Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వైభవ్ ఇప్పుడు తన పర్ఫామెన్స్తో ప్రపంచ క్రికెట్‌ను అబ్బురపరిచాడు. గత మ్యాచ్ వివాదాలు, విమర్శలకు తన బ్యాట్‌తోనే కాదు.. అంతకంటే ముందే తన మైండ్ గేమ్‌తో సమాధానమిచ్చాడు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ‘ఎ’ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి, ఆపై మైదానంలో జరిగిన ఘర్షణ వైభవ్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అప్పటి నుంచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన ఈ ‘బేబీ బాస్’.. శ్రీలంక బౌలర్లు చుక్కలు చూయించాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే వైభవ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టోరీలో వైభవ్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో “100” అని రాశాడు. ఈ స్టోరీతో లంక జట్టుకు గట్టి హెచ్చరిక పంపాడు. అనుకున్నట్లుగానే ఫైనల్లో సెంచరీ మార్కును అందుకోలేకపోయినా.. కేవలం 29 బంతుల్లో 94 పరుగులతో లంక బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టించాడు. 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో లంక బౌలింగ్‌ను చీల్చిచెండాడు. ఇక, వైభవ్ కాన్ఫిడెన్స్‌పై టీమిండియా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును తాకి.. లిస్ట్-ఎ (List A) క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. తద్వారా శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే పేరిట 21 ఏళ్లుగా ఉన్న (12 బంతుల్లో హాఫ్ సెంచరీ) రికార్డును బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం బౌండరీలతోనే (5 ఫోర్లు, 5 సిక్సర్లు) తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇండియా ‘ఎ’ తరఫున అతనికిదే మొదటి అర్ధశతకం. అయితే, లంక కెప్టెన్ సహన్ అరాచ్చిగే వేసిన 9వ ఓవర్లో అవుట్ కావడంతో 6 పరుగుల తేడాతో రికార్డు సెంచరీ చేజార్చుకున్నాడు. కానీ, అవుట్ అయ్యే సమయానికి అతను చేసిన విధ్వంసం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు, వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రస్థానంలో ఇటీవలే మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు (Asian Games) 2026 కోసం ప్రకటించిన భారత సీనియర్ టీ20 జట్టులో ఈ 15 ఏళ్ల కుర్రాడికి తొలిసారిగా చోటు దక్కింది. కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే భారత పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట 36 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 1989లో సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం (Debut) చేసి, భారత్ తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. రాబోయే విదేశీ పర్యటనలో వైభవ్ కనుక తుది జట్టులో ఆడితే.. సచిన్ రికార్డును అధిగమించి, భారత అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ చరిత్రలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో ఉండగా.. వన్డేల్లో సచిన్ (16 ఏళ్ల 238 రోజులు) పేరిట ఆ రికార్డు ఉంది. ఇప్పుడు వీరందరి రికార్డులను తిరగరాస్తూ వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో ఒక సరికొత్త శకానికి నాంది పలకబోతున్నాడు!
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!