Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Brs Party Focus On Andhra Pradesh

Off The Record About BRS: ఏపీలో బీఆర్‌ఎస్‌ సరికొత్త వ్యూహం..! గులాబీ దళపతి టచ్‌లో పలువురు నేతలు

Published Date :December 15, 2022 , 9:28 pm
By Sudhakar Ravula
Off The Record About BRS: ఏపీలో బీఆర్‌ఎస్‌ సరికొత్త వ్యూహం..! గులాబీ దళపతి టచ్‌లో పలువురు నేతలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ రాజధాని ఢిల్లీలో BRS ఆఫీసు ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్‌ పెట్టారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌. అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ అనే నినాదంతో పాగా వేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్‌ స్పేస్‌ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ నజర్‌ ఉంది. ఆ విధంగా తెలుగు రాష్ట్రమైన ఏపీపైనా ఆరా తీస్తున్నారట. ఇప్పటికే BRS విస్తరణ దిశగా చర్యలూ మొదలైనట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. తర్వాత ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణకు తగింత సమయం కూడా చిక్కుతుందనే ఆలోచన గులాబీ శిబిరంలో ఉంది. గతంలో సీఎం కేసీఆర్‌ వైజాగ్‌ వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజల్లో అనూహ్య స్పందన కనిపించిందని.. అందుకే ఏపీలో సానుకూల వాతావరణమే ఉంటుందని అనుకుంటున్నారట.

Read Also: Off The Record About Nadella and Kanna Meeting: కన్నా – నాదెండ్ల భేటీ ఆంతర్యం ఏంటి? వ్యూహమా..? తెగింపా..?

ఏపీలోని వైసీపీ సర్కార్‌తో సన్నిహిత సంబంధాలే ఉన్నప్పటికీ.. అక్కడ బీజేపీ వ్యతిరేక వాతావరణం కూడా ఉందని అంచనా వేస్తున్నారట గులాబీ నేతలు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలిచినా.. ఎంపీలుగా ఎవరు ఉన్నప్పటికీ.. వాళ్లు బీజేపీవారేనని మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గతంలో కామెంట్‌ చేశారు. బీజేపీపై పోరాటం చేస్తున్న BRSకు ఏపీలో తప్పకుండా ఆదరణ లభిస్తుందని అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఉండవల్లితో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అలాంటి మరికొందరు కీలక నేతలను ఆకర్షిస్తే.. వర్కవుట్‌ అవుతుందనే వాదన ఉందట. పీసీసీ మాజీ చీఫ్‌ రఘువీరారెడ్డి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితర నేతలను BRSలోకి ఆహ్వానించే పనిలో ఉన్నారట. ఏపీలోని వివిధ పార్టీల నాయకులతో సత్ససంబంధాలు కలిగిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇప్పటికే కొందరితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏపీలో సంక్రాంతి కోడి పందాలకు భీమవరం తదితర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంటారు తలసాని. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలను బీఆర్‌ఎస్‌ విస్తరణకు ఉపయోగించుకోవచ్చునని తెలుస్తోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఏపీ మూలాలు ఉన్నవారిని పార్టీ విస్తరణకు తెరపైకి తీసుకొస్తారనే ప్రచారం ఉంది. సీఎం కేసీఆర్‌ ఏపీలోని పాత పరిచయాలను కదిలిస్తే.. మిగతా పని ఇలాంటి నాయకులంతా పూర్తి చేస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపించే నేతలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారట. సామాజికవర్గాల లెక్కలను కూడా దగ్గర పెట్టుకుని.. బీసీలు.. ఎస్సీలు.. ఎస్టీలు.. ఓసీల్లో ఎవరు కీలక నేతలు.. వారిని చేర్చుకుంటే కలిగే రాజకీయ లాభం తదితర అంశాలను బేరీజు వేసుకుంటున్నారట. ఈ లెక్కలు బీఆర్‌ఎస్‌కు కలిసొస్తాయో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • BRS
  • BRS Party
  • kcr

తాజావార్తలు

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

  • Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions