Off The Record : కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీకి కసరత్తులు..రెన్యువల్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎంత ?
- కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీకి కసరత్తులు
- ఇప్పుడు ఉన్నవాళ్ళ పదవీకాలం కూడా చివరికి
- వచ్చే జూన్లో కొత్త నియామకాలకు అవకాశం
- అధికారంలోకి వచ్చిన కొత్తల్లో 37మందికి పదవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటిన్యూ చేస్తారా? కటీఫ్ చెబుతారా? గడువు తరుముకొస్తోంది. పదవికి ముప్పు మంచుకొస్తోంది. కుర్చీల కింద బాంబులు పడుతున్న ఫీలింగ్. వాటిని ఎలా డిఫ్యూజ్ చేయాలో అర్ధంకాని కంగారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామందిలో ఇదే ఫీలింగ్ ఉందట. ఇంతకీ ఏ పదవుల విషయంలో వాళ్ళు అంతలా టెన్షన్ పడుతున్నారు? కొత్త పోస్ట్లు, ఎక్స్టెన్షన్ష కథేంటి? తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. అందుకోసం అధికార పార్టీగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. జాబితా విషయంలో ఇప్పటికే ప్రాధమిక అవగాహన వచ్చినట్టు తెలిసింది. కానీ…. ఆశావహుల జాబితా చాలా పెద్దగా ఉండటం ఉత్కంఠను పెంచుతోంది. అదే సమయంలో ఇప్పటికే పదవులు అనుభవిస్తున్న వాళ్ళ గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ పదవీకాలంకూడా దగ్గర పడుతోంది. దీంతో… వాళ్ళలో ఎంతమందికి ఎక్స్టెన్షన్ వస్తుంది? ఇంటికి వెళ్లేది ఎందరంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి, అలాగే కుర్చీల్లో కూర్చున్న వాళ్లకు కూడా టెన్షన్ పుడుతోందట. వచ్చే జూన్లో కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరగబోతోంది. అందుకు సంబంధించిన జాబితా కూడా…. ఖరారు కావస్తున్నట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తొలి విడతగా…. 37 మంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ ల పదవులను కట్టబెట్టింది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు, పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్స్గా ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చి పదవులు కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read
ఇప్పుడిక రెండేళ్లు దగ్గర పడుతూ ఆ పదవీకాలం పూర్తి కావస్తున్న క్రమంలో వాళ్ళంతా కుర్చీల కింద బాంబులు ఉన్నట్టు ఫీలవుతున్నారట. ఉన్న 37 మంది చైర్మన్లలో ఎంతమంది కంటిన్యూ అవుతారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అలాగే…ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లలో చాలామంది పనితీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నారట. దాంతో… రెన్యువల్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ ఉండవచ్చని అంటున్నారు. వాళ్ళందరి పనితీరును గమనిస్తూ…. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు సీఎం. అయినాసరే…. చాలామంది ఆశించిన స్థాయిలో పనితీరును మెరుగుపరుచుకోలేదన్న అభిప్రాయం ఉందట.
కొన్ని కార్పొరేషన్లకు అవసరమైన నిధుల లేమి కూడా కొంత అడ్డంకిగా మారుతున్నట్టు తెలుస్తోంది. అలాగే…. ఎక్కువ మంది… పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వంపై వచ్చే విమర్శలు కావచ్చు… వేటికీ దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదన్న అసంతృప్తి ఉందట. దీంతో పనిచేయని వారిని కొనసాగించాలనే ఉద్దేశం సీఎంకు లేదన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి గాంధీభవన్లో. ఇప్పుడు ఖాళీ అయ్యే 37ను భర్తీ చేయడంతోపాటు మరో 40 మందిని కొత్తగా ఎంపిక చేసి ఒకేసారి జాబితా విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే జూన్ వరకు ఈ టెన్షన్ తప్పదని, ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఓవరాల్గా రెన్యువల్ అయ్యేవి మాత్రం చాలా తక్కువేనన్నది పార్టీ ఇంటర్నల్ టాక్.
తాజావార్తలు
-
Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!