Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About What Is Happening At Vijayawada Kanaka Durga Temple Administrative Controversies Trigger Political Heat

Off The Record: విజయవాడ కనకదుర్గ సన్నిధిలో ఏం జరుగుతుంది?

Published Date :January 13, 2026 , 10:00 pm
By Sudhakar Ravula
  • నిత్యం ఏదొక గొడవతో దుర్గగుడి ఈవో శీనా నాయక్ సతమతం ..
  • శ్రీచక్ర అర్చనలో వినియోగించిన పాలలో పురుగులపై భక్తుల ఆందోళన..
  • కరెంట్‌ షాక్ ఘటనతో ఆగ్రహావేశాలు..
  • ఆలయ ఐదో అంతస్తుకు నేరుగా కేక్ తీసుకురావడంపై భక్తుల ఫైర్..
  • ఈఓ నిర్లక్ష్యం వల్లే వరుస తప్పిదాలని రచ్చ ..
  • ఈఓ పాలనా వ్యవహారంపై సీఎం టేబుల్‌ దగ్గర నివేదిక..
  • రాజకీయ రంగు పులుముకున్న దుర్గగుడి పరిణామాలు..
  • కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం..
  • తప్పు ఒకరిది..నిందలు మరొకరికా అని ఈవో ఆవేదన..
  • రానున్న కాలంలో సీఎం కీలక నిర్ణయం ఖాయమా?..
Off The Record: విజయవాడ కనకదుర్గ సన్నిధిలో ఏం జరుగుతుంది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో వరుసగా చోటు చేసుకుంటున్న సున్నిత ఘటనలు ప్రతిరోజు టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాయి. ఆలయ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజు ఏదొక గొడవతో సతమతం అవుతున్నారు. వరుస వివాదాలు అపచార ఘటనలు, తప్పులు ఎవరు చేసినా ఏం జరిగినా ఆలయ ఈఓను నిన్ను వదల బొమ్మాలి అన్నట్టు ఆయనను వెంటాడుతున్నాయి.

Read Also: Maruthi: హారర్ మూవీస్’లో దెయ్యాన్ని చంపడం ఈజీ.. ఎలాగైనా చంపొచ్చు!

పవర్ కట్ వివాదం చల్లారకముందే బ్యాక్ టు బ్యాక్ ఘటనలు ఇంద్రకీలాద్రిపై కలకం రేపుతున్నాయి. శ్రీచక్ర అర్చనలో వినియోగించిన పాలలో పురుగులు కనిపించడం భక్తుల్లో ఆందోళనకు కారణమైంది. అదే సమయంలో ఉచిత ప్రసాదం పంపిణీ కేంద్రం దగ్గర భక్తులకు షాక్ కొట్టిన ఘటన విమర్శలకు దారి తీసింది. అంతేకాదు, ఆలయ ఐదో అంతస్తుకు నేరుగా కేక్ తీసుకురావడం వంటి ఘటనలు కూడా పరిపాలన లోపాలను ఎత్తిచూపాయి. వీటికి కారణం ఎవరైనా, చివరికి ఈ ఇష్యూలన్నీ ఈవో చుట్టే తిరుగుతున్నాయి. ఈవో వైఫల్యమే కారణమని కార్నర్ చేస్తున్నారు. ఇలా వరుస ఘటనలతో ఇంద్రకీలాద్రి పరిపాలనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా పవర్ కట్ ఘటన విషయంలో పూర్తి బాధ్యత ఈఓపైనే పడిపోయింది. ఈఓ నిర్లక్ష్యం వల్లే అ పొరపాటు జరిగిందన్న చర్చ జరుగుతోంది. ఈఓ సమన్వయం చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని, తప్పంతా ఈఓదే అని ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం శారు. దేవాదాయ కమిషనర్ కూడా ఈఓ తీరును తప్పుపట్టారు.

ఇంకోవైపు ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బయటపడుతోంది. చైర్మన్ vs ఈఓ, ఈఓ vs దేవాదాయ కమిషనర్ మధ్య అభిప్రాయ భేదాలు పరిపాలనను గందరగోళానికి నెడుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వివాదాలన్నీ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ముఖ్యమంతి టేబుల్‌పైన ఈఓ పాలనా వ్యవహారం, పర్ఫార్మెన్స్ ఇలా ప్రతీది నివేదిక రూపంలో సీఎం దగ్గరకు చేరుతోంది. ప్రభుత్వం దుర్గగుడిలో వరుస వివాదాల నడుమ ఎప్పడు ఏ నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు వరుస పరిణామాలు రాజకీయ రంగు పులుముకుంటుండటంతో ప్రతి పక్ష వైసీపీ భగ్గుమంటోంది. దుర్గ గుడిలో వరుస ఘటనలపై హిందూ సంఘాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని చెబుతోంది. మరోవైపు ఈ పరిణామాలన్నిటిపై హిందూ సంఘాలు, అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆలయ ఈఓ శీనా నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసేది ఒకరు… నిందలు మోయాల్సింది మరొకరా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈవోగా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోవడంతో, చివరికి ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేసే పరిస్థితి వస్తోందని నేతలు అంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap Endowments Department
  • Durga Temple EO Sheena Naik
  • Indrakeeladri controversies
  • Kanaka Durga Temple issues
  • off the record

తాజావార్తలు

  • Nani: బ్లాక్ బస్టర్‌ డైరెక్టర్‌తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!

  • Lucknow: దారుణం.. సిగరెట్‌తో కాల్చి, తలను గోడకు బాది 5 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి.!

  • LPG Supply: గ్యాస్‌ ఆన్‌లైన్‌ బుకింగ్ మాత్రమే జరగాలి.. బ్లాక్ మార్కెటింగ్‌కి చోటు లేదు..

  • Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35B‌లను తెస్తున్న అమెరికా..

  • Suryakumar Yadav: టీమిండియాలోకి అడుగుపెట్టి నేటితో ఐదేళ్లు.. కెప్టెన్ సూర్యకుమార్ భావోద్వేగ సందేశం!

ట్రెండింగ్‌

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కొలుపుకిని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions