Off The Record: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్క ట్వీట్‌తో ఇరుకున పడ్డారా..?
- పవన్ ట్వీట్ బూమరాంగ్ అయిందా?..
- డిప్యూటీ సీఎం అంత మాట అంటారా అంటూ పొలిటికల్ ఫైర్..
- తిత్లీ తుపాను బాధితుల పరామర్శ ఫోటో ట్వీట్ చేసిన మనోహర్..
- రీ ట్వీట్‌లో పవన్ చేసిన కామెంట్స్ చుట్టూ వివాదం..
- యువత ఉచితాలు కోరుకోవడం లేదు..
- పాతికేళ్ళ భవిష్యత్ అడుగుతున్నారన్న పవన్..
- లక్షా 20వేల కోట్ల ఉచితాల వాగ్దానాలు చేసి ఆ ట్వీట్ ఎలాగంటూ ఫైర్..
- ప్రభుత్వం పక్కకు తప్పుకుంటోందా అంటూ సోషల్ చర్చలు..
- పవన్ ఉద్దేశ్యం వేరైనా... టైమింగే తేడా కొట్టిందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఒక్క రీ ట్వీట్… ఒకే ఒక్క రీ ట్వీట్…. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. దాని వాస్తవ సారాంశం, అలా మెసేజ్ పెట్టడం వెనక ఆయన ఉద్దేశ్యం ఏదైనా కావచ్చు. అది మంచా చెడా అన్నదాంతో… అస్సలు సంబంధమే లేదు. కానీ… పవన్ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ఆ ట్వీట్ కాస్త డిఫరెంట్‌గా అర్ధమైందట. హవ్వ… డిప్యూటీ సీఎం అయి ఉండి అంత మాట అంటారా? అవే తేడా మాటలు అప్పుడు ఎందుకు అనలేదు? అని ఉంటే అప్పుడే తెలిసేదికదా అంటూ.. సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తిత్లీ తుపాను బాధితులను 2018లో పవన్ కళ్యాణ్ పరామర్శించినప్పుడు ఆయనతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. దాన్ని ట్యాగ్ చేస్తూ పవన్ చేసిన రీ ట్వీట్ వివాదాస్పదమైంది. వాళ్లేమీ ఉచితాలు, విపరీతమైన సంక్షేమ పథకాలు అడగడం లేదు. మాకు పాతికేళ్ళ భవిష్యత్ ఇవ్వమని కోరారు. యువతలోని నిజమైన శక్తి సామర్థ్యాల్ని మనం గుర్తించాలి. అందుకోసం నేను ఎప్పుడూ వాళ్ళని కలుస్తూనే ఉంటానని మెసేజ్‌లో రాసుకొచ్చారాయన. అదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఆ పదాల వెనక పవన్ అంతరంగం ఏదైనా కావచ్చు. కానీ… అవి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధం అవుతున్నాయట. అందులోనూ… సోషల్ మీడియాలో అయితే… చెప్పేపనేలేదు. ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు పెడుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
యువత ఉచితాలు కోరడం లేదు.. పాతికేళ్ళ భవిష్యత్ అడుగుతున్నారన్న మాటలు మొదట్లో కొందరికి స్ఫూర్తిదాయకంగానే అనిపించాయట. కానీ… మెసేజ్ పెట్టిన కొన్ని గంటల తర్వాత మాత్రం రకరకాల విశ్లేషణలు బయటికి వచ్చి… రచ్చ రంబోలా అవుతోంది. ఇంకా చెప్పాలంటే పవన్‌కు అది బూమరాంగ్ అయి కొత్త తంటాలు తెచ్చిపెట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. పవన్ ఉద్దేశ్యం యువతలోని శక్తి సామర్ధ్యాలను రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కావచ్చు, ఉచితాలకు అతీతంగా వాళ్ళలోని టాలెంట్‌ని వెలికి తీయాలన్న ఉద్దేశ్యం అయితే అయి ఉండవచ్చు. కానీ… నెటిజన్స్, వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులకు మాత్రం ఇంకోలా అర్ధం అయిందట. ఎన్నికల సమయంలో లక్షా 20వేల కోట్ల రూపాయల విలువైన ఉచితాల వాగ్దానాలు చేసి, మేనిఫెస్టోలో పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని సరిగా అమలు చేయలేక పక్కకు తప్పుకుంటోందా? అందులో భాగంగానే పవన్ యువత, భవిత, ఉచితాలు వద్దంటున్నారంటూ… వ్యతిరేక కామెంట్స్‌తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు… కూటమి పార్టీల ప్రచారం మొత్తం ఉచిత హామీల మీద ఆధారపడే జరిగిందని, ఇప్పుడు ఆ సంగతి మర్చిపోతే ఎలాగంటూ గుర్తు చేస్తున్నారు. కొందరైతే… డైరెక్ట్‌గా మానిఫెస్టో పేజీల్ని షేర్ చేస్తూ…. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ ట్వీట్ మంచా చెడా అన్న సంగతి కాసేపు పక్కనబెడితే… ఇక్కడ సమస్య అంతా టైమింగ్‌లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.
Also Read
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైంది. ఒక్కొక్కటిగా…ఉచిత పథకాలు అమలవుతున్న టైంలోనే… పవన్ ఫ్రీ బీస్‌కు వ్యతిరేకంగా మెసేజ్ పెట్టడం వల్లే వల్లే టార్గెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ప్రచారంలో ఉచితాలతో ఓట్లు సంపాదించి, ఇప్పుడు నీతులు చెప్పడం, మోరల్ లెక్చర్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సాధారణంగా పవన్ చేసే ట్వీట్స్ బుల్లెట్స్‌లా దూసుకుపోతుంటాయి. కానీ… ఈసారి మాత్రం ఆ బుల్లెట్ బూమరాంగ్ అయి… ఆయన మీదికే దూసుకువచ్చిందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. మామూలుగా వేరే ఎవరన్నా ఇలాంటి ట్వీట్ చేసి ఉంటే పెద్దగా రియాక్షన్స్ ఉండకపోయేవిగానీ…. డైరెక్ట్‌గా ఉప ముఖ్యమంత్రి అభిప్రాయం కావడంతో… రాజకీయ రచ్చ అవుతోంది. ఆయన మాట కరెక్ట్ అయిఉండవచ్చుగానీ… టైమింగ్ మాత్రం పూర్తిగా రాంగ్ అంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!