Off The Record: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి. ప్రస్తుతం ఈ దంపతుల ఫొటోలతో వేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అసమర్దుల, అవినీతి పరుల చేతిలో బందీ అయిన మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల సంకెళ్లు తెంచాలని ఆ పోస్టర్లలో రాశారు. పూర్వవైభవం తెచ్చేందుకు మళ్లీ మీరు రావాలి అని రెండు సెగ్మెంట్లలో పోస్టర్లను అంటించారు. ఈ పోస్టర్ల వెనుక మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందా? వాళ్ల ప్రమేయం లేకుండా వీటిని వేసే ధైర్యం ఎవరికి ఉంది? రాజకీయ ఉనికి కోసమే ఈ ఎత్తుగడ వేశారా? కొత్తకోట దంపతుల లక్ష్యం ఏంటి? అని అధికారపార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట. మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి శిబిరాల్లోనూ ఇదే హాట్ టాపిక్.
Read Also: Off The Record: ఎమ్మెల్సీగా సిపాయి ఎంపిక.. వైసీపీలో చర్చ..!
2009 ఎన్నికల్లో దేవరకద్ర నుంచి సీతా దయాకర్‌రెడ్డి, మక్తల్ నుంచి దయాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఉనికి కోల్పోయారనేది రాజకీయవర్గాల అభిప్రాయం. రెండు నియోజకవర్గాల్లోని కొత్తకోట దంపతులు అనుచరులు గులాబీ పార్టీలో ఎప్పుడో సర్దుకున్నారు. అయినా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్, బీజేపీలతోపాటు అధికార పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. వాళ్లు గురిపెట్టిన మూడు పార్టీల్లోనూ మక్తల్, దేవరకద్ర టికెట్లు ఖాళీగా లేవు. దాంతో కొత్తకోట దంపతులే ఆ ప్రచారం చేసుకున్నారా అనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నుంచి అయితే బయటకొచ్చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలనేది పెద్ద ప్రశ్న.
Read Also: Off The Record: ఎమ్మెల్సీగా సిపాయి ఎంపిక.. వైసీపీలో చర్చ..!
ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. జనాల్లో తమ గురించి చర్చ జరగాలని.. అటెన్షన్ రావాలని అనుకున్నారో ఏమో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పోస్టర్ల యుద్ధం మొదలుపెట్టారని రెండు నియోజకవర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. గులాబీ కండువా కప్పుకోవాలని దంపతులు అనుకున్నా.. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో బ్రేక్ పడినట్టు చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు లక్ష్యంగా పోస్టర్లు వేసి ఉంటారని అధికారపార్టీ నేతలు సందేహిస్తున్నారట. కొత్తకోట దంపతుల సమయంలోనే రెండు నియోజకవర్గాలకు చీకటి రోజులు అని ఎదురుదాడి మొదలుపెట్టారు. ఉనికి కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని.. వాళ్లను జనాలు పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడుతున్నారు గులాబీ నాయకులు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పోస్టర్ల యుద్ధం రెండు నియోజకవర్గాల్లో చర్చగా మారిపోయింది.