NTR Politics in Ap: ఎన్టీఆర్ కేంద్రంగా రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్టీఆర్ పేరు.. ఎన్టీఆర్ ఊరు అనే కాన్సెప్ట్‌తో వైసీపీ అడుగులు పడుతున్నాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. తాజాగా నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది.
నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
NTR.. కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్‌ను ఎవరికి వారు ఓన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఏర్పడే విజయవాడ జిల్లాకు NTR పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఈ ప్రక్రియ నడుస్తుండగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్టీఆర్ భారీ విగ్రహం పెట్టాలన్న తన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయించుకున్నారు. పనులు కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచన ఉందట.
Also Read
టీడీపీ సమయంలో ఆ ఆలోచన రాలేదు
NTR విగ్రహం పెట్టాలన్న YCP నిర్ణయం కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని కానీ.. అలాగే ఆయన స్వగ్రామంలో భారీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్న ఆలోచన కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి రాలేదు. కానీ ఆ పనిని వైసీపీ చేసి చూపిస్తోందనే చర్చ జరుగుతోంది. టీడీపీ విస్మరించిన ఎన్టీఆర్‌కు వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందన్న అభిప్రాయం జనంలోకి వెళ్లడమే దాని లక్ష్యం. ఎన్టీఆర్ స్వగ్రామానికి నారా-నందమూరి కుటుంబ సభ్యులు వచ్చారు.. వెళ్లారు. నిమ్మకూరును నారా లోకేష్ దత్తత తీసుకున్నారు. కానీ తాత స్థాయికి తగ్గట్టుగా ఆయన స్వగ్రామంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం పెట్టాలన్న కనీస ఆలోచన చేయలేక పోయారనేది చర్చ. బాలయ్య కూడా వివిధ సందర్భాల్లో నిమ్మకూరును సందర్శించి.. తాను అక్కడ తిరిగాను.. ఇక్కడ ఆడుకున్నానని చెప్పుకున్నారే తప్ప.. ఎన్టీఆర్ కీర్తిని మరింత ఇనుమడింప చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదనే చర్చ స్థానికంగా జరుగుతోందట.
కీలక విషయాన్ని క్యాచ్ చేసిన వైసీపీ
NTR ఆయన సతీమణి బసవ తారకం చిన్న విగ్రహాలు నిమ్మకూరులోఉన్నాయి. అన్నిచోట్ల ఉన్నట్టే ఆ విగ్రహాలు ఉన్నాయి కానీ NTR స్వగ్రామం అన్న స్థాయిలో లేవు. దాన్నే YCP పట్టుకుంది. విశ్వవిఖ్యాత పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రాముడి స్థాయి.. ఆ లెవల్లో భారీ విగ్రహం రాబోతుంది అక్కడ. ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని రెండు బలమైన.. కీలక సామాజికవర్గాలకు చెందిన వారిని ప్రసన్నం చేసుకునేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!