Off The Record: హిందూపూర్‌లో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తుందా?
- హిందూపురంలో లేస్తూ పడుతున్న వైసీపీ..
- ప్రతి ఎన్నికలో ఒక్కో అభ్యర్థి మార్పుతో దెబ్బలు..
- ఇప్పటికే నియోజకవర్గ పార్టీలో మూడు గ్రూపులు..
- 2024లో కురుబ దీపికను తీసుకొచ్చినా తప్పని ఓటమి..
- వైఎస్ జయంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే..
- ఈసారి నేనే అభ్యర్థి అని ప్రకటించుకున్న నవీన్ నిశ్చల్..
- 2029 టిక్కెట్ నాదేనన్న కొండూరు వేణుగోపాల్‌రెడ్డి..
- ఇద్దర్నీ సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్టానం..
- నైరాశ్యంలో హిందూపురం వైసీపీ కేడర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పార్టీ అధిష్టానాలు తీసుకునే నిర్ణయాలు.. లీడర్లకు మేలు చేయకపోయినా.. క్యాడర్‌కు మాత్రం కీడు చేయకూడదని అంటారు. కానీ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం కేడర్‌కు కీడే చేస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ…. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూపిస్తున్నారు పరిశీలకులు. ఇక్కడ వైసీపీ ఆవిర్భావం నుంచి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే వరుసగా మూడు సార్లు ఓడిపోయిందన్న అభిప్రాయం ఉంది. పార్టీ వేవ్ బలంగా ఉన్న 2019ఎన్నికల్లో కూడా హిందూపురంలో దారుణ పరాభవం చవి చూసింది వైసీపీ. మొదటి నుంచి ఇక్కడ పార్టీలో వర్గ విబేధాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న నవీన్ నిశ్చల్ వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయానికి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. ఆయన వచ్చాక ఇక్కడ గ్రూపులు పెరిగిపోయాయి.
Read Also: Ganja Case : మత్తుకు బానిసలైన మెడికోలు..
Also Read
ఓ వైపు నవీన్ నిశ్చల్ వర్గం, ఇంకోవైపు ఇక్బాల్ వర్గం, ఇంకోవైపు హత్యకు గురైన చౌళూరు రామకృష్ణారెడ్డి వర్గం ఇలా… మూడు ముక్కలాట నడిచింది. అయితే…. 2024 ఎన్నికల సమయానికి ఇక్బాల్ పార్టీ నుంచి వెళ్లిపోగా… అంతకు ముందే కురుబ దీపికను సీన్లోకి తీసుకువచ్చారు వైసీపీ అధినేత జగన్. అయినా సరే… దీపికకు కూడా ఓటమి తప్పలేదు. ఇక్కడ టీడీపీ బలంతో పాటు వైసీపీ గ్రూప్స్ కూడా అందుకు కారణం అంటారు. ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాల్ని కూడా మూడు వర్గాల నేతలు ఎవరికి వారే నిర్వహించుకున్నారు. దీపికకు అధిష్టానం నుంచి ఆశీస్సులు ఉండగా.. ఇటు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి వేర్వేరుగా తమ బలం నిరూపించుకునేందుకు వైఎస్ఆర్ జయంతిని వేదికగా చేసుకున్నారు. ఇక 2029 ఎన్నికల్లో కచ్చితంగా తాను అభ్యర్థిగా నిలబడతానని ప్రకటించారు నవీన్. అటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. దీని మీద సమన్వయకర్తగా ఉన్న దీపికతో పాటు పార్టీ అబ్జర్వర్ రమేష్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
Read Also: KTR : బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి
దీంతో అధిష్టానం నవీన్ నిశ్చల్ తో పాటు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ నిర్ణయం హిందూపురం వైసీపీలో తీవ్ర కలకలం రేపుడంతో పాటు క్యాడర్‌ను గందరగోళంలో పడేసింది. సస్పెన్షన్ పై ఇద్దరు నేతలు చాలా ఘాటుగా స్పందించారు. తాము పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో చెబుతూనే…. అధిష్టానం నిర్ణయాన్ని లెక్కచేసే పరిస్థితుల్లో లేమన్న సంకేతాలు పంపారు. వాళ్ళు సస్పెండ్ అయ్యాక క్యాడర్ లో నిస్తేజం, నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలా.. లేక నవీన్, కొండూరు లాంటి నాయకుల వెంబడే తమ ప్రయాణాన్ని కొనసాగించాలా అన్న గందరగోళంలో ఉన్నారట. విషాన్ని పసిగట్టిన ఇన్ఛార్జ్ దీపిక అందర్నీ తన దారికి తెచ్చుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక్కడ ఎవరేం చేస్తున్నారో అధిష్టానం గమనిస్తోందని, పెద్దల నిర్ణయాన్ని మేం గౌరవిస్తామని చెబుతున్నారామె. ఏదేమైనా అధిష్టానం తీసుకున్న నిర్ణయం మాత్రం హిందూపురంలో వైసీపీలో గందరగోళం పెంచుతోందన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!