చిరంజీవి కరెక్టా? లేక పవన్ కళ్యాణ్ కరెక్టా..? వాళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్పారు? ఎవరిది అబద్దం?…….ఏం… తమాషా చేస్తున్నారా? ఏంటా పిచ్చి ప్రశ్నలు, మెగా బ్రదర్స్ గురించి అలాంటి క్వశ్చన్స్ వేయడానికి మీకెంత ధైర్యం అని అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్… అక్కడికే వస్తున్నాం. అ,సు చిరంజీవి, పవన్‌లో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్దమాడుతున్నారన్న ప్రశ్నల బ్యాక్‌గ్రౌండ్ వేరే ఉంది. లెట్స్ వాచ్. అన్నేమో….. సాదరంగా ఆహ్వానించారని చెబుతారు, తమ్ముడేమో… అవమానించారని అంటారు. ఏది నిజం? ఇద్దరిలో ఎవరు కరెక్ట్? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఇది. అదీ కూడా… మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గురించే కావడం ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలతో….రేగిన వివాదం చుట్టూ…ఇప్పుడు రకరకాల అనుమానాలు రేగుతున్నాయట. అప్పటి సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడటం, అందుకు కౌంటర్‌గా చిరంజీవి స్టేట్మెంట్‌తో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. బాలకృష్ణ, చిరంజీవి మధ్య వ్యవహారం ఎలాఉన్నా… ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి పెద్ద చిక్కు వచ్చిపడిందంటున్నారు పరిశీలకులు.
ఒక వైపు తన అన్న మెగాస్టార్ చిరంజీవి, మరో వైపు తానున్న కూటమిలోని కీలక నాయకుడు బాలకృష్ణ. అలా… ఇద్దరి మధ్య డిప్యూటీ సీఎం గట్టిగా ఇరుక్కుపోయారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శాంతిభద్రతలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు వచ్చిన ప్రస్తావన హాట్ టాపిక్ అయింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ…, గతంలో జగన్ సినీ ప్రముఖుల్ని అవమానించారని, ముఖ్యంగా చిరంజీవికి తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. అందుకు సభలోనే ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. అవమానం జరిగిందన్నది నిజమేగానీ… కామినేని చెప్పిన విధానం తప్పు అంటూ ఖండించారాయన. అంతే కాకుండా.. ఆరోజున చిరంజీవి గట్టిగా మాట్లాడలేదంటూ వ్యంగ్యాన్ని జోడించారు. దీంతో ఈ ఇష్యూ ఒక్కసారిగా బాలయ్య VS చిరంజీవిగా టర్న్ అయింది. ఈ వివాదం రగులుతుండగానే… చిరంజీవి ముందుకు వచ్చి పూర్తి క్లారిటీ ఇచ్చారు. 2022 ఫిబ్రవరిలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తమకు ఎలాంటి అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చేశారాయన. జగన్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చలు జరిగాయి అంటూ… స్టేట్మెంట్ ఇచ్చారాయన. తనకు ఎప్పుడూ ఎవరి దగ్గరైనా గౌరవం ఇచ్చి పుచ్చుకునే స్వభావం ఉందని తేల్చి చెప్పారు మెగాస్టార్.
ఇక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చిక్కు మొదలైందంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు… చాలా వేదికల మీద ఈ అంశాన్ని ప్రస్తావించారు జనసేనాని. దాదాపు ప్రతి సందర్భంలోనూ…. జగన్ నా అన్నయ్యను అవమానించాడంటూ… గట్టిగా ప్రచారం చేశారు పవన్. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా… ప్రతి చోట పవన్ అన్న మాటల మీద ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. పవనేమో… నా అన్నను అవమానించారని అన్నారు. ఇప్పుడు చిరంజీవి మాత్రం నాకు ఎలాంటి అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం? ఏది కరెక్ట్ అన్న చర్చలు కొత్తగా మొదలయ్యాయి. గతంలో తాను చెప్పింది తప్పని పవన్ ఒప్పుకుంటారా? లేక పాత వాదనకే కట్టుబడి ఇప్పుడు సభలో బాలకృష్ణ చెప్పిందే నిజమని అంగీకరిస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ రెండూ కాకుండా… రాజకీయం కోసం పవన్ సొంత అన్నను కూడా వాడేశారంటూ…. కొందరు చేసే వ్యాఖ్యలతో జనం ముందు దోషిగా నిలబడతారా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. ఇన్ని రకాల అనుమానాలు మధ్య పవన్ గట్టిగానే ఇరుక్కున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇప్పటి వరకు పవన్ వాదన, కూటమి స్టాండ్ కూడా…ఒక్కటే.
జగన్ సినీ ప్రముఖులను అవమానించారన్నదే. కానీ చిరంజీవి మాత్రం తనకు ఎలాంటి అవమానం జరగలేదని చెబుతున్నారు. దీంతో… అన్నయ్యకు అవమానం అంటూ ఇన్నాళ్ళుగా పవన్ మాట్లాడింది నిజమా? రాజకీయం కోసం ప్రచారం చేసిన అబద్దమా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడీ ఇష్యూలో పవన్‌కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడినా, లేదా మౌనం వహించినా ఇబ్బందేనన్నది వాళ్ళ అబిప్రాయం. తన అన్నయ్య చెప్పిందే నిజమని అంటే… ఇన్నాళ్ళు తాను అబద్ధం చెప్పానని అంగీకరించాల్సి ఉంటుంది, అదే సమయంలో కూటమి వాదనను దెబ్బతీసినట్లవుతుంది. అలాగని కూటమి కోపు ఎత్తుకోవాలంటే….స్వయంగా తన అన్నయ్యను తానే తప్పుపట్టినట్లవుతుంది. పవన్‌కు ఇది ఖచ్చితంగా ఇరకాటమేనని చెప్పుకుంటున్నారు. ఇలాంటివి రాజకీయాల్లో పెద్ద చిక్కులు తెస్తాయి. దీనిమీద డిప్యూటీ సీఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.