Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Tdp And Janasena 3

Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?

Published Date :April 25, 2026 , 7:13 pm
By NTV WebDesk
  • నెల్లూరు జిల్లా జనసేన సభ్యత్వ నమోదుకు అష్టకష్టాలు
  • గతంలో 25వేలు, ఈసారి బాగా పెరగాలని టార్గెట్‌
  • పార్టీ సభ్యత్వ రుసుము 400 రూపాయలు
  • అంత పెట్టడానికి ఆసక్తి చూపని సాధారణ ప్రజలు
Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీడీపీ, జనసేన మిత్రపక్షాలన్నది అందరికీ తెలిసిందేగానీ… అక్కడ మాత్రం అంతకు మించి అన్నట్టుగా ఉందా? కష్టాల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకోవడానికి అక్కడి తెలుగుదేశం నాయకులు డబ్బుల కట్టలు తీశారా? వాడుకోండి బ్రోస్‌… అంటూ ఉదారంగా ఇచ్చేశారా? జనసేన నేతలు సైతం బతికించారు బ్రదర్‌ అంటూ… పరిపరి విధాలా థ్యాంక్స్‌ చెబుతున్నారా? ఎక్కడ బలపడుతోందా కొత్త బంధం? ఏంటా కట్టల కథ? ఉద్యమి పేరుతో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది జనసేన. అది రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే… ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రం కాస్త తేడాదా జరిగిందట. ప్రధాన సెంటర్లలో టెంట్లు వేసుకుని మరీ… సభ్యత్వ నమోదు చేయించారు పార్టీ నాయకులు. ఒక్కో నియోజకవర్గంలో తాము చెప్పిన టార్గెట్‌ రీచ్ అవ్వాలంటూ అధిష్టానం గట్టిగా చెప్పడంతో…నానా తంటాలు పడ్డారు. గతంలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో 25 వేల సభ్యత్వాలు చేయిస్తే.. ఈసారి అంతకు మించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

 

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
  • Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..

ఐతే… జనంలో ఆ స్థాయి స్పందన కనిపించకపోవడంతో… పరువు పోతుందని భయపడ్డ జిల్లా జనసేన నాయకులు టీడీపీ మీద ఆధారపడ్డారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. అన్నిటికీ మించి పార్టీ సభ్యత్వ రుసుము 400 రూపాయలు కావడం బాగా ఇబ్బందిగా మారిందట. అంత మొత్తం కట్టి సభ్యత్వం తీసుకోవడానికి సామాన్య ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో… చేసేదేం లేక డబ్బు తాము కట్టి సభ్యత్వాలు నమోదు చేయాలని డిసైడయ్యారు. కానీ… తీరా రంగంలోకి దిగేసరికి అంత మొత్తం తమకు కూడా ఆర్థిక భారంగా ఫీలైన కొందరు నాయకులు కొత్తగా ఆలోచించి టీడీపీ నేతల తలుపుతట్టినట్టు తెలిసింది. నెల్లూరు జిల్లా జనసేన నాయకులకు టీడీపీ మంత్రులు, ఎంపీలతో సత్సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని సభ్యత్వ నమోదుకు కావాల్సిన డబ్బును వాళ్ళనుంచే తీసుకున్నారట.

మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలతో గ్లాస్‌ లీడర్స్‌కు మంచి ర్యాపో ఉందట. అందులోనూ…. ముఖ్యంగా మంత్రి నారాయణను ప్రతిపక్షాలు విమర్శిస్తే…టీడీపీ నేతలకంటే ఎక్కువగా జనసేన నాయకులే బాధపడతారన్నది లోకల్‌ టాక్‌. వెంటనే కౌంటర్ ఇచ్చి.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతుంటారు. దీంతో జనసేన సభ్యత్వ నమోదుకు కావాల్సిన సొమ్మును నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి కూడా సమకూర్చినట్టు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎక్కువ మందిని చేర్పిస్తే పార్టీలో వారికి అంత గౌరవం దక్కుతుందన్న లెక్కలో టీడీపీ నాయకుల సాయంతో కొందరు జనసేన నేతలు టార్గెట్‌ పూర్తి చేసినట్టు తెలిసింది. జిల్లాలో యాక్టివ్‌గా ఉండే ఒకరిద్దరు నాయకులు టీడీపీ లీడర్స్‌ ఇచ్చిన డబ్బుతోనే మెంబర్‌షిప్‌ టార్గెట్‌ పూర్తి చేశారని గ్లాస్‌ పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్‌ మీద ఉన్న అభిమానంతో కొందరు స్వచ్చందంగా సభ్యత్వం తీసుకున్నా…. ఎక్కువ శాతం మనీ మేటర్‌ కావడంతో…అలా జరిగిపోయిందని అంటున్నారు. అయితే… జిల్లా మొత్తం మీద ఇదే పరిస్థితి లేదు.

 

కొన్ని చోట్ల స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు, జనసేన నాయకులకు మధ్య సఖ్యత లేదు. అలాంటిచోట్ల ఉన్నంతలోనే పని పూర్తి చేసి మమ అనిపించారట. కానీ… జిల్లా పదవులు ఆశించే కొందరు నేతలు మాత్రం టిడిపి నాయకుల సహాయ సహకారాలతో భారీ టార్గెట్స్‌ రీచ్‌ అయినట్టు తెలిసింది. ఈ విషయమై జనసేనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాము స్వచ్ఛందంగా సభ్యత్వాలు చేయిస్తే…. కొందరు నేతలు కక్కుర్తిగా పక్క పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మరీ గొప్పలకు పోయారని విమర్శిస్తోంది ఒక వర్గం. జనసేన సభ్యత్వ ప్రక్రియ ముగిసిపోయినా…. ఈ డబ్బుల ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మిత్రపక్షాలుగా రెండు పార్టీల నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం మంచిదే అయినా… సభ్యత్వ నమోదుకు ఆర్థిక సాయం తీసుకోవడాన్ని మాత్రం కాస్త తేడాగానే చూడాలని అంటున్నాయి రాజకీయవర్గాలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • OTR
  • TDP AND JANASENA

తాజావార్తలు

  • RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…

  • US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..

  • KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..

  • Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions