగా అన్న మాటలనే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నాయి రాజకీయ వర్గాలు. రేవంత్ రెడ్డీ…. ఆట నువ్వు మొదలు పెట్టావు… 2028లో ఆ ఆటను మేము ముగిస్తాం. నన్ను తెలంగాణ నుంచి తరిమికొట్టే వాడు ఇంకా పుట్టలేదు… నేను చేతకాని రాహుల్ గాంధీ నాయకత్వం పని చేయడం లేదు. మా రాజీనామాలు సరే…. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేని మీ సంగతి ఏంటంటూ గతంలో ఎన్నడూ లేనతం ఘాటుగా రేవంత్ మీద మాటల దాడి చేశారు కిషన్. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని సెంట్రల్ మినిస్టర్ టార్గెట్ చేస్తున్నా… ప్రస్తుతం ఆ డోస్ బాగా పెరిగిపోయింది. ఇటు సీఎం కూడా అదే రేంజ్లో బీజేపీని కార్నర్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లను కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు సీఎం. దీంతో…ఉన్నట్టుండి ఆ మార్పు ఏంటన్న చర్చలు నడుస్తున్నాయి. కిషన్ రెడ్డి పై రేవంత్ వాడుతున్న భాష విషయంలో కూడా బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అటు కిషన్ రెడ్డి కూడా… రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్ట్‌ని నేను అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ రకంగా ఇద్దరి మధ్య డైరెక్ట్‌గా కౌంటర్, ఎన్కౌంటర్స్ గట్టిగా నడుస్తున్నాయి. తగ్గేదే లే అన్నట్టు రెండు పక్షాలు వ్యవహరిస్తుండటంతో ఈ వైరం ఎంత దూరం పోతుందోనని గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
Also Read
- Tags
- ntv
- OTR
- Telangana BJP
తాజావార్తలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్‌పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
-
Bhatti Vikramarka : ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా పనిచేయాలి
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!