Site icon NTV Telugu

Off The Record: అటవీ అధికారులు మా పాత బాస్ సంక్షేమమే ముఖ్యమంటున్నారా?

Chitoor

Chitoor

Off The Record: ఆ ఉమ్మడి జిల్లాలో అటవీ అధికారులు ఇంకా కూటమి ప్రభుత్వానికి ట్యూన్‌ అవలేదా? పాత ప్రభు భక్తిని విచ్చలవిడిగా చాటుకునే ప్రయత్నాన్ని ఇప్పటికీ చేస్తున్నారా? ఏనుగులు దాడులు చేస్తే ఏంటి? చిరుతపులి తిరిగితే మాకేంటి? మా పాత బాస్‌ సంక్షేమమే మాకు ముఖ్యం అన్నట్టుగా ఉంటున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? వాళ్ళు అలా తయారవడానికి కారణాలేంటి?

Read Also: Visakhapatnam: దారుణం.. ఆరు నెలల గర్భిణీని తగులబెట్టిన దుండగులు..

అత్యంత నాణ్యమైన, విలువైన ఎర్రచందనానికి కేరాఫ్‌ అయిన శేషాచలం అడవులతో పాటు ఏనుగులకు అవాసంగా మారిన కౌండిన్య అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా. కానీ…. ఇక్కడి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా… ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ పరిధిలో అటవీ శాఖ ఉన్నా… జిల్లా ఫారెస్ట్‌ అధికారుల కర్రపెత్తనాలతో ప్రమాణాలు, ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోతోందన్నది జిల్లాలో వినిపిస్తున్న మాట. ఇందుకు ప్రధాన కారణం ఏళ్ళకు ఏళ్ళు బదిలీలు లేక… పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బందేనని అంటున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది అయితే… దందాల్లో ఆరితేరి పోయారట. పైగా…ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా… తమకు నచ్చిన, తాము గాడ్‌ ఫాదర్స్‌గా భావించే వాళ్ల మాటకే విలువిస్తున్నారన్న టాక్‌ సైతం ఉంది ఉమ్మడి చిత్తూరులో. ముఖ్యంగా అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్‌ ఆదేశాల తర్వాత కూడా… మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద కేసు పెట్టడానికి ఏకంగా మూడు నెలల టైం తీసుకోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు కొందరు.

Read Also: Off The Record: నామినేటెడ్ పదవులిస్తామన్నా పార్టీలోకి ఎవరూ రావడంలేదా?

చిత్తూరు కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌వో సంయుక్తంగా సర్వే చేసి నిర్ధారించిన తర్వాత కూడా మీనమేషాలు లెక్కించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అంత చేసినా కూడా…. ఇప్పటి వరకు మాజీ మంత్రికిగానీ, అప్పట్లో రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులకు గానీ కనీసం నోటీసులు ఇవ్వలేదంటే అటవీ అధికారులు ఎలా పని చేస్తున్నారో, వాళ్ళ స్వామి భక్తి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్న విమర్శలు పెరుగుతున్నాయి. వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే… కొందరు ఫారెస్ట్‌ అధికారులు ఇప్పటికీ వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నారనే టాక్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది జిల్లాలో. మరీ వత్తిడి తట్టుకోలేక ఏదో… అలా ఓ కేసు పెట్టేసి ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసి చేతులు దులుపుకున్నారని, తర్వాత కేసు పురోగతి గురించి కనీస అటవీశాఖత్యులకు కూడా సమాచారం ఉందో లేదోనన్న జోకులు పేలుతున్నాయి చిత్తూరులో.

Read Also: Gujarat Honour Killing: చేజేతులా కన్నకూతుర్నే చంపేశాడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇక, తిరుపతి ఫారెస్ట్‌ రేంజ్‌లో అయితే మరీ తమాషాగా ఉందట వ్యవహారం. పాప వినాశనం డ్యామ్‌లో తమిళనాడుకు చెందిన ఓ బోటింగ్ ఏజెన్సీ ట్రయల్‌ రన్ నిర్వహించింది. దానికి సంబంధించి టీటీడీకి కనీస సమాచారం ఇవ్వలేదు. దాని మీద రచ్చ అవడంతో…చివరికి టీటీడీనే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక నగరవనంలో చెట్లు నరికించడంపై పర్యావరణ ప్రేమికులు అందోళన చేశారు. దీనిపై చివరకు డిప్యూటీ సియం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడో విచిత్రం ఏంటంటే… చెట్లు కొట్టిన వాళ్ళని వదిలేసి వద్దని ఆందోళన చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇక్కడ అటవీ విభాగంలో మొత్తం పక్క రాష్టానికి చెందిన అధికారుల పెత్తనం నడుస్తోందని అంటున్నారు క్షేత్ర స్థాయి సిబ్బంది. దీనికి తోడు ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో టాస్క్‌ఫోర్స్‌ హడావుడి తప్ప అటవీశాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్‌ ప్రతిష్టాత్మకంగా భావించి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పిస్తే… దానిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా ఏమాత్రం ఖండించలేక పోతున్నారట అటవీ అధికారులు. ఖండించడం సంగతి పక్కనబెడితే…. ఆ కుంకీ ఏనుగులు గుడ్డివి, వయసు మళ్ళినవి అని అటవీశాఖలోని కొంతమంది సిబ్బందే ప్రచారం చేశారు. తర్వాత దాన్ని వైసీపీ నాయకులు అందుకుని ట్రోల్‌ చేశారు. అయితే కుంకీ ఏనుగులు మేలో వచ్చాయి.

Read Also: Sundeep Kishan: తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆనందదాయకం..!

నిజంగా ఏదన్నా తేడా ఉంటే…వచ్చినప్పుడే వాటి గురించి చెప్పాల్సిన అటవీ శాఖాధికారులు నెలల తర్వాత మాట్లాడ్డం వెనక ఎవరున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా పలమనేరులో తొలిసారి కుంకీ ఏనుగులు ఆపరేషన్ జరిగి అది సక్సెస్‌ అయినా… ఆ విషయాన్ని బయటికి చెప్పడానికి జిల్లా అటవీ అధికారులకు మనసు రాలేదనే విమర్శలు ఉన్నాయి. కిందిస్దాయి సిబ్బంది నుంచి వచ్చిన సమాచారంతో మీడియా ఈ ఆపరేషన్ విషయాన్ని బయటపెట్టిందే తప్పా‌…. అధికారులు మాత్రం మాకేం తెలియనట్లే ఉండడంపై డిప్యూటీ సీఎం పేషీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏళ్ళ తరబడి అధికారులు ఒకే చోట పాతుకు పోవడం, అటవీ శాఖ పనితీరుపై తరచూ రివ్యూలు జరక్కపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. ఇలాగే ఉంటే… వీళ్ళ వ్యవహారాలతో ఈ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కు కూడా చెడ్డపేరు వస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Exit mobile version