Off The Record: బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఉభయ తారకంగా పొలిటికల్ పూనకాల లోడింగ్‌కు దృష్టి పెట్టారు నేతలు.
Read Also: Off The Record: కోవర్టుల టెన్షన్..? మళ్లీ పాయకరావుపేటపై వంగలపూడి అనిత ఫోకస్
Also Read
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో బీఆర్ఎస్తో కలిసి వచ్చే పార్టీలతో జాతీయస్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను, సంఘీభావం ప్రకటించి పార్టీలను బీఆర్ఎస్ సభకు ఆహ్వానించడాన్ని ఆ వ్యూహంలో భాగంగా చెబుతున్నారు. నేషనల్ లెవల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఒక అజెండాను కూడా ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దాంతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పోషించే పాత్రపై అందరికీ స్పష్టత వస్తుందని.. ఊగిసలాటలో ఉన్న పాలు ప్రాంతీయ పార్టీలు సైతం తోడుగా వస్తాయని అనుకుంటున్నారట. సభ ద్వారా బలాన్ని చాటడం.. బీజేపీపై పోరులో తాము ఒంటరి కాదని చెప్పడం కూడా వ్యూహంలో భాగంగా తెలుస్తోంది.
ఇక బీఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మంను ఎంచుకోవడంలోనూ పార్టీ అధిష్ఠానం దూర దృష్టి ఉందనే టాక్ నడుస్తోంది. ఖమ్మం అటు ఆంధ్రప్రదేశ్‌కు, చత్తీసఘడ్, ఒడిసాలకు చేరువ. ఆయా రాష్ట్రాలకు ఎక్కువ మంది ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తారు. బహిరంగ సభ ప్రభావం ఆయా రాష్ట్రాలపై తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి చిక్కలేదు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిస్తే.. 2018లోనూ ఒక శాసనసభ్యుడే విజయం సాధించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొన్నా.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి సభను వేదికగా చేసుకుంటారని అభిప్రాయ పడుతున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా.. భారీ సభ ద్వారా దేశం దృష్టిని ఆకర్షించడం ఒక ఎత్తు అయితే.. ఓ పట్టాన మింగుడు పడని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా పాగా వేయడానికి బీఆర్ఎస్ సభ ఉపయోగ పడుతుందని లెక్కలేస్తున్నారట.
తాజావార్తలు
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!