Off The Record : ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ భవిష్యత్తు ఏంటి..?
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాస్త తేడాగా వాతావరణం..
- వైసీపీ లోక్‌సభ ఇన్ఛార్జ్‌లు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి
- అనంతపురంలో పోటీ చేసి ఓడిపోయిన శంకర నారాయణ
- హిందూపురం నుంచి ఓడిపోయిన బోయ శాంతమ్మ
- పార్టీ అధిష్టానం చేసిన ప్రయోగాల వైఫల్యమే ఇందుకు కారణమా?
- పెనుకొండకు రాలేక, అనంతపురంలో ఉండలేక శంకరనారాయణ సతమతం
- హిందూపురం నుంచి కర్ణాటకకు చెందిన బోయ శాంతమ్మ పోటీ, ఓటమి
- ఓడిపోయాక హిందూపురం ముఖం చూడని శాంతమ్మ
- బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నా ఇన్ఛార్జ్‌లు లేమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయాక ఎక్కువ టైం తీసుకోకుండా….త్వరగానే కోలుకుంది వైసీపీ. అంత దారుణ పరాభావం తర్వాత రెండు మూడేళ్ళపాటు అసలు రియాక్షనే ఉండబోదని అనుకున్నారు చాలా మంది. కానీ…. పార్టీ అధినాయకత్వం కోలుకోవడంతో పాటు… టాప్ టు బాటమ్ పార్టీని రీ ఛార్జ్ చేసే యాక్టివిటీని కూడా వెంటనే పెంచేసింది. దాంతో…. అన్ని ప్రాంతాల్లో క్యాడర్ యాక్టివ్ అవుతోంది. చాలా మంది నేతలు అప్పుడే 29 ఎన్నికలకు ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారు కూడా. కానీ…. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం కాస్త తేడాగా కనిపిస్తోందట. ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు ఎవరో, ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా అన్నది కేడర్‌లో ఉన్న అతిపెద్ద సందేహం. ఇంతకీ ఎవరా ఇన్ఛార్జ్‌లంటే…. అనంతపురం లోక్‌సభ సీటుకు గత ఎన్నికల్లో పోటీ చేసిన శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ సీట్లో ఓడిపోయిన శాంతమ్మ ఇన్ఛార్జ్‌లుగా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళెందుకు యాక్టివ్‌గా లేరంటే…ఒక రకంగా అందుకు పార్టీ అధిష్టానమే కారణం అంటూ లోకల్ లీడర్స్ వేళ్ళు అటువైపు చూపిస్తున్నాయి. ఇదంతా గత ఎన్నికల్లో చేసిన ప్రయోగాలు వికటించిన ఫలితమేనని అంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్‌ను 2024లో పెనుకొండకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడున్న శంకర్‌నారాయణను తీసుకొచ్చి అనంతపురం లోక్‌సభ సీటుకు పోటీ చేయించారు. ఆయనకు అది ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా బలవంతంగా టికెట్ ఇచ్చి పంపింది వైసీపీ అధిష్టానం.
అందుకే… ఓటమి తర్వాత శంకర్‌నారాయణ మనసంతా తిరిగి పెనుకొండ వైపు లాగుతున్నా…. అటు వెళ్ళే అవకాశం రాక, అమనంతపురంలో కొనసాగలేక కామ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అటు హిందూపురం పార్లమెంట్ పరిస్థితి ఇంకో రకంగా ఉందట. ఇక్కడ ఇన్ ఛార్జిగా గత ఎన్నికలకు ముందు శాంతమ్మను నియమించి ఆమెకే ఎంపీ టికెట్ ఇచ్చారు. అప్పుడు అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ పై అనేక విమర్శలు రావడంతో ఆయనకు టికెట్ నిరాకరించి బోయ శాంతమ్మను తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవంగా శాంతమ్మది ఆంధ్రప్రదేశ్ కాదు. ఒకప్పుడు కర్ణాటక నుంచి ఎంపీగా పనిచేశారామె. అయితే కాస్ట్ ఈక్వేషన్స్ అంటూ గత ఎన్నికల్లో వైసీపీ అధినేత ఆమెకు హిందూపురం టికెట్ ఇచ్చారు. ఎన్నికల ముందు కాస్త యాక్టివ్ గానే కనిపించినా…ఓటమి తర్వాత ఆమె జాడే లేదు. కూటమి వేవ్ లో ఇటు శంకర్ నారాయణ, అటు శాంతమ్మ ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. శాంతమ్మ అయితే ఓడిపోయింది మొదలు ఇప్పటి వరకు తిరిగి హిందూపురం ముఖం చూసింది లేదు. అసలు అధికారికంగా వారు ఇన్ ఛార్జిలుగా ఉన్నారా లేదా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. బలమైన కురుబ, బోయ సామాజిక వర్గాలు గతంలో టీడీపీ వైపు ఉన్నా.. జగన్ రాకతో చాలా మంది వైసీపీ వెంట నడుస్తున్నారు. అలాంటి చోట ప్రస్తుతం ఇన్ఛార్జ్‌లే లేకుండా పోయారు. ఇక్కడ చాలా మంది యువ నాయకులు పార్టీలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ రాలేదనినిరాశపడ్డా వెంటనే రీఛార్జ్ అయ్యారు. ఇలాంటి వారంతా తమకు ఎక్కడో ఒక చోట అధిష్టానం ఛాన్స్ ఇవ్వకపోదా అనే ఆశలో ఉన్నారు. అయినప్పటికీ అట్నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేక నిరాశగా ఉన్నారట. ఏడాదిన్నర గడిచినా ఇంత వరకు యాక్టివ్ పాల్లమెంట్ ఇన్ఛార్జ్‌లు లేకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది అనంతపురం వైసీపీలో .
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
తాజావార్తలు
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!