Off The Record: ముమ్మిడివరం వైసీపీలో ముదురుతున్న వర్గపోరు!
- అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైసీపీలో వర్గపోరు ..
- పొన్నాడ సతీష్ వర్సెస్ పితాని బాలకృష్ణ ..
- పైకి అంతా బాగానే ఉన్నట్లు మేనేజ్ చేస్తున్న నాయకులు ..
- ఒకే పార్టీలో ఉంటూ వర్గాలుగా విడిపోయిన వైసీపీ నేతలు..
- ఎన్నికలు రాకముందే ఇద్దరు లీడర్ల డామినేషన్ ..
- ఇద్దరు నేతల తీరుతో ఫ్యాన్ పార్టీ కార్యకర్తల అయోమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైసీపీలో గ్రూప్ వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇక్కడ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా పొన్నాడ సతీష్ ఉన్నారు. గత ఎన్నికలకు ముందు జనసేన నుంచి పితాని బాలకృష్ణ పార్టీలో చేరారు. 2019లో ఆయన వైసీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ దక్కకపోవడంతో జనసేనలో చేరిపోయారు. ముమ్మిడివరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ముమ్మిడివరం సీటు మీద గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఐతే…పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి టీడీపీ పోటీ చేసింది. దాంతో మళ్లీ ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు పితాని బాలకృష్ణ. నిలకడ లేకపోవడంతో ఆయన పొలిటికల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదనేది పార్టీ సర్కిల్స్‌లో టాక్. అయితే ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ బీసీ సామాజికవర్గ నేతలే. పొన్నాడ మత్య్సకార సామాజికవర్గం కాగా, పితాని బాలకృష్ణ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా పార్టీ ద్వితీయ శ్రేణి నేతలను డివైడ్ చేసి రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. నిజానికి…పైకి అంతా బాగానే ఉన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించినట్లుగా పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. దాంతో ముమ్మిడివరం నియోజకవర్గం ఫ్యాన్ పార్టీలో రాజకీయం గజిబిజిగా మారిందట.
ఈ ఇద్దరు నేతలు 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. పొన్నాడ సతీష్ విజయం సాధించారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి ఎదుగుదల కోసం వాళ్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల తీరుతో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని టాక్. ఈసారి ముమ్మిడివరం సీటు తమదంటే తమదని ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటున్నారట. త్వరలోనే సతీష్‌కు చెక్ పెడతారని…పార్టీ దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని బాలకృష్ణ వర్గం ప్రచారం చేసుకుంటోంది. పితాని బాలకృష్ణకు అంత సీన్ లేదని, నిలకడలేని రాజకీయాలు చేస్తారని సతీష్ వర్గం ఎదురు దాడికి దిగుతోందనేది ఇన్సైడ్ టాక్. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్న లోపల మాత్రం క్యాడర్ డివైడ్ అయిపోతున్నారట. అపోజిషన్‌లో ఉండి యూనిటీగా పని చేయాల్సింది పోయి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. కొందరు లోకల్ లీడర్లు ఈ రాజకీయాలు మనం చేయలేమంటూ సైడ్ అయిపోతున్నారు. ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఏం ఇస్తామని పెదవి విరుస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
Also Read
కూటమిని ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పని చేయాల్సింది పోయి సొంత ప్రయోజనాలు కోసం పరుగులు పెడుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారట పార్టీ క్యాడర్. అయినప్పటికీ నేతల తీరులో మాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. పార్ట్ టైంగా పార్టీలోకి వచ్చి ఫుల్ టైం గొడవలు పెట్టి వెళ్లిపోతున్నారనేది కార్యకర్తల మనసులో మాట. మొత్తానికి ముమ్మిడివరం వైసీపీలో సమన్వయం లోపించిందని స్వయంగా పార్టీ నేతలే అంగీకరించే పరిస్థితికి వచ్చిందని సమాచారం. కోఆర్డినేటర్‌కి ఎన్నికల ముందు వచ్చిన నేతకు మధ్య సరిగా పొసగడంలేదు. పైకి మాత్రం ఇద్దరూ కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంటర్నల్‌గా ఎవరి ఆధిపత్యం కోసం వాళ్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!