Sundeep Kishan: తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆనందదాయకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక దుబాయ్ లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ వెంకట్ (హనుమాన్)లని సైమా ఘనంగా సత్కరించింది.
Pooja Pal: యూపీ సీఎం యోగిని పొగిడితే, ఎమ్మెల్యేను ఏం చేశారో తెలుసా?
Also Read
ఇక ఈ కార్యక్రమంలో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విష్ణుకి, బృందాకి, సైమాకి థాంక్యూ సో మచ్.. విష్ణు ముందే చెప్పారు, ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని అన్నారు. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇది తొలి సత్కారం. అందరూ నేషనల్ విన్నర్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విష్ణుకి, బృందాకి, సైమాకి ధన్యవాదాలు తెలిపారు. అవార్డు వచ్చిన వారికే కాదు, సినిమా కోసం పని చేసిన అందరికీ అభినందనలు తెలుపుతున్నానన్నారు. సైమా టాలెంట్ ని సెలబ్రేట్ చేసుకునే చాలా గొప్ప వేదిక. ఎన్నో గొప్ప సినిమాలు రావడానికి కారణం అవుతున్నందుకు ఈవెంట్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు కంగ్రాజులేషన్స్ అంటూ మాట్లాడారు.
MLC Kavitha: రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు కవిత.. ఎందుకో తెలుసా..?
ఇక డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత తొలి గుర్తింపు సైమా ఇచ్చిందే. విష్ణు గారికి బృందా గారికి థాంక్యూ. నా కెరీర్ లో పది అవార్డులు తీసుకుంటే అందులో ఎనిమిది అరవింద్ గారి చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ ఆయన మాట్లాడారు. ఇక హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సైమా అనేది మన సౌత్ ఇండియన్ సినిమాలకి నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చి పెట్టే అవార్డు వేడుక. నాకు సౌత్ ఇండియాలో ఉన్న దాదాపు 80% కోలాబరేషన్స్ సైమా వేడుక ద్వారానే వచ్చాయి. సైమా ప్రతి ఏడాది గొప్పగా ముందుకు వెళుతుంది. మన దేశంలో అవార్డు బ్రాండ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలా అందరికీ తెలిసిన ప్రెస్టీజియస్ అవార్డ్స్ లో సైమా ముందుంటుంది అది మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మనందరికీ ఆనందదాయకం. వేడుకలో పాలుపంచుకోవడం గర్వంగా భావిస్తున్నాను బృందా గారికి విష్ణుకి కంగ్రాజులేషన్స్ వేడుకల కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!