OTR : తెలంగాణలో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ.. పాతవాళ్లకు రెన్యూవల్ ఉంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూపులు తప్పవా? కొత్త పదవుల కోసం కొందరు, రెన్యువల్ కోసం మరికొందరు ఎదురు చూస్తున్నా…. ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదా? కొత్త సంగతి ఎలా ఉన్నా… పాత వాళ్ళకు షాకులు తప్పవా? రెన్యువల్స్ కోసం ఇంకొన్నాళ్లు ఆగాల్సిందేనా? అందులో కూడా గ్రీన్ సిగ్నల్ ఎందరికి… రెడ్ పడేది ఎంత మందికి? అసలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే 37 మంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వాళ్ళకు… పార్టీ కోసం పని చేసిన నేతలకు అప్పుడు పదవులు దక్కాయి. ఐతే… ఇప్పుడు వాళ్ళ పదవీకాలం ముగిసిపోయింది. నామినేటెడ్ ఛైర్మన్ పోస్ట్‌ల టెన్యూర్ రెండేళ్లుకాగా… ఆ గడువు తీరిపోయింది. ప్రస్తుతం వీళ్లంతా …. పదవుల రెన్యువల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేక… ఎదురు చూస్తున్న వాళ్ళు చూస్తున్నట్టే ఉన్నారు. కొందరైతే….. ఇంకా కొత్త వాళ్ళు రాలేదు, మనల్ని పొమ్మన లేదు. అలాంటప్పుడు గడువు తీరితే మాత్రం ఏమైందంటూ…. యధావిధిగా కుర్చీల్లో కొనసాగుతూ ఆయా శాఖల సమీక్షలు కూడా చేసేస్తున్నారట. కానీ… ఎవ్వరికీ ఏ క్లారిటీ లేదు.
శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి… సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే సమీక్షల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే….37 మంది కార్పొరేషన్ చైర్మన్స్లో తక్కువ మందికే రెన్యువల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావచ్చని అంటున్నారు. పోనీ… అదన్నా జరుగుతుందా అంటే…. అదీ లేదు. అసలు పదవుల రెన్యువల్ ఎప్పుడన్నది క్లారిటీ లేదు. నామినేటెడ్ పదవుల భర్తీపై ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్… కసరత్తు మొదలుపెట్టారు. అయితే… కొత్తగా ఆశావహులకు మొదట పదవులు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. కొత్త జాబితా ఫైనల్ అయ్యాకనే….. రెన్యువల్స్ జోలికి వెళ్ళాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఐదారుగురికే పరిమితం కావచ్చన్నది పార్టీ వాయిస్. కొత్తగా పదవులు ఆశించే వారికి మొదట ఇస్తే…. కొన్ని సమస్యల్ని తగ్గించుకున్నట్టు అవుతుందని భావిస్తోందట రాష్ట్ర పార్టీ నాయకత్వం. అయితే పార్టీ వ్యవహార శైలిపై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా పదవీ కాలం ముగుస్తుంటే వెంటనే కంటిన్యూ చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఆ ఊసే ఎత్తడం లేదంటూ అసహనంగా ఉన్నారట కొందరు సీనియర్స్.
Also Read
- Tags
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
-
Drug Racket: హైదరాబాద్‌లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!