Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswanath And Sons: సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని రూపొందిస్తుండగా, తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌లో జ్యోతిక కీలక సూచనలు ఇచ్చారని, ఆ మార్పులు కథకు మరింత బలం చేకూర్చాయని దర్శకుడు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ‘విశ్వనాథ్ & సన్స్’ కథను మొదట వినిపించిన వారిలో జ్యోతిక కూడా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ ఆమెకు చాలా నచ్చిందని, అయితే కొన్ని విలువైన సూచనలు కూడా చేశారని వెల్లడించారు. తాను చాలామందికి స్క్రిప్ట్ వినిపించినప్పటికీ, జ్యోతిక ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాత్రం బాగా ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, ఆమె సూచించిన మార్పులు ఏంటన్నది ఇప్పుడే చెప్పనని, సినిమా విడుదలైన తర్వాత వాటి గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో జ్యోతిక సూచనలతో కథలో ఎలాంటి మార్పులు జరిగాయనే అంశంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ నటి మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఇటీవల ‘కరుప్పు’ విజయంతో మంచి ఊపుమీద ఉన్న సూర్య, ఇప్పుడు పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జ్యోతిక సూచనలు సినిమాకు ఎంత మేర ప్లస్ అయ్యాయో తెలుసుకోవాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Also Read
- Tags
- cinema
- Viswanath and Sons
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!