Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
- ప్రభుత్వానికి చురకలంటిస్తున్న గుత్తా సుఖేందర్రెడ్డి ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్ ప్రస్తావన ఇన్నాళ్ళు లేఖలు రాసే అలవాటున్న గుత్తా నేరుగా ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వాన్ని తప్పు పట్టడంపై చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ సీనియర్ లీడర్ స్వరం మారుతోందా? అందులో పైకి కనిపించని అసంతృప్తి ఏదో ధ్వనిస్తోందా? సొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారా? అది నిజంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవలేదన్న ఫ్రస్ట్రేషనా..? లేక అంతకు మించిన స్పెషల్ ప్లానింగ్ ఉందా? ఎవరా ఫ్రస్ట్రేటెడ్ సీనియర్? ఏమా కథ? సీనియర్ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీరు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఏ మాత్రం మొహమాట పడకుండా…. నేరుగా ప్రభుత్వానికి చురకలంటిస్తుండటంతో… స్వరం మారుతున్నట్టుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనన్పై ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారాయన. సూచిస్తున్నాను, విజ్జప్తి చేస్తున్నానని అంటూనే… ప్రభుత్వ వైఖరిపై కాస్త ఘాటుగా రియాక్ట్ అవడంతో…. ఇదేం యాదృచ్చికంగా జరుగుతున్నది కాదు, వెనక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా తన సూచనలు, సలహాలను లేఖ రూపంలోనే ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు పంపించే గుత్తా… తాజాగా సుదీర్ఘకాలం తర్వాత నల్లగొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెనైపోవడాన్ని ప్రత్యేకంగానే చూడాలని అంటున్నారు పరిశీలకులు.ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తోందని, నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకు ఇస్తున్నారని, పక్కరాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవడం లేదని, రైతు భరోసా అందరికీ అందలేదని… ఒకటేమిటి, ఇలా చాలా అంశాలను డైరెక్ట్గానే టచ్ చేశారాయన.
రైతు భరోసా లేదా సన్నాలకు బోనస్… వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాలన్నది గుత్తా మాట… ఏది ఇవ్వాలో ప్రభుత్వం ఓ క్లారిటీకి రావాలని అన్నారాయన. ఏది చేసినా రైతులకు సంపూర్ణంగా ఇవ్వాలన్నదే నా అభిప్రాయం అన్నది మండలి ఛైర్మన్ మాట. సన్నాలకు బోనస్ ఇస్తే… వాటిని పండించే రైతులకు మాత్రమే లబ్ది జరుగుతుందని, అదే రైతు బంధు అయితే…. ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందన్నది గుత్తా ఆలోచన. సాధారణంగా అయితే…దీనంతటినీ… తన ఓల్డ్ స్టైల్లో లేఖ రూపంలో ప్రభుత్వానికి చెప్పవచ్చు. కానీ… ఈ సారి ఆ పంథాను ఎంచుకోలేదు మండలి చైర్మన్. ప్రెస్ మీట్ పెట్టి మరీ…. అందులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో… రైతుబంధు సమితి చైర్మన్ గా పనిచేసిన గుత్తాకు వ్యవసాయం, సాగునీటి రంగాలపై మంచి పట్టుంది. ఆ అనుభవంతోనే… SLBC కాలువలను కూడా వరద తీవ్రతకు అనుగుణంగా వెడల్పు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అలాగే… డిండి నీటిని సద్వినియోగం చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల రేషన్ కార్డుల లాంటి చాలా ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
కానీ… వాటిని వేటినీ పట్టించుకోలేదన్న అసహనం ఆయనలో పెరుగుతోందట.తాను లేఖలు రాయడం, దానికి ప్రభుత్వం నుండి రిప్లై రావడం వరకు అంతా సవ్యంగానే జరుగుతున్నప్పటికీ….. ఏవీ ఆచరణలోకి రాకపోవడంపై కొంత కాలంగా గుత్తా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దీంతో తాను ఏం చేసినా, ఏది చెప్పినా ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతోనే ప్రెస్ మీట్ పెట్టి ఉండవచ్చని అంటున్నారు. ఎప్పుడు, ఎలా, దేని గురించి మాట్లాడాలో స్పష్టమైన అవగాహన ఉండే నేతగా పేరున్న సుఖేందర్ రెడ్డి… తాజా ప్రెస్ మీట్ వ్యాఖ్యల వెనక కూడా పెద్ద ప్లానింగే ఉండవచ్చన్నది పొలిటికల్ వాయిస్. రాజకీయంగా ముందు చూపుతో, స్పష్టమైన ప్లానింగ్తోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెవులు కొరుక్కుంటున్నారు కొందరు. గుత్తా వ్యూచర్ పాలిటిక్స్ కోసం బిగ్ ప్లాన్లో ఉన్నారన్నది కొందరి విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో… ఇక నుంచి తన సూచనలన్నిటినీ ఇలా బహిరంగంగానే చెప్తారా.. వాయిస్ పెంచుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!