OTR : పంచకర్ల రమేష్ Vs గండి బాబ్జీ.. పెందుర్తి కూటమిలో కోల్డ్ వార్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ ఎమ్మెల్యే మడత పేచీ… ఏకంగా టీడీపీకి జెడ్పీ పీఠాన్ని దూరం చేసిందా…?. ఛాంపియన్ అవ్వాల్సిన చోట ఛాన్స్ జనసేనకు వెళ్ళడానికి ఆయన వైఖరే కారణమా…? జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టాలన్న టీడీపీ ఇన్ఛార్జ్ వ్యూహం ఎక్కడ బెడిసి కొట్టింది? గిల్లి.. జోలపాడితే సహించేది లేదన్న శాసనసభ్యుడి హెచ్చరికలు దేనికి సంకేతం…? అసలు ఎవరా ఇద్దరు నాయకులు? పంచకర్ల రమేష్ బాబు… సీనియర్ ఎమ్మెల్యే, అనకాపల్లి జిల్లా జనసేన అధ్యక్షుడు. గండిబాబ్జీ…మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. ఈ ఇద్దరు నేతల కేరాఫ్ అడ్రస్ పెందుర్తి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలతో వైసిపికి చెక్ పెట్టిన నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ పీక్స్‌కు చేరిందట. ప్రత్యక్షంగానో….పరోక్షంగానో పైచేయి కోసం జరుగుతున్న ప్రయత్నాలు రాజకీయ వేడిని రెట్టింపు చేస్తున్నాయి. రాజకీయంగా, సామాజికంగా బలమైన నాయకులు కావడంతో బాబ్జీ వెర్సెస్ రమేష్ బాబు వ్యవహారం కాస్తా జనసేన, టీడీపీ మధ్య గ్యాప్‌నకు కారణమవుతోందన్న ఆందోళన కూటమి వర్గాల్లో పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు, వాటి తాలూకూ రాజకీయ ప్రకంపనలే ఇందుకు నిదర్శనం అంటున్నారు. పంచకర్ల ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి నియోజకవర్గంపై రాజకీయ పెత్తనం కోసం గండి బాబ్జీ, ఆయన వర్గం ఎత్తులు వేసిన ప్రతీసారీ రచ్చ తప్పడం లేదు.
భాగస్వామ్య పక్షంగా ఇన్నాళ్ళు ఈ పరిణామాలను మౌనంగా భరించిన ఎమ్మెల్యే… ఎట్టకేలకు నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేశారనే కొత్త చర్చకు మొదలైంది పెందుర్తిలో. ఏ పార్టీ నాయకుడు ఎంత బలవంతుడైనా… శాసనసభ్యుడి నిర్ణయమే నియోజకవర్గంలో ఫైనల్ అనే లక్ష్మణ రేఖ గీసుకున్నాయి కూటమి పార్టీలు. ఈ లైన్ దాటిన చోట విభేదాలు పెరుగుతుండగా…పెందుర్తిలో ఆ డోస్ మరికాస్త ఎక్కువైందట. దీనికి జెడ్పీ ఎన్నికలు ముందు, వెనుక జరిగిన పరిణామాలు కీలకంగా మారాయి. కూటమి ధర్మాన్ని ఎమ్మెల్యే నమ్మితే…చీకటి తంత్రం రచించిన టీడీపీ నాయకులు భంగపడ్డారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ… అసలేం జరిగిందంటే….పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం… విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అంతర్భాగంగా ఉంటుంది. సబ్బవరం, పరవాడ మండలాలు అనకాపల్లి జిల్లా పరిధిలోకి వస్తే…పెందుర్తి మండలం ఎక్కువ భాగం గ్రేటర్ విశాఖలో ఉంటుంది. రూరల్ పరిధిలోని గ్రామాలతో మండల పరిషత్ నడుస్తోంది. ఇక జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సర్దుబాట్లు చేసుకున్నాయి.
Also Read
ఆ క్రమంలో.. సబ్బవరం, పరవాడ జెడ్పీటీసీలు జనసేన గెలుచుకోగా… పెందుర్తి స్థానం టీడీపీ పరమైంది. మండల పరిషత్లలోనూ ఇదే రేషియో పాటించగా…సబ్బవరం మండల ఉపాధ్యక్ష పదవి బిజెపికి దక్కింది. బంగారమ్మపాలెం ఎంపీటీసీకి బీ ఫార్మ్ ఇవ్వగా…జనసేన మద్దతు తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఆఖరి నిముషంలో వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ… తన వర్గీయుడిని పోటీకి దింపి గెలిపించుకోవడంతో అసలు అగ్గి రాజుకుంది. అప్పటికే అంతర్గత విభేదాలతో ఉప్పు – నిప్పులా ఉన్న పంచకర్ల, గండి బాబ్జీ మధ్య ఈ ఎపిసోడ్ మరింత దూరం పెంచింది. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బీజేపీకి అన్యాయం జరిగిందనే పబ్లిసిటీ ఎక్కువైతే నష్టం తప్పదని భావించారట ఎమ్మెల్యే. సరిగ్గా అక్కడే తన వ్యూహానికి పదును పెట్టారని అంటున్నారు.తన మాట చెల్లని చోట అనవసరంగా వాదించేకంటే… టీడీపీకి తెలిసి వచ్చేలా చేయాలని అనుకున్నారట. ఎన్నికల తర్వాత గండిబాబ్జీ పేరు ప్రస్తావించి మరీ… ఎమ్మెల్యే అసహనంతో చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. సబ్బవరం మండలంపై ఆధిపత్యం సాధించినట్టు గండి బాబ్జీ వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించారట పంచకర్ల. దీంతో తెరవెనుక ప్రయత్నాలు ఊపందుకోగా తెలుగుదేశం పార్టీకి కీలకమైన అనకాపల్లి జెడ్పీ పీఠం జనసేన ఖాతాలో పడింది. దీంతో పరవాడ జెడ్పీటీసీ నాగమణికి అదృష్టం కలిసి వచ్చి జెడ్పీ చైర్ పర్సన్ అయిపోయారు. జిల్లాలో మొత్తం 24 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా…ఐదు చోట్లజనసేన, రెండు స్థానాలు బీజేపీ గెలుచుకున్నాయి. కూటమి క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లాలో మెజారిటీ సభ్యులు టీడీపీకి చెందిన వారే.
రాజకీయంగానూ ప్రధాన భాగస్వామ్య పార్టీకి ఈ జెడ్పీ చైర్ కీలకం. అటువంటిది పెందుర్తిలో పుట్టిన రాజకీయ ముసలం కీలక సీటుకు ఎసరు పెట్టిందని టీడీపీ సీనియర్లు రుసురుసలాడుతున్నారు. అదే సమయంలో గండి బాబ్జీకి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, పెందుర్తి నుంచి జెడ్పీటీసీగా గెలిచిన అజయ్…..విశాఖ జెడ్పీ పీఠం ఆశించారు. కానీ, అనకాపల్లి జనసేనకు వెళ్లిపోవడంతో వైజాగ్ జిల్లా పరిషత్ టీడీపీకి అనివార్యంగా మారింది. రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా పరిషత్ కాగా ఇక్కడ బీసీ మహిళకు అవకాశం కల్పించింది అధిష్టానం. దీంతో భీమిలి జెడ్పీటీసీ అలివేణి చాన్స్ కొట్టేశారు. వాస్తవానికి పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనిబలంగా కోరుకున్నారు గండి బాబ్జీ. జిల్లా పార్టీ అధ్యక్షుడు గా…దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ గావ్యవహరించాలని పార్టీ ఆదేశించడంతో దాదాపు మూడేళ్లు పని చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని బలోపేతం చేయడంలో గండి బాబ్జీ కీలకంగా వ్యవహరించారు. కానీ, జనసేన పొత్తు కారణంగా ఆయన ఆశించిన విశాఖ దక్షిణం, పెందుర్తి రెండు నియోజకవర్గాలు జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ఈ రెండు సీట్లులో గెలుపు వెనుక బాబ్జీ సహకారాన్ని గుర్తించిన పార్టీ… ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. అయితే, ఇంచార్జ్ పదవికి పరిమితం కావడం ఇష్టంలేని బాబ్జీ… ఛాన్స్ దొరికినప్పుడల్లా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతుండటం, దానికి ఎమ్మెల్యే పంచకర్ల చెక్ పెట్టేస్తుండటంతో పొలిటికల్ గేమ్ రసవత్తరంగా మారుతోంది. ఇక తాజా ఎపిసోడ్ తర్వాత టీడీపీ పెద్దలకు కీలకమైన విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే. పెందుర్తిలో గాడితప్పిన పరిస్థితులు చక్క దిద్దాలని చేతులెత్తి వేడుకుంటున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై టీడీపీ ముఖ్య నాయకత్వం కూడా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!