Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ycp Faces Major Shock In West Godavari Kapu Leaders Drift Away Party Leadership Under Pressure

Off The Record: పశ్చిమ గోదావరిలో వైసీపీకి షాక్..!

Published Date :January 16, 2026 , 10:38 pm
By Sudhakar Ravula
  • వైసీపీ కీలక లీడర్లు కాపు నేతలను హ్యాండిల్ చెయ్యలేకపోతున్నారా?..
  • గుర్తింపు ఇవ్వలేదని చాలామంది పక్కకెళ్లిపోతున్నారా?..
  • ఆళ్లనాని, గ్రంథి శ్రీనివాస్‌ల విషయంలో జరిగిందేంటి?..
  • బీసీ నేతను బరిలోకి దించడం పాలకొల్లులో వికటించిందా?..
  • 2024 ఫలితం వల్లే కొట్టును పక్కకి జరిపారా?..
  • నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జిపై ఏం జరిగింది?..
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకిలాంటి పరిస్థితి?..
Off The Record: పశ్చిమ గోదావరిలో వైసీపీకి షాక్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: కరవమంటే కప్పకి విడవమంటే పాముకి అన్నట్టుగా ఉందట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను హ్యాండిల్ చేసే విషయంలో పార్టీ పెద్దలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అదే పార్టీ నాయకులు. ఏరి కోరి అవకాశాలు ఇచ్చిన నాయకులు పార్టీని వదిలిపోతుంటే.. కష్టపడి పని చేసినా గుర్తింపు ఇవ్వలేదని మరో నేత పక్కకి జరిగారు. ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల కాళీ క్రిష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ళ నానికి డిప్యూటీ సీఎం హోదాతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు.. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆళ్ళ నాని కామ్ గా పార్టీని వదిలి పక్కకి జరిగారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ని ఓడించిన కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ కు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, పక్క నియోజకవర్గానికి చెందిన నేతలు చులకనగా చూసే ప్రయత్నాలు చేయడంతో ఆయన కూడా ఆళ్లనాని బాటే పట్టారు. కీలకమైన పాలకొల్లు నియోజకవర్గంలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలో దించుతూ వైసిపి వరుసగా చేతులు కాల్చుకుంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదంతా పక్కన పెడితే తాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విషయంలోనూ అదే జరిగిందా అనే అనుమానాలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయట. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వడ్డే రఘురాం కి అవకాశం కల్పించారు. వైసిపి అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు మంత్రి పదవి అందించినప్పటికీ కొట్టు సత్యనారాయణ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారనే విమర్శలు రావడం, 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఖాళీ అవుతున్న పార్టీని పట్టించుకోలేదని విమర్శలతో కొట్టుని నియోజకవర్గ ఇన్చార్జిగా పక్కన పెట్టినట్టు సమాచారం. నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జిల విషయంలో కాపు సామాజిక వర్గ నేతలను కొనసాగించాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా, అధిష్టానం మాత్రం అక్కడ బీసీ నేతలను కొనసాగించడంపై గందరగోళం నెలకొందన్న చర్చ జరుగుతోంది.

అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా అవకాశం ఇచ్చిన నేతలు ప్రభావం చూపలేకపోవడం.. అవకాశం దక్కక కీలకమైన నేతలు పక్కకి జరగడం.. అవసరం ఉన్నచోట కాపు సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత కల్పించకపోవడం చూస్తుంటే పశ్చిమగోదావరి జిల్లాలో కాపు నేతలను హ్యాండిల్ చేసే విషయంలో పార్టీ పెద్దలు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట పార్టీ నేతలు. పదవులు అనుభవించి పక్కకి జరిగే వారి గురించి కాకుండా పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి ఇప్పటినుంచైనా ప్రాధాన్యత పెంచాలని సామాన్య కార్యకర్తల డిమాండ్‌ చేస్తున్నారని లోకల్‌ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allani Nani exit YCP
  • Andhra Pradesh political news
  • Grandi Srinivas sidelined
  • Kotthu Satyanarayana controversy
  • Narasapuram Parliament YCP incharge

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions