Off The Record : లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ కొత్త ఎత్తులు
- కేంద్ర నిధుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ కొత్త ప్రచారం
- ఇన్నాళ్లు సరిగా చెప్పుకోలేకపోయామన్న అభిప్రాయం
- అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలన్న నినాదం
- కేంద్ర నిధులతోనే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయంటున్న కమలం
- ఎరువుల సబ్సిడీ గురించి గ్రామ గ్రామాన ప్రచారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం తెలంగాణ బీజేపీ కొత్త ఎత్తులేస్తోందా? ఇన్నాళ్ళు… ఎక్కడ, ఎందుకు వెనకబడ్డామో… ఆ పార్టీకి ఇప్పుడు తెలిసొచ్చిందా? అందుకే ఇప్పటికైనా మించిపోయిందేం లేదనుకుంటూ… పార్టీ లీడర్స్‌కు స్పెషల్ మైకులు అందిస్తోందా? ఇంతకీ ఏ విషయంలో బీజేపీ రియలైజ్ అయింది? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో జనానికి ఏం చెప్పాలనుకుంటోంది? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కొత్త అస్త్రానికి పదును పెడుతోందట. ఇన్నాళ్ళు అనుసరించిన వ్యూహానికి భిన్నంగా ఇప్పుడు కేంద్ర ప్రాధాన్యతను వివరిస్తూ…తమను తాము హైలైట్ చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే… కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టుకోవడం ఎంత ముఖ్యమో ఊరూరా వివరించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇన్నాళ్ళు సరిగా ప్రజెంట్ చేయలేకపోవడం వల్లే నష్టపోయామని భావిస్తున్న కాషాయ దళం ఇప్పుడా లోటును భర్తీ చేసుకుని ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోందట. గ్రామాలకు కేంద్ర నిధులు రావాలన్నా…అభివృద్ధి జరగాలన్నా… బీజేపీని గెలిపించాల్సిందేనన్న నినాదాన్ని అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే గ్రామాలకు కళ వస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి పుష్కలంగా నిధులు వస్తే… అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్నారు కమలం నేతలు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని అంటున్నారు బీజేపీ లీడర్స్.
ఉచిత బియ్యంతోపాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల అకౌంట్లలో క్రమం తప్పకుండా నిధుల్ని కేంద్రమే జమ చేస్తోందని చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు, ఇంటింటికీ నీళ్లు వంటి కార్యక్రమాలన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని, ఎరువుల సబ్సిడీని కూడా కేంద్రమే ఇస్తోందన్న ప్రచారాన్ని గ్రామగ్రామాన చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట. గతంలో బీఆర్‌ఎస్ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కేంద్ర నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాలు దెబ్బతిన్నాయని, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితి మారకపోగా… ఇచ్చిన రైతు భరోసా వాగ్దానం అమలులో కూడా విఫలమైందని అంటున్నారు కాషాయ నేతలు. ఎరువుల పంపిణీ చేతకాక కృత్రిమ కొరతకు పూర్తి బాధ్యులు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలేనని ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్స్. ఇక కేంద్ర ప్రభుత్వం పథకాలు, రాష్ర్ట ప్రభుత్వాలు చేసింది, చేస్తున్నదాన్ని పోల్చి చూపెట్టి ప్రజల్ని తమ వైపునకు తిప్పుకోవాలనే ఎత్తుగడ కమలం పార్టీకి ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వల్ల గ్రామాలు నిర్వీర్యం అయ్యాయని, తాము గెలిస్తే మళ్ళీ కళకలలాడుతాయని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. మరి లోకల్ వార్‌లో కమలం పార్టీ వేసిన స్కెచ్ సక్సెస్ అవుతుందా… బీజేపీ చెప్పుతున్న దానికి ప్రజలు కనెక్ట్ అయ్యి ఓట్లు గుద్దేస్తారా? లేదా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Also Read
- Tags
- bjp
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!