OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ… ఇన్నాళ్లు ఆ వ్యవహారాలను చూసిన మంత్రి నారాయణలో ఏదో తేడా కనిపిస్తోందా? ఆ పరంగా గతంలో ఉన్నంత దూకుడు ఎందుకు కనిపించడం లేదు? అంతకు ముందు ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో నిర్మాణ పనుల్ని సమీక్షించిన మంత్రి ఇప్పుడెందుకు టూర్స్ తగ్గించారు? ఆ విషయంలో అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి….. సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్ట్ ఇది. వీలైనంత త్వరగా దీనికో రూపం తీసుకువచ్చి… క్రమంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. రాష్ట్ర విభజన తర్వాతే ఈ ప్రాజెక్ట్ మొదలైనా… మధ్యలో రకరకాల రాజకీయ, సాంకేతిక కారణాలతో సమస్యలు వచ్చి పడ్డాయి. వాటన్నినీ అధిగమించి ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విడతలోనే ఫుల్ పిక్చర్ తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. అంత వరకు బాగానే ఉన్నా….ఆ పరుగులు పెట్టించేది ఎవరన్న దగ్గరే ప్రస్తుతం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీఎం స్థాయిలో చంద్రబాబు విధాన నిర్ణయం తీసుకున్నా… వేల కోట్ల రూపాయల విలువైన పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ… తగిన ఆదేశాలివ్వాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి మీదే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మున్సిపల్ మంత్రిగా నారాయణ ఉన్నారు. అప్పట్లో అమరావతి పూర్తి బాధ్యతల్ని ఆయన భుజాల మీదే పెట్టారు ముఖ్యమంత్రి. ఇక 2024లో తిరిగి పవర్లోకి వచ్చాక కూడా… రాజధాని నిర్మాణ వ్యవహారాలన్నిటినీ నారాయణే చూశారు. కానీ…. రెండేళ్ళకు…. ఇటీవల కాస్త డిఫరెంట్‌గా, ఎక్కడో తేడా కొడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు ఈ వ్యవహారాలను గమనిస్తున్నవారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా… రాజధాని పనుల్ని నారాయణే చూసినా…. మధ్యలో….. త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో మంత్రి నారాయణతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటయ్యాక….. రాజధాని విషయంలో పెమ్మసానిదే అప్పర్ హ్యాండ్ అయిందన్న చర్చ జరుగుతోంది.
రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో వాస్తు సమస్యలు, గ్రామాల అభివృద్ధి, కాస్త ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళతో సామరస్యంగా చర్చలు జరిపి పరిష్కారాలు సూచించడం లాంటి చాలా అంశాల్లో త్రీ మెన్ కమిటీ మొదట్లో దూకుడుగా ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకుంది. దీంతో..రాజధాని వ్యవహారాల్లో..మంత్రి నారాయణతో పాటు మరో గట్టి హ్యాండ్ దొరికిందని మాట్లాడుకున్నారు. అయితే… అక్కడే మరో రకమైన వాయిస్ కూడా వినిపిస్తోంది. ఆ కమిటీ నిర్ణయాల్లో నారాయణ కంటే… పెమ్మసానిదే పైచేయి అవుతోందన్నది ఇన్సైడ్ వాయిస్. ఇక కొత్తగా వచ్చిన సీఆర్డీఏ కమిషనర్..రామరాజుకు, నారాయణకు మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే… సంస్థలో కొన్ని కీలక నిర్ణయాలు, కాంట్రాక్ట్ వ్యవహారాలు మంత్రి నారాయణ నోటీస్‌లో లేకుండానే జరిగిపోతున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే… రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో మెల్లిగా నారాయణ ప్రమేయాన్ని తగ్గిస్తున్నారా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయట. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయని అంటున్నారు. కొందరు రాజధాని రైతులు మంత్రి విషయమై అసంతృప్తి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళకు ప్లాట్స్ కేటాయింపు, అభివృద్ధి విషయంలో చెప్పిన మాటలకు, జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోయిందన్నది రైతుల అభిప్రాయమట. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ మినిస్టర్‌ని రాజధాని నుంచి సైడ్ సైడ్ సైడ్ అంటున్నారా అన్నది ఓ వర్గం అనుమానం. అందుకు తగ్గట్టే… ఇటీవల అమరావతి మీద ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలపై నారాయణకంటే ఎక్కువగా మిగతా మంత్రులు స్పందించారు. ఇటు ఆయన కూడా… ఈ మధ్య రాజధాని పర్యటనల్ని కాస్త తగ్గించారు. గతంలో ప్రతి రెండు రోజులకు ఒకసారి నారాయణ రాజధాని పర్యటనలు ఉండేవి. కానీ… ఈ మధ్య ఆ స్థాయి ఫ్రీక్వెన్సీ లేదని అంటున్నారు. మొత్తం మీద అమరావతి నిర్మాణం విషయంలో ప్రస్తుతం నారాయణ కీలకంగా ఉన్నారా…? లేక ఉన్నట్టు అనిపిస్తున్నారా…? అన్నది మెజార్టీ డౌట్.
Also Read
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!