Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Discontent Brews In Telangana Congress Over Whip Appointments

Off The Record: విప్ ల నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు

Published Date :March 20, 2026 , 9:00 pm
By Sudhakar Ravula
  • విప్‌ల నియామకంపై తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులు..
  • పార్టీలు మారిన వాళ్ళకే ప్రాధాన్యమా అంటూ అసహనం..
  • విప్‌ పదవులు దక్కిన ముగ్గురూ పార్టీ మారి వచ్చిన వాళ్ళే..
  • వ్యతిరేకంగా మాట్లాడితేనే పదవులిస్తారా అంటూ కొందరి ప్రశ్న..
  • కుల సమీకరణల్లో కూడా ఓసీలకే పెద్ద పీట వేశారన్న టాక్‌ ..
Off The Record: విప్ ల నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ ప్రభుత్వం తాజాగా విప్‌లను నియమించింది. వాటి విషయంలో ఇప్పుడు పార్టీ పరమైన రచ్చ మొదలైంది. ఆశావహులు భారీగా ఉండటం, నిరాశ పడటం సహజ పరిణామమే అయినా… ఇప్పుడో కొత్త వాదన కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. పదవుల పంపకాల్లో అంతా కొత్తగా వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కష్టకాలంలో అండగా ఉండి జెండా మోసిన వాళ్ళకు మొండి చేయి చూపిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. నమ్ముకుని ఉన్న వాళ్ళకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు కొందరు నాయకులు. ఇక తాజా పదవుల పంపకాలతో ఓల్డ్ కాంగ్రెస్ నేతలు కుత‌కుత‌లాడిపోతున్నారట. ఇత‌ర పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి వ‌చ్చినోళ్ళకే అన్నీ దక్కితే ఇక పార్టీ వాదులుగా మేమెందుకని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా విప్‌ పదవులు దక్కిన వాళ్ళలో టిడిపి నుండి వ‌చ్చిన విజ‌య‌ర‌మ‌ణారావు, బీఆర్‌ఎస్‌ నుండి వ‌చ్చిన వీరేశం, రెండు పార్టీలు మారిన యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్నారని, దీని ద్వారా నా.కత్వం ఎలాంటి సంకేతాలు పంపుతోందంటూ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు కూడా గుసగుసలాడుకుంటున్నార.

Read Also: Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..

కొందరైతే… ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా… సీక్రెట్ మీటింగులు పెట్టిన వారికి అవకాశం ఇస్తున్నారంటూ విమర్శిస్తున్నట్టు సమాచారం. పార్టీని,
నాయకుడిని నమ్ముకుని పని చేస్తున్న మమ్మల్ని పక్కన పెడుతున్నారు. వ్యతిరేకంగా మాట్లాడితేనే పదవులు వస్తాయన్న ఇండికేషన్ ఇస్తున్నారంటూ ఓ నాయకుడు నిట్టూర్పులు విడిచారు. ప్రభుత్వ విప్ లుగా నియమించిన వాళ్ళు… ఇప్పటి వరకు ప్రతిపక్షం నుండి వచ్చే విమర్శలకు కానీ… ప్రభుత్వం విధానాలపై కానీ పెద్దగా ఫోకస్ చేసింది కూడా తక్కువే. అటు సామాజిక సమీకరణల అంచనా వేసుకున్నా… ఓసీలకే పెద్దపీట వేశారన్న అభిప్రాయం ఉంది. ఇటీవల జరిగిన నియామకాల్లో సీఎం రేవంత్ రెడ్డి తన టీంను పూర్తి స్థాయిలో సెట్ చేసుకున్నారు. రాజ్యసభ సీటు విషయంలో కూడా తన మార్క్ చూపించారు. ఐతే పాతవాళ్ళను పక్కన పెట్టారన్న సంకేతాలు మాత్రం కరెక్ట్‌ కాదన్నది గాంధీభవన్‌ టాక్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress internal politics
  • Congress MLAs reaction
  • Congress senior leaders dissatisfaction
  • off the record
  • party appointments issue

తాజావార్తలు

  • Off The Record: పార్టీ తనను సరిగా వాడుకోవడం లేదని ముద్రగడ ఫీలింగ్..

  • Fake Currency: నకిలీ నోట్ సామ్రాట్..

  • Donald Trump: సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. మేము దీన్ని గుర్తుంచుకుంటామంటూ హెచ్చరిక

  • Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..

  • Dhurandhar 2: ధురంధర్-2 చెత్త సినిమా.. నటి తీవ్ర విమర్శలు

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions