Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Abouttelangana Deputy Speaker Ramachandra Nayak Cabinet

Off The Record: డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆయనకు ఆసక్తి లేదా..?

Published Date :January 7, 2026 , 9:30 pm
By Sudhakar Ravula
  • డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్ర నాయక్‌ పేరు ప్రకటన..
  • ఇన్ఫర్మేషనేగానీ... కన్ఫర్మేషన్‌ లేని వైనం..
  • శీతాకాల సమావేశాల్లో జరుగుతుందనుకున్నా నో..
  • సమయం సరిపోదనుకుని వాయిదా వేశారా?..
  • డిప్యూటీ స్పీకర్‌ పదవిపై రామచంద్ర నాయక్‌ ఆసక్తిగా లేరా?..
  • ప్రభుత్వ విప్‌ కేబినెట్‌ బెర్త్‌ వైపు చూస్తున్నారా?..
  • మంత్రి పదవిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌ ఆశలు..
  • ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరిలో కేబినెట్‌ విస్తరణ?..
  • ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మార్పునకు ఏఐసీసీ ఒప్పుకుంటుందా?..
Off The Record: డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆయనకు ఆసక్తి లేదా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక వ్యవహారం జీడిపాకం సీరియల్‌లా సాగుతూనే ఉంది. చాలా రోజుల క్రితమే.. రామచంద్ర నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఏఐసీసీ. ఇప్పుడంతా ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అనే పిలుస్తున్నారుగానీ… ఎన్నిక మాత్రం జరగలేదు. అఫీషియల్‌ కన్ఫర్మేషన్‌ అవలేదు. విప్ గా ఉండే నాయక్‌ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ సెషన్‌లో అయినా ఎన్నిక జరుగుతుందని అనుకున్నా… అవలేదు. మొదట్లో ఒకటి రెండు రోజులు మాత్రమే సభ నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. ఉప సభాపతి ఎన్నిక నిర్వహించాలంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అందుకు సమయం సరిపోదని అనుకున్నారో… లేదంటే ఈ సెషన్‌లో అక్కర్లేదని అనుకున్నారగానీ ప్రస్తుతానికి వాయిదా పడింది. దీంతో…. వచ్చే సెషన్‌ ఎన్నిక జరపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండికేషన్స్ కూడా పంపించింది.

మరోవైపు ఇటీవల అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన రామచంద్రనాయక్ తన మనసులో వేరే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి… తనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దల్ని కోరినట్టు చెప్పుకొచ్చారు డోర్నకల్‌ ఎమ్మెల్యే. కేబినెట్‌ విస్తరణ జరిగాకే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నది ఆయన లెక్క. దీన్నిబట్టి చూస్తుంటే… ఉప సభాపతి పదవి తీసుకోవడానికి రామచంద్ర నాయక్‌ సుముఖంగా లేరన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పటిదాకా… అధిష్టానం తన నిర్ణయాన్ని ప్రకటించాక తిరిగి వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ క్యాబినెట్‌ బెర్త్‌ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డినే నమ్ముకున్నానన్నది మొదట్నుంచి ఆయన చెబుతున్న మాట. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులో లేదంటే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని, తనకు కచ్చితంగా అవకాశం దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు బాలు నాయక్‌. అదే సమయంలో వీళ్ళిద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా…ఓవరాల్‌గా ఆ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం దక్కినట్టు అవుతుందని అంటున్నారు. కొత్త మంత్రి పదవి ఎస్టీ కోటాలోనే ఉన్నా… ఇద్దరిలో ఎవరికి అన్నది సస్పెన్స్‌ అయింది. రామచంద్ర నాయక్‌ను ఇప్పటికే డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించి ఉన్నందున ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకోవడానికి ఏఐసీసీ ఒప్పుకుంటుందా అన్న అనుమానాలున్నాయి. అదే సమయంలో బాలునాయక్ మాత్రం గంపెడాశతో ఉన్నారు. ఏతావాతా బాలు నాయక్‌, రామచంద్రనాయక్‌లో ఒకరికి మంత్రి పదవి, ఒకరికి డిప్యూటీ స్పీకర్‌ దక్కుతాయన్నది ప్రస్తుతానికి కాంగ్రెస్‌ వర్గాల అంచనా. కాంగ్రెస్ మార్క్‌ పాలిటిక్స్‌లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cabinet expansion
  • congress politics
  • Ministerial berth
  • off the record
  • Ramachandra Nayak

తాజావార్తలు

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!

  • Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!

  • SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్‌.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!

ట్రెండింగ్‌

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions