OTR : పల్నాడులో వార్ వన్ సైడేనా? అధికారంలో ఎవరుంటే వాళ్లదే హవా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాన్ వన్‌సైడ్…. బాషా బరిలో దిగినా, దిగకపోయినా… అక్కడ ఎప్పుడూ వార్ వన్‌సైడేనా? కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఖాతాలోనే అన్ని స్థానిక సంస్థలు పడిపోతాయా? అక్కడి ఓటర్లు నిజంగానే అలా మొగ్గుచూపుతుంటారా? అసలు కారణాలు వేరే ఉన్నాయా? ఎన్నిక ఏదైనా వందశాతం ఒకే వైపు మొగ్గుతున్న ఆ ప్రాంతం ఏది? అక్కడి పరిస్థితులు ఏంటి? ఎన్నికలంటే… రాజకీయ పార్టీలు పోటీ పడటం సహజం. గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలతో పొలిటికల్ హీట్ పెంచుతుంటారు నాయకులు. ఇక స్థానిక ఎన్నికలంటే ఆ రచ్చే వేరుగా ఉంటుంది. కానీ… మారనుకునేవన్నీ ఎక్కడైనా కావచ్చుగానీ…అక్కడ మాత్రం వార్ వన్‌సైడేనని అంటున్నారు పరిశీలకులు. పార్టీ ఏదైనాసరే…. రాష్ట్రంలో వాళ్ళకు పవర్ ఉంటే చాలు. పల్నాడు జిల్లాలో వాళ్ళదే హవా అంటున్నారు. ప్రత్యర్ధి పార్టీకి చెందిన వారు పోటీ చెయ్యాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏపీలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పల్నాడు జిల్లా కూడా ఒకటి. ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పార్టీల సంగతి ఒక ఎత్తయితే… ఇక్కడి ఓటర్లు కూడా సాలిడ్‌గా ఎవరో ఒకరి వైపే మొగ్గుచూపుతుంటారు. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్దులే విజయం సాధించారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలైతే నెక్స్ట్ లెవల్. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక సంస్థల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు కూడా ఆ పార్టీ నేతలు ఆసక్తి చూపించలేదు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో అయితే అప్పుడు టీడీపీ పరిస్థితి మరింత దారుణం. మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో అభ్యర్దులు నామినేషన్లు కూడా వెయ్యలేకపోయారు. దీంతో ఎన్నికలు జరగకుండానే రెండు మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది. ఇక మాచర్ల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. అసలు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గురజాల నియోజకవర్గంలో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా కొద్దో గొప్పో ఇదే తరహాలో ఏకగ్రీవాలయ్యాయి.
ఇక రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో జరిగిన గొడవలు, దాడులు, విధ్వంసాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో పల్నాడు జిల్లా అంటేనే గొడవలకు కేరాఫ్ అన్నంతగా పేరుపడిపోయింది. ఇక ఆ ఎన్నికల్లో పల్నాడు జిల్లా ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. 2019లో అన్ని అసెంబ్లీ స్థానాలతోపాటు ఎంపీ సీటు వైసీపీ గెలిస్తే ఈసారి సీన్ రివర్స్ అయింది. ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానం టీడీపీ ఖాతాలో పడిపోయాయి. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే… గతంలో లోకల్ ఎన్నికల సీన్ ఈసారి రివర్స్‌లో రిపీట్ అయ్యింది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ హవా కొనసాగితే… ఇప్పుడు పూర్తిగా టీడీపీ పట్టు బిగించింది. పల్నాడు జిల్లాలో మొత్తం 419 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 387 ఏకగ్రీవమయ్యాయంటేనే పరిస్థితి ఎలా ఉందో ఉందో అర్దమవుతోంది. కేవలం 32 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక జెడ్పీటీసీల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. జిల్లాలో 28 జెడ్పీటీసీ స్థానాలుంటే ఎన్నికలకు ముందే 18 ఏకగ్రీవమయ్యాయి. 10 చోట్లే ఎన్నికలు జరుగుతున్నాయి. అటు మున్సిపాలిటీల్లో కూడా గతంలో కంటే ఎక్కువగా ఏకగ్రీవాలయ్యాయి. అప్పట్లో మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవమైతే ఇప్పుడు ఒక మున్సిపాలిటీ, రెండు నగరపంచాయతీలకు వైసీపీ కనీసం నామినేషన్ కూడా వెయ్యలేకపోయింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీతోపాటు దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలు ఎన్నికలు లేకుండానే టీడీపీ పరం అయ్యాయి. చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఎన్నికలకు ముందే 16 వార్డులు కూటమి కైవసం చేసుకుంది. మాచర్లలో 71 ఎంపీటీసీ స్థానాలు, ఐదు జెడ్పీటీసీ స్థానాలుంటే మొత్తం టీడీపీ ఖాతాలోకే వెళ్ళాయి.గతంలో కూడా ఇక్కడ ఇదే తరహాలో ఏకగ్రీవాలయ్యాయి. గురజాల నియోజకవర్గంలో 57 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. పెదకూరపాడులో 60 ఎంపీటీసీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీలు టీడీపీకి ఖాతాలో పడ్డాయి. నర్సరావుపేటలో 53 ఎంపీటీసీలు, రెండు జెడ్పీటీసీ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఇష్టం వచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం అనేది పల్నాడు ప్రజలకు లేకుండా పోతోందంటున్నారు. ఏ జిల్లాలో లేని పరిస్థితి పల్నాడులో కనిపించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లాలో ఈ పరిస్థితి ఎలాంటి విపరీతాలకు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో పెరుగుతోంది.
Also Read
- Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?