Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Did Puttata Mahesh Episode Land Ramakrishna In Defense Tdp Senior Leaders Political Future In Jeopardy

Off The Record: పుట్టా మహేష్ ఎపిసోడ్ రామకృష్ణుడిని డిఫెన్స్‌లో పడేసిందా?

Published Date :March 18, 2026 , 9:00 pm
By Sudhakar Ravula
  • మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో దొరికిన ఎంపీ పుట్టా మహేష్‌..
  • యనమల రామకృష్ణుడికి స్వయానా అల్లుడు పుట్టా..
  • మహేష్‌ ఎపిసోడ్‌ రామకృష్ణుడిని డిఫెన్స్‌లో పడేసిందా?..
  • కొన్నాళ్ళుగా పార్టీతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టు యనమల..
  • రాజ్యసభ సీటు లేదా గవర్నర్‌గిరీ మీద ఆశలు..
  • రాజ్యసభకు వెళ్ళడం తన జీవితకాల కోరిక అన్న యనమల..
  • ఇప్పుడు అల్లుడి దెబ్బకు ఆశలకు గండి పడ్డట్టేనా?..
  • రామకృష్ణుడికి ఏ పదవి ఇచ్చినా నెగెటివ్‌ అయ్యే ప్రమాదం ఉందా?..
  • ప్రతిపక్షం డ్రగ్స్‌ కేసుని ఇంకా హైలైట్‌ చేస్తుందన్న భయాలున్నాయా?..
  • డ్రగ్స్‌ కేసులో ఉన్నవాళ్ళ ఫ్యామిలీకి పదవులతో రాంగ్‌ ఇండికేషన్స్‌?.. కెరీర్‌ చివర్లో సన్‌ ఇన్‌లాతో యనమలకు లాస్‌?..
Off The Record: పుట్టా మహేష్ ఎపిసోడ్ రామకృష్ణుడిని డిఫెన్స్‌లో పడేసిందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: పొలిటికల్‌ లీడర్స్‌కు సన్‌స్ట్రోక్స్‌ కామన్‌. కానీ… టీడీపీ సీనియర్‌, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి మాత్రం సన్‌ఇన్‌లా స్ట్రోక్‌ బాగా…. గట్టిగా తగులుతోందట. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీలో దొరికిపోయిన ఎంపీ పుట్టా మహేష్‌ యనమలకు స్వయానా అల్లుడు. అందుకే… ఆ ఎఫెక్ట్‌ ఎక్కడ తన అవకాశాన్ని దెబ్బ కొడుతుందోనని కంగారు పడుతున్నారట సీనియర్‌. పుట్టా మహేష్ యాదవ్ ఎపిసోడ్‌పై టీడీపీ అధిష్టానం బాగా సీరియస్‌గా ఉంది. అసలు అలాంటి పార్టీలకు ఎందుకు వెళ్ళాలంటూ స్వయంగా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పుట్టా పై ఇప్పటికే చాలా విమర్శలున్నాయి. ఇప్పుడీ డ్రగ్స్‌ కేసుతో తాను ఇరుక్కోవడమేగాక పార్టీని కూడా డిఫెన్స్‌లో పడేశారన్న చర్చలు జరుగుతున్నాయి టీడీపీ వర్గాల్లో. ఇది ఇక్కడితో ఆగితే అది వేరే సంగతి. మొయినాబాద్‌లో కట్‌ అయిన సీన్‌ అమరావతిలో యనమల రామకృష్ణుడి రాజకీయ భవితవ్యం దగ్గర ఓపెన్ అవుతుందన్న భయం పెరుగుతోందట. అల్లుడి వ్యవహారాలతో పార్టీ పెద్దల దగ్గర ఇక ఆయన నోరు తెరవగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విడత తప్ప… గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా… యనమలకు మంత్రి పదవి గ్యారంటీ అన్నట్టుగా ఉండేది. పవర్ లేనప్పుడు కూడా ఆయనకు మాత్రం ఏదో ఒక అధికారిక హోదా కొనసాగేది. కానీ… ఈసారి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్సీగా పదవీకాలం అయిపోయాక ఆయనకు ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వలేదు. అటు ఆయన కూడా పార్టీ వ్యవహారాలతో టచ్‌మీ నాట్‌ అన్నట్టుగా ఉంటున్నారు.

చాలా రోజుల నుంచి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా హాజరవడం లేదు. ఎందుకలాగంటే…. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సీటుగాని, గవర్నర్‌గిరీగాని ఆశిస్తున్నారట. ఏదో ఒకటి వెంటనే కావాలన్నంత ఆత్రంగా యనమల ఉన్నా… ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే వారసులకు ఛాన్స్‌ ఇచ్చి కొందరు సీనియర్స్‌ను పక్కకు పెట్టే కార్యక్రమం నడుస్తోంది పార్టీలో. అయినాసరే… తన సీనియారిటీని గుర్తించి రాజ్యసభకు పంపాలని, పొలిటికల్‌గా అదొక్కటే తన జీవిత లక్ష్యమంటూ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు యనమల. తేడాలేమీ జరక్కుంటే పరిస్థితులు ఎలా ఉండేవోగానీ, ఇప్పుడు మాత్రం…. ఉరుము లేని పిడుగులా అల్లుడి ఎపిసోడ్‌ రామకృష్ణుడి నెత్తిన పడింది. కాస్త అటో ఇటో… తన జీవితకాల కోరికను నెరవేర్చుకునే అవకాశాలకు అల్లుడి రూపంలో గండి పడ్డట్టేనని అభిప్రాయపడుతున్నాయి రాజకీయవర్గాలు. ఆ ఎపిసోడ్‌ తర్వాత ఆయన ఏ ముఖం పెట్టుకుని పార్టీ పెద్దల దగ్గరికి వెళ్తారు? తనకు పదవి కావాలని ఎలా డిమాండ్‌ చేయగలుగుతారంటూ చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. కేసులో ఇరుక్కున ఎంపీ పుట్టా మహేష్‌ రాజకీయ భవితవ్యం సంగతేమోగానీ… ఆ దెబ్బకు ఆయన మామ రామకృష్ణుడికి డోర్స్‌ క్లోజ్‌ అయినట్టేనన్న అంచనాలు పెరుగుతున్నాయి.

ఇప్పటికే పుట్టా పై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు…. ఇక ఆ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారని, ఆ ప్రకారం చూసుకున్నా… సీనియర్‌ లీడర్‌కు దారులు మూసుకుని పోయినట్టేనన్న చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలతో రకరకాల ఇబ్బందులున్నాయి. ఇలాంటి సమయంలోమళ్ళీ లేనిపోని తలనొప్పులు ఎందుకన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలపడవచ్చని అంటున్నారు. ఏపీ నుంచి త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒకటి ఆశిస్తున్నారు యనమల. టీడీపీ సీనియర్స్‌లో ఒకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే… ఆయనకు వస్తే రావచ్చు. కానీ…. ఇప్పుడున్న పరిస్థితుల్లో… ఈయనా గట్టిగా అడగలేరు, వాళ్ళూ అంత సుముఖంగా ఉండకపోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. ఇప్పుడు గనుక రామకృష్ణుడికి పదవి ఇస్తే…. ప్రతిపక్షం డ్రగ్స్‌ కేసుని ఇంకా హైలైట్‌ చేసే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇప్పటికే ఎన్ని విమర్శలు వచ్చినా కొంత మంది ని చంద్రబాబు కొన్ని పోస్టుల్లో కొనసాగిస్తూన్నారని, అలాంటిది ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వారి కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తే రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే ప్రమాదం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మొత్తానికి ఈ సీనియర్‌ లీడర్‌ పొలిటికల్ కెరీర్‌ చివర్లో సన్ ఇన్ లా….. బాగా లాస్‌ చేశారన్న అభిప్రాయం బలంగా ఉంది. యనమల రామకృష్ణుడు తన జీవితకాల కోరిక నెరవేర్చుకుని పొలిటికల్‌ రిటైర్‌మెంట్‌ తీసుకుంటారా? లేక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకుంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh political future
  • Andhra Pradesh Politics
  • Chandrababu Naidu
  • Drug Case
  • family political influence

తాజావార్తలు

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

  • FASTag E-notice: హైవేలపై ఫాస్టాగ్‌ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్.. కొత్త విధానం తెచ్చిన సర్కార్..

  • Aarohi Tomar: దంగల్ స్టోరీ రిపీట్.. రెజ్లింగ్‌లో మెరుస్తున్న సహారాన్‌పూర్ చిన్నారి

  • Elista Snowstorm Air Coolers: స్నోస్టార్మ్ విత్ స్టార్మ్ కూలింగ్.. ఎలిస్టా కొత్త ఎయిర్ కూలర్లు విడుదల.. ధర ఎంతంటే?

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions