Off The Record: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎంపిక వ్యవహారం జీడిపాకం సీరియల్‌లా సాగుతూనే ఉంది. చాలా రోజుల క్రితమే.. రామచంద్ర నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఏఐసీసీ. ఇప్పుడంతా ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అనే పిలుస్తున్నారుగానీ… ఎన్నిక మాత్రం జరగలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అవలేదు. విప్ గా ఉండే నాయక్‌ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ సెషన్‌లో అయినా ఎన్నిక జరుగుతుందని అనుకున్నా……