Off The Record: మౌనం పాటిస్తున్న సోము వీర్రాజు.. కారణమేంటి..?
- సోము వీర్రాజు సైలెన్స్‌పై రకరకాల డౌట్స్..
- ఫైర్ బ్రాండ్ నుంచి ఫ్రెండ్లీటోన్ ఎలా వచ్చింది?..
- 2014-19 మధ్య మిత్రపక్షంగా ఉన్నాసరే టీడీపీపై విమర్శలు..
- 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీని వదలని వీర్రాజు..
- మేం ఎమ్మెల్సీ ఇస్తే మమ్మల్నే టార్గెట్ చేస్తారా అని నాడు టీడీపీ లీడర్స్ ఫైర్..
- ఇప్పుడు కామైపోవడం వెనక వ్యూహం ఉందా?..
- మంత్రి పదవి మీద ఆశతోనే నోటికి తాళం వేశారా?..
- త్వరలోనే ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ అన్న టాక్..
- మార్పులు ఉంటాయనుకుంటున్న టైంలో సోము వైఖరిపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తూర్పుగోదావరి జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయనేంటి…. ఇలా అయిపోయారేంటి…. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సోము వీర్రాజు ఇలా కామ్‌గా మారిపోయారేంటి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ గట్టిగానే ఉందా అంటూ…. రకరకాల విశ్లేషణలు చేసేస్తూ ఆరా తీస్తున్నాయి రాజకీయవర్గాలు. ఈ మౌనం వ్యూహాత్మకమా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. ఫైర్ బ్రాండ్ నుంచి ఫ్రెండ్లీ టోన్‌కు ఎందుకు మారారంటూ అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మిత్రపక్షమా? కాదా..? అన్నదాంతో సంబంధం లేకుండానే… ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పైకి ఒంటికాలి మీద లేచేవారు సోము వీర్రాజు. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూసిన సందర్భాలు సైతం ఉన్నాయంటారు పొలిటికల్ పండిట్స్.
2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడేవారాయన. అప్పుడు మిత్రపక్షంగా ఉన్నా కూడా… స్పేర్ చేయలేదు. సరే….. అధికారంలో ఉన్నారు కాబట్టి విమర్శలు, ఆరోపణలు చేసి ఉండవచ్చుగానీ…. 2019-24 మధ్య ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా సోము వీర్రాజు టీడీపీని విడిచిపెట్టలేదు. ఆ దెబ్బకు మా మద్దతుతో ఎమ్మెల్సీ అయి మమ్మల్నే టార్గెట్ చేస్తారా అంటూ సైకిల్ నాయకులు సోమును ప్రశ్నించిన సందర్భాలు సైతం ఉన్నాయి.
14-19 మధ్య టీడీపీకి అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ ఇసుక విధానం, అవినీతి ఆరోపణలు, స్థానిక సమస్యలపై గట్టిగా స్పందించేవారు సోము. మధ్యలో తేడా వచ్చిందిగానీ, నాడు, నేడు టీడీపీకి పవర్ ఉన్నప్పుడు బీజేపీ మిత్రపక్షమే. కానీ… సోము వీర్రాజు వైఖరిలోనే మార్పు కనిపిస్తోందని అంటున్నారు. అప్పట్లో అంతలా చెలరేగిపోయి ఇప్పుడు కామ్‌గా ఉండటం వెనక భారీ వ్యూహమే ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఏపీ కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారట ఈ బీజేపీ సీనియర్. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఖాయమని చెబుతున్న టైంలో… అనవసరంగా హైపర్ అయిపోయి ఏదేదో మాట్లాడ్డం వల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతుందని, అందుకే…. ఆయన ప్రస్తుతం నోటికి తాళం వేశారన్నది తూర్పు గోదావరి టాక్. గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా… తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలు జోరుగా జరుగుతున్నాయని, ఆ సంగతి తెలిసి కూడా సోము వీర్రాజు రియాక్ట్ అవకపోవడానికి కారణం మంత్రి పదవి మీద ఆశేనన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
అదే సమయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన, రాజకీయ సమన్వయం కోసం సంయమనం పాటిస్తున్నట్టు కొందరు చెబుతున్నా…. మరి ఇదే సంయమనం అప్పుడేమైందన్నది ఇంకొందరి క్వశ్చన్. ఇది ఖచ్చితంగా అదేనన్నది ఈ ప్రశ్న వేస్తున్నవారి మాట. ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం ఒక్క పదవే ఖాళీ ఉంది. దాని కోసం చాలామంది రేస్‌లో ఉన్నారు. అయితే… పునర్‌వ్యవస్థీకరణలో కొందర్ని తప్పించి కొత్త వాళ్ళను తీసుకుంటారన్న లీకులు వస్తున్న టైంలో… సోము వీర్రాజు వైఖరి చర్చనీయాంశం అవుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా…. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మాత్రం అదేనన్నది ఎక్కువ మంది చెబుతున్న మాట. ఈ మౌనం, ఆశలన్నీ సోము వ్యక్తిగతమా లేక పార్టీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
-
Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!