Off The Record : అగ్గి రేపుతున్న మందుల సామేల్ మాటలు
- అగ్గి రేపుతున్న మందుల సామేల్ మాటలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలపై బ్రాహ్మణ సంఘాలు ఫైర్
- తమ వృత్తిని అవమానించారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్
- బీజేపీ ఎంట్రీతో ఫుల్ పొలిటికల్ కలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు తెలంగాణలో పొలిటికల్ మంటలు రేపుతున్నాయా? మేటర్ మెల్లిగా కులం, మతం కలర్ పులుముకుంటోందా? బీజేపీ ఎంట్రీతో ఎట్నుంచి ఎటో తిరుగుతోందా? ఎవరా శాసనసభ్యుడు? ఆయన మాటలతో బ్రాహ్మణుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఎందుకు పెరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య కొత్త వార్ మొదలైంది. అయితే… ఇది గతానికి పూర్తి భిన్నం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ అగ్గి రేపారు. ప్రస్తుతం ఆయన మాటలు మంటలు లేపుతున్నాయి. రెండు పార్టీల మధ్య రచ్చ ఒక ఎత్తయితే… ఎమ్మెల్యే తమను తీవ్రంగా అవమానించారంటూ బ్రాహ్మణ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.
ఆయన హిందువే కాదని, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలాగంటూ బీజేపీ మండిపడుతోంది. ఆ మధ్య గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బ్రాహ్మణులను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అవే ఇప్పుడు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే సామేల్ తమ వృత్తిని అవమానించేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, అందుకాయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. అయితే… ఈ ఎపిసోడ్‌లోకి బీజేపీ ఎంట్రీతో మేటర్‌కు ఫుల్ పొలిటికల్ కలర్ వచ్చేసింది. పైగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకే చుట్టుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యే, పైగా గాంధీభవన్‌లో, ముఖ్యమైన ప్రోగ్రామ్‌లో కావడంతో దీని నుంచి పార్టీ తప్పించుకోలేకపోవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి.
Also Read
అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు మందుల సామేల్ హిందువు కాదని, ఆయన చర్చిలో పెళ్లి చేసుకున్నారని, అందుకే హిందూ మతంలోని కొన్ని ప్రక్రియలను హేళన చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్స్. తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నది బీజేపీ డిమాండ్. కాంగ్రెస్ సనాతన ధర్మానికి వ్యతిరేకమని కూడా ఆరోపిస్తున్నారు కాషాయ నాయకులు. హిందువునని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి….. హిందువులను అవమానిస్తుంటే ఎందుకు స్పందించడం లేదు, తమ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది బీజేపీ లీడర్స్ క్వశ్చన్. మరోవైపు ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో కూడా బాగానే రచ్చ అవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ బాగా ట్రోల్ అవుతున్నాయి.
ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ…. అదే ఊపులో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ మంది. దీంతో ఇది మదిరి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కొందరు కాంగ్రెస్ నాయకులు కంగారు పడుతున్నారట. ఇంకొందరైతే…. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినాసరే… సామేల్ వ్యాఖ్యల్ని తప్పుపట్టినట్టు తెలుస్తోంది. దీంతో…. మేటర్ ఎట్నుంచి ఎటెటో వెళ్ళిపోతోందని గ్రహించిన సామేల్ నష్ట నినారణ చర్యలు మొదలుపెట్టాకు. ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారాయన. కానీ… బీజేపీ నాయకులు మాత్రం ఈ మేటర్‌ని ఇక్కడితో వదిలేలా కనిపిండం లేదంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం పార్టీ పెద్దల డైరెక్షన్‌లోనే ఆయన మాట్లాడారని, దీనిపై సామేల్‌కు బదులు కాంగ్రెస్ పార్టీ పెద్దలే స్పందించాలన్నది బీజేపీ డిమాండ్. ఈ పరిస్థితుల్లో ఈ మేటర్ కొత్త మలుపు తిరుగుతుందా, ఇక్కడితో ఆగుతుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
- Tags
- Mandula Samuel
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!