Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- గాయత్రి రవి కంపెనీల మీద వరుసగా విజిలెన్స్ దాడులు..
- నిజంగానే అక్రమాలా? లేక రాజకీయ కక్ష సాధింపులా?..
- మొదట కాంగ్రెస్‌లోనే రవి, 2018లో ఎమ్మెల్యే టిక్కెట్, ఓటమి..
- 2018 తర్వాత బీఆర్ఎస్లోకి, రాజ్యసభ సీటు..
- 2024లో ఖమ్మం ఎంపీగా పోటీ చేయమని కోరిన కాంగ్రెస్..
- కాదన్నందుకే ఇప్పుడిలా అంటూ కొందరి విశ్లేషణలు..
- ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు..
- ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో కీలకంగా మారిన గాయత్రి రవి..
- ప్రస్తుత మంత్రి ఒకరికి అప్పట్లో రైట్ హ్యాండ్‌లా వద్దిరాజు..
- దాడుల గురించి మంత్రికి చెప్పినా నావల్ల కాదని చేతులెత్తేశారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఖమ్మం జిల్లాలో విజిలెన్స్ దాడులు కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా… బీఆర్ఎస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవికి చెందిన కంపెనీల మీదే వరుసబెట్టి జరుగుతుండటం పొలిటికల్ హాట్ అవుతోంది. ఇదంతా నిజంగానే అక్రమాల వెలికితీత కోసం జరుగుతోందా…? లేక రాజకీయ కక్ష సాధింపులో భాగమా అన్న అనుమానాలు అన్ని వర్గాల్లో పెరుగుతున్నాయట. వరంగల్ జిల్లాకు చెందిన వద్దిరాజు… ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గ్రానైట్ వ్యాపారం ఉంది. బీసీ కాపు సామాజిక వర్గానికి చెందిన రవి… మొదట్లో కాంగ్రెస్ అభిమానిగానే ఉన్నారు. 2018లో ఆ పార్టీ వరంగల్ తూర్పు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చిందిగానీ… విజయం సాధించలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరాక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు కేసీఆర్. ఆ పదవీకాలం రెండేళ్ళే కావడం, ముగిసిపోవడంతో… తిరిగి ఆయనకే రెన్యువల్ చేశారు. ఈ పరిస్థితుల్లో… 2024 లోక్‌సభ ఎన్నికల్లో వద్దిరాజును తమ పార్టీ తరపున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకున్నారట కాంగ్రెస్‌లోని కొందరు. అందుకు ఆయన ఒప్పుకోకపోగా… బీఆర్ఎస్కు అండగా ఉంటున్నారన్న కోపంతో అధికార పార్టీ ఇప్పుడు టార్గెట్ చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. కేసీఆర్, హరీష్‌రావు లాంటి అగ్ర నాయకులకు దగ్గరగా ఉండే గాయత్రి రవిని బీఆర్ఎస్కు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ క్రమంలోనే…. కొద్ది రోజులుగా ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీల్లో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయన్న ప్రచారం నడుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రానైట్ క్వారీల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే… ఇవి ఎక్కడా బయటికి ఎక్స్పోజ్ అవకుండా జాగ్రత్త పడ్డారట అధికారులు. మరోవైపు కొంతకాలంగా… ఖమ్మం జిల్లా కారును గాయత్రి రవి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల, సండ్ర వెంకటవీరయ్య కలిసి నడిపిస్తున్నారు. ఇందులో కీలకంగా ఉన్నందునే గాయత్రి రవి టార్గెట్ అయ్యారా… అన్న అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయట. జిల్లాలో ఉన్న ముఖ్యమైన ప్రతిపక్ష నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేసేలా అధికార పార్టీ పావులు కదుపుతోందన్నది బీఆర్ఎస్ అభిప్రాయం. అటు గతంలో కాంగ్రెస్ నేతలకు అత్యంత ఆప్తుడిగా ఉండేవారు రవి. ప్రస్తుతం రాష్ట్రంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఒక మినిస్టర్‌కు అప్పట్లో రైట్ హ్యాండ్‌లా ఉండేవారాయన. ఇప్పుడు తనకు ఎదురవుతున్న సమస్యలు, వేధింపుల గురించి వద్దిరాజు రవిచంద్ర సదరు మంత్రికి చెప్పుకున్నా… నా చేతిలో ఏమీ లేదని ఆయన అన్నట్టు తెలిసింది. మరోవైపు వచ్చే అసెంబ్లీ… ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే సీట్లో రవి పోటీ చేస్తారన్న ప్రచారం సైతం ఉంది. ఇక ఆయన గ్రానైట్ క్వారీలతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బంధువులు నిర్వహిస్తున్న దుకాణ సముదాయానికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారట. వాటి వెనుక సైతం అధికార పార్టీ నేతల వత్తిడి ఉందని ఆఫ్ ద రికార్డ్‌లో అజయ్ అంటున్నారట. అయితే దాన్ని ఇష్యూ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ ఉండదన్నది ఆయన అభిప్రాయం. అయితే… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా పాలిటిక్స్‌లో అజయ్ వర్సెస్ గాయత్రి రవి అన్నట్టుగా కూడా వ్యవహారాలు నడిచాయి. ఆ సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం నడుస్తున్న విజిలెన్స్ వ్యవహారాలను గాయత్రి రవి ఎలా ఎదుర్కొంటారోనని చూస్తున్నాయి రాజకీయవర్గాలు.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
తాజావార్తలు
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ