OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షవరం అయితేగానీ… వివరం రాదని అంటారు. కానీ…మా వాళ్ళకు క్షవరం అయ్యాక కూడా వివరం రాలేదంటూ మొత్తుకుంటోంది అక్కడి ఫ్యాన్ కేడర్. పార్టీ పెట్టాక ఎన్నడూ ఓడని చోట్ల కూడా మొన్నటి పరిషత్ ఎన్నికల్లో చేతులెత్తేయడానికి నాయకత్వ లోపమే అసలు సమస్య అంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా పంతాలు, పట్టింపుల వ్యవహారం? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ ఎంత దెబ్బతిన్నా ఇప్పటికీ మార్పు రాలేదని అంటున్నారు. లోకల్‌గా పార్టీ స్థాయి రోజు రోజుకు ఎందుకు దిగజారిపోతుందో నాయకులు గుర్తించినా…మా మాటే చెల్లుబాటవ్వాలన్న అహంకారాన్ని వీడకపోవడంతో మొత్తానికే మునుగుతున్నామన్నది కేడర్ ఆవేదన. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో చవిచూసిన ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 44 వార్డులు ఉండగా కేవలం రెండిటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వైసీపీ. ఛైర్మన్ కూడా చేయారి పోయింది. చాలా వార్డుల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక ఒక జడ్పిటిసిని మాత్రమే గెల్చుకోగలిగింది. అది కూడా అక్కడ జనసేన అభ్యర్థి బరిలో ఉండడం, టీడీపీ సహకారం లేకపోవడమే కలిసి వచ్చిందన్న విశ్లేషణలున్నాయి.
కానీ…ఈ ఫలితాలు ఉన్నంత దారుణంగా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ బలహీనంగా లేదని, నాయకత్వం సరైన సమయంలో సరిగా వ్యవహరించకపోవడమే అసలు సమస్య అని అంటున్నారు. ఇంత ఘోర ఓటమికి స్వయంకృతమే కారణమన్నది వైసీపీ కేడర్ వాయిస్. ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి. ఆయనకు, మాజీ ఎంపీ బుట్టా రేణుక వర్గాల మధ్య అధిపత్య పోరు పార్టీని నిలువునా ముంచుతోందంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు బుట్టా. తర్వాత కొన్నాళ్లు ఇన్చార్జిగా కొనసాగారామె. అయితే… ఆ పదవి నుంచి పట్టుబట్టి మరీ తమను తప్పించగలిగిన చెన్నకేశవరెడ్డి…. మనవడు రాజీవ్ రెడ్డికి ఇప్పించుకున్నారన్నది బుట్టా రేణుక వర్గం కసి. ఇక అప్పటి నుంచి రాజీవ్ రెడ్డి, బుట్టా వర్గాల మధ్య అధిపత్యపోరు ఇంకా పెరిగిందని అంటున్నారు.
Also Read
- OTR: తిరువూరు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. ఫైనల్ పంచ్ ఎవరిది?
- OTR : ఇక జిల్లాల బాట పట్టనున్న రేవంత్.. సంక్రాంతి తర్వాత పొలిటికల్ దూకుడు..!
- OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
- OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఈ పోరే… మున్సిపల్ , పరిషత్ ఎన్నికల్లో పార్టీని ఘోరంగా దెబ్బతీసిందని అంటున్నారు. లోకల్లో చెన్న కేశవ రెడ్డి వర్గం బలంగా ఉన్నా… ఎమ్మిగనూరు అర్బన్‌లో బుట్టారేణుకకు పట్టుంది. చేనేత సామాజికవర్గం బలంగా ఉండడం, బుట్టాది కూడా అదే సామాజికవర్గం అవడం అర్బన్‌లో కలిసి వస్తోంది. ఈ క్రమంలోనే… మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఎమ్మిగనూరు వైసీపీలో సమన్వయం లేకపోగా ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి. బుట్టా రేణుక వర్గానికి టికెట్లు ఇవ్వకూడదని రాజీవ్ రెడ్డి వర్గం పట్టుబట్టిందట. అలాగని మున్సిపాలిటీ వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపలేకపోయినట్టు చెబుతున్నారు. జనబలం, ధనబలం లేని వారిని బరిలో నిలపడం, పార్టీ నుంచి, నియోజకవర్గ ఇంచార్జ్ నుంచి ఆర్ధిక తోడ్పాటు లేకపోవడం లాంటివి దెబ్బకొట్టాయన్న లెక్కలున్నాయి. అసలు పరిషత్ ఎన్నికల్లో అయితే బుట్టాను జోక్యం చేసుకోవడానికి కూడా లేకుండా కట్టడి చేశారని అంటున్నాయి వైసీపీ వర్గాలు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నజీర్‌కు ఛైర్మన్ టికెట్ రాకపోవడంతో ఆయన తనతోపాటు 7 వార్డుల్లో తన మనుషుల్ని రెబెల్స్‌గా పోటీకి దింపారు. దీంతో వైసీపీ ఓట్లు చీలిపోయి దెబ్బ పడిందని అంటున్నారు. చివరికి పోలింగ్ కేంద్రంలో, కౌంటింగ్ సెంటర్లో కూడా గట్టిగా మాట్లాడేవారే లేకపోయారట. మరోవైపు బుట్టా రేణుకను దూరం పెట్టడంతో ఆ వర్గంలోని సీనియర్ నేతలంతా సైలెంట్ కావడం కూడా ఘోరమైన ఫలితాలకు కారణమన్నది మరో విశఅలేషణ. ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలు వైసీపీకి కంచుకోటలు. అయినా గ్రూప్ పాలిటిక్స్ తో కొందరు సీనియర్ నాయకులు సైలెంట్ అయ్యారట. దీంతో వైసీపీ ఎన్నడూ ఓడని ఎంపీటీసీ స్థానాలను కూడా ఈ సారి కోల్పోయిందంటున్నారు. ఓవరాల్‌గా ఎమ్మిగనూరులో వైసీపీని ఓడించింది ప్రత్యర్థులు కాదని, ఏకపక్ష ధోరణి, గ్రూప్ పాలిటిక్స్‌తో చేజేతులా చేసుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
తాజావార్తలు
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
CII Summit: విశాఖ వేదికగా ‘సీఐఐ సమ్మిట్–2026’.. ఏపీ పారిశ్రామిక ప్రగతికి నయా రూట్ మ్యాప్..
-
Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?