NTV Telugu Site icon

Off The Record: రేవంత్‌ పూర్తిగా మారిపోయారు..? మార్పు మంచిదేనా..?

Revanth

Revanth

Off The Record: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, వ్యవహార శైలి గతానికంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహబూబ్‌నగర్‌ రైతు పండుగ వేదిక నుంచి మొదలుకుని.. తాజాగా జరిగిన సభల వరకు ఆయన ప్రసంగం చూస్తుంటే .. వ్యూహం మారినట్టు కనిపిస్తోందన్నది వారి మాట. శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. రైతులకి ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామని చెబుతూనే.. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సహజంగానే ప్రతిపక్షాల నుంచి వచ్చే ఘాటైన వ్యాఖ్యలకు తనదైన శైలిలో దీటుగా సమాధానం చెబుతుంటారు ముఖ్యమంత్రి. కానీ.. మహబూబ్‌నగర్‌ వేదికపై మాత్రం తానేం చేశాను.. ఏం చేయాలనుకుంటున్నాననే విషయాలను చెప్తూనే ప్రతిపక్షాన్ని మర్యాదపూర్వకంగా కార్నర్ చేయడాన్ని ఆసక్తిగా గమనించారు విశ్లేషకులు.

Read Also: Vimal Masala Soda: ఎంతకు తెగించార్రా.. విమల్ పాన్ మసాలా ట్రై చేసారా మీరు.. వీడియో వైరల్

ఇక, ఆ మరుసటి రోజు జరిగిన మీడియా సమావేశంలో కూడా పాజిటివ్ కోణంలోనే ప్రభుత్వాన్ని ప్రజెంట్ చేశారు రేవంత్‌రెడ్డి. ఇక సోమవారం ఆరోగ్య శాఖ నిర్వహించిన వేడుకల్లో కూడా పాజిటివ్ అప్రోచ్‌ని ఫాలో అయ్యారాయన. ఎవరి పేరు ప్రస్తావించకుండా తను చెప్పాలనుకున్న అంశాలను మాత్రమే చెప్పారు. అంతే తప్ప మునుపటిలా రాజకీయ ప్రత్యర్థి శిబిరంలో ఉన్నవారి పేర్లను ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రిలో వచ్చిన ఈ కొత్త మార్పు గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఈ మధ్య కాలంలో ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శల్లో భాష చాలా కటువుగా ఉంటోందని, వారి ట్వీట్లలో కూడా ఏకవచనంతో రాయడం కరెక్ట్‌ కాదన్న అభిప్రాయం ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే… ముందు మనం మారాలన్న అభిప్రాయం ఉందట కాంగ్రెస్‌ వర్గాల్లో. అందులో భాగంగానే.. ముఖ్యమంత్రి భాష తీరులో కూడా మార్పు వచ్చి ఉండవచ్చంటున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొత్తల్లో కొన్నాళ్ళు సాదాసీదాగా ప్రసంగాలు చేశారు రేవంత్‌రెడ్డి. కానీ, ప్రతిపక్షం నుంచి తేడా పద ప్రయోగం జరగడంతో.. తాను కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాలనుకున్నారట ఆయన. అందుకు ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పడంతో… నీవు నేర్పిన విద్యయే కదా అంటూ కార్నర్‌ చేయడానికి ఆ దూకుడు ఉపయోగపడిందన్న అభిప్రాయం ఉంది. కానీ… అధికారంలో ఉన్న వాళ్లు కాస్త సంయమనంతో వ్యవహరించాలని, ప్రతిపక్షంతో పోటీ పెట్టుకుని నోటికి పని చెబితే ఎలాగన్న ప్రశ్నలు, మార్చుకోవాలన్న సూచనలు వచ్చాయట.

Read Also: Fish Oil Benefits: అందంగా, యవ్వనంగా కనపడాలంటే ఫిష్ ఆయిల్ ట్రై చేయాల్సిందే

ముఖ్యమంత్రి మాట తీరులో మార్పునకు అది కూడా ఓ కారణం అయి ఉండవచ్చంటున్నారు. అదే సమయంలో… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ, గత ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన రైతుబంధు, ఆరోగ్య భీమా లాంటి వాటిని క్లియర్‌ చేసింది. 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్, వరికి బోనస్ లాంటి వాటిని కూడా అమలు చేసింది. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి దూకుడుగా మాట్లాడడం వల్ల.. తాము చేసిన పనులకంటే… ప్రతిపక్షానికి, తమకు మధ్య జరిగే మాటల యుద్ధానికే ఎక్కువ ప్రాధాన్యం వస్తోందని, దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతోందన్న అభిప్రాయానికి వచ్చాకనే ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకుని ఉండవచ్చని కూడా అంటున్నారు. క్యాబినెట్‌ మంత్రులు కూడా తమ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి పెద్దగా చెబుతున్నట్టు కనిపించడం లేదట. అందుకే.. ఇక వాళ్ళు కూడా చేసిన పనులు చెప్పుకుంటూ… ప్రజల్ని కన్విన్స్‌ చేయాలని సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే… సీఎం రేవంత్ రెడ్డి తన పాత పద్ధతిని పక్కనపెట్టి పాజిటివ్ అప్రోచ్‌లో ప్రసంగిస్తున్నారట. అయితే అదే సమయంలో సీఎం సాదాసీదాగా మాట్లాడితే… కేడర్‌లో జోష్‌ ఎలా వస్తుందన్న డౌట్స్ కూడా వస్తున్నాయట. కానీ… ప్రతిపక్షం మరింత దూకుడుగా మాటలు పెంచితే మాత్రం అందుకు అనుగుణంగానే సమాధానం చెప్పాలన్న అభిప్రాయం కూడా ఉందట. ముందు మనం చేస్తున్నది చెబుతూనే.. ఓపికతో ఉందామని.., అప్పటికి కూడా ప్రతిపక్షం మరీ ఎక్కువ చేస్తే తిరిగి మొదలు పెట్టొచ్చన్న చర్చ కూడా జరుగుతోందట కాంగ్రెస్‌ వర్గాల్లో. .

Show comments