Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్ట్రాటజీ ఫెయిలైందా? లోకల్ లీడర్ల నిర్లక్ష్యమా?
- బీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్
- నారాయణపేట, కరీంనగర్‌లో ఎగిరిన కాషాయ జెండా
- కాస్త దృష్టిపెడితే ఇంకొన్ని మున్సిపాలిటీలు వచ్చేవా?
- ఇద్దరు ఇండిపెండెంట్స్‌ని మేనేజ్ చేస్తే ఆదిలాబాద్ దక్కేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ సరిగా వర్కౌట్ చేయలేకపోయిందా? వచ్చిన ఫలితాలే అంతంత మాత్రం అయితే… ఉన్న అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందా? ఇంకాస్త దృష్టి పెడితే మరిన్ని పదవులు దక్కించుకోగలిగేదన్న మాటల్లో నిజమెంత? అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకమంటూ చెప్పిన భారీ డైలాగ్స్ అన్ని చోట్ల ఎందుకు అప్లయ్ అవలేదు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నచోట కూడా ఎందుకు మున్సిపాలిటీలను కైవసం చేసుకోసేకపోయింది కమలం? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వచ్చేసింది. ఇంకో 11 మున్సిపాల్టీలు తప్ప అన్నిచోట్ల మున్సిపల్ ఛైర్మన్స్, కార్పొరేషన్ మేయర్స్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎట్టకేలకు కమలం పార్టీ ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాల్టీని కైవసం చేసుకోగలిగింది. నారాయణపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవుల్ని దక్కించుకుంది కమలం. అలాగే…. కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పోస్ట్‌లు ఆ పార్టీ కైవసం అయ్యాయి. ఈ రెండు చోట్ల తప్ప ఇంకెక్కడా ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే…. ఇంకొన్ని మున్సిపాలిటీల్ని చేజిక్కించుకునే ఛాన్స్ ఉన్నా… ఆ దిశగా దృష్టి పెట్టలేదు కాషాయ పెద్దలు.
ఆదిలాబాద్‌లో ఇద్దరు ఇండిపెండెంట్స్‌ని మేనేజ్ చేసుకుంటే పీఠం ఆ పార్టీకే దక్కేదని, కానీ… ఆ పని చేయడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. అక్కడ మిగతా పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రాయికల్, మెట్‌పల్లిలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ… చైర్ పర్సన్ ఎన్నికను వదిలేసింది. అలా ఎందుకంటే….అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకం అని చెప్పిన బీజేపీ…. అన్ని చోట్ల అదే మాట మీద నిలబడలేకపోయింది. ఆ పార్టీ స్థానిక నాయకత్వం గట్టిగా ఆలోచన చేసి ఉంటే… మరికొన్ని చోట్ల వైస్ ఛైర్మన్ పదవులైనా దక్కించుకునేదన్న మాటలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం సొంతంగా నిర్ణయం తీసుకున్న చోట్ల ఎవ్వరూ ఊహించని విధంగా…. బీజేపీ వైస్ చైర్మన్ పదవులను దక్కించు కోగలిగింది.
Also Read
దీంతో… అన్నిచోట్ల అలా చేస్తే కచ్చితంగా ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని, కొన్నిచోట్ల లోకల్ లీడర్స్ సీరియస్‌గా తీసుకోకుండా వదిలేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే విషయమై కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోందట.బీజేపీ కౌన్సిలర్స్ కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు మద్దతివ్వగా…. మరి కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. అలా చేసిన చోట్లలో ఉపాధ్యక్ష పోస్ట్‌లు కొట్టేశారు. పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులు కొందరు మరో పార్టీకి ఓటేసినట్టు తెలిసింది. ఓవరాల్‌గా చూస్తే… ఫలితాల వెల్లడి తర్వాత పూర్తిగా చేతులెత్తేయకుండా… బీజేపీ నాయకులు ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే… మరికొన్ని పదవులు పార్టీ ఖాతాలో పడి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయవర్గాల్లో.
- Tags
- bjp
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?