Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్‌ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు…