Off The Record: దేవినేనిని మరోసారి టార్గెట్ చేసిన కేశినేని.. గేమ్ స్టార్ట్ చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఐ డోన్ట్ లవ్యూ.. యూ లవ్ మీ. ఇప్పుడు కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని మైలవరంలో జరిగిన కబడ్డీ పోటీల్లో చేసిన ఈ కామెంట్స్ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. నాని చేసిన లవ్ కామెంట్స్.. పూర్తిగా దేవినేని ఉమను ఉద్దేశించే అని చెవులు కొరుక్కుంటున్నారు. గత కొంత కాలంగా మైలవరం టీడీపీలో దేవినేని ఉమకు వ్యతిరేకంగా పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు రాజకీయం చేస్తున్నారు. ఈసారి టికెట్ తనకే ఇవ్వాలనేది బొమ్మసాని డిమాండ్. ఆయనేమో ఎంపీ కేశినేని వర్గం. పనిలోపనిగా నియోజకవర్గంలో దేవినేని ఉమ వ్యతిరేకులను ఒక్కతాటి మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఈ విషయంలో ఉమ కుతకుతలాడుతున్నారు.
Read Also: Off The Record: రాహుల్ పాదయాత్ర ముగింపు సభ.. బీఆర్ఎస్ను ఎందుకు పిలవలేదు?
Also Read
బొమ్మసాని ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలకు హాజరైన కేశినేని నాని.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూ పొగడ్తల్లో ముంచెత్తారు. గత ఎన్నికల్లో వసంత చేతిలోనే దేవినేని ఉమా ఓడిపోయారు. వసంత బాగా పని చేస్తున్నారని.. అందుకే ఎంపీ నిధులు కూడా ఇచ్చానని నాని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఉమాకు చురకలు వేశారు. నాలుగుసార్లు గెలిచాం.. తామేం చేసినా చెల్లుతుందనే కాలం పోయిందన్నారు నాని. పైగా ఐ డోన్ట్ లవ్యూ.. బట్ యూ లవ్ మీ అంటే ఎలా కుదురుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఈ టీడీపీ ఎంపీ.
దేవినేని ఉమ.. ఇప్పుడు కేశినేని నానికి ఎందుకు టార్గెట్ అయ్యారనేది ప్రశ్న. ఇద్దరూ టీడీపీలోనే ఉన్నా.. గ్యాప్ ఉంది. ఒకరంటే ఒకరికి పడదు. దీనికి తగ్గట్టు ఇటీవల నాని సోదరుడు చిన్ని యాక్టివ్‌గా ఉంటున్నారు. కేశినేని బ్రదర్స్‌కు పడటం లేదు. చిన్నికి ఉమా మద్దతుగా ఉండటం కూడా ఎంపీకి కాలుతోందని టాక్. తనకు వ్యతిరేకంగా తమ్ముడితో కలిసి ఉమ రాజకీయం చేస్తున్నారని నాని ఫైర్ అవుతున్నారు. అందుకే ముసుగులో గుద్దులాట ఎందుకని.. కేశినేని నాని నేరుగా మైలవరంలో ల్యాండ్ అయ్యారని అనుకుంటున్నారు. ఈ అంశంపై ఉమ వర్గం గుర్రుగా ఉన్నా.. ఇంకా బయట పడలేదు. సమయం చూసుకుని కౌంటర్ ఇస్తారని ఆయన వర్గం చెబుతోంది. మరి.. మైలవరం టీడీపీలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి
తాజావార్తలు
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!