Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Mlc Polls Heat Up In Joint Khammam District

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!

Published Date :December 4, 2021 , 1:43 pm
By Lakshmi Narayana
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఒకే సామాజిక వర్గం కూడా. పూర్వాశ్రమంలో ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగారు. మరి.. పాత పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తాయా.. లేక ఒకరివైపే మొగ్గు చూపుతాయా?

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పూర్వం కమ్యూనిస్ట్‌లే..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్‌ పార్టీల పేరు ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆ పార్టీది టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ తర్వాత ప్లేస్‌. ఉనికి కాపాడుకోవడానికి గట్టిపోరాటమే చేస్తున్నాయి లెఫ్ట్‌ పార్టీలు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ వైఖరి ఏంటన్నది ఒక చర్చ. ఆ రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరూ బరిలో లేకపోయినా.. టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న తాతా మధు.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుల పూర్వ రాజకీయ వాసనలు కమ్యూనిస్ట్‌ పార్టీలోనే ఉన్నాయి. పాత స్నేహాలు గుర్తొచ్చి వీళ్లలో ఎవరికైనా మద్దతిస్తారా? లేక ఒకరికే జై కొడతారా? లేక తటస్థంగా ఉండే సాహసం చేస్తారా అన్నది రాజకీయ వర్గాల ప్రశ్న.

జిల్లాలో ఏడు వందల పైచిలుకు ఓటర్లు..!
సీపీఐ ఓటర్లు 34.. సీపీఎం ఓటర్లు 26

బరిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులిద్దరూ లెఫ్ట్ పార్టీల మద్దతు కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధు గతంలో సీపీఎంలో ఉన్నారు. SFIలోనూ పనిచేశారు. మధు తండ్రి, తాతలు వామపక్ష వాదులే. కొన్నాళ్లు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారు. 2014లో టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు తాతా మధు. ఆ జిల్లా మంత్రి టీఆర్‌ఎస్ అభ్యర్థి మధును వెంటబెట్టుకుని తన తండ్రి, వామపక్ష నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు దగ్గరకు తీసుకెళ్లి మద్దతుకోరారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు సైతం సీపీఎంలో పనిచేశారు. ఆ తర్వాత పీఆర్పీ.. ఆపై కాంగ్రెస్‌లోకి వచ్చారు. నాగేశ్వరరావు కుటుంబసభ్యులు సీపీఎంలో ఇంకా కొనసాగుతున్నారు. అందుకే ఇద్దరూ పాత కామ్రేడ్ల మద్దతు ఆశించారు. వాస్తవానికి జిల్లాలో ఏడు వందల పైచిలుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్‌ బలం దాదాపు ఐదొందలు పైనే. కాంగ్రెస్‌ ఓటర్లు వంద నుంచి నూట ఇరువై ఉండొచ్చని ఒక అంచనా. ఇక కామ్రేడ్ల బలం సీపీఐ 34, సీపీఎం 26. బలాబలాల పరంగా కాంగ్రెస్‌ చాలా వెనకబడి ఉంది. లెఫ్ట్‌ కలిసొచ్చినా.. రైట్‌కొట్టడం సాధ్యమా అన్నది ప్రశ్న. కాంగ్రెస్‌ క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకోవడంతో ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది.

క్యాంపుల్లో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు..!

ఎందుకైనా మంచిదని ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించేశారు. ఇటు కాంగ్రెస్‌ కూడా తమ ఓటర్లు జారిపోకుండా జాగ్రత్త పడుతోంది. కీడెంచి మేలెంచాలన్నట్టుగా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఈ సమయంలో ఎవరు ఎటు జారిపోయినా.. లెఫ్ట్ పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కీలకంగా భావిస్తున్నాయి టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌. తమ పార్టీ ఓటర్లనుఈ సమయంలో ఏ విధంగా చూసుకుంటున్నారో.. అదే విధంగా లెఫ్ట్‌ పార్టీ ఓటర్లను గౌరవిస్తున్నట్టు సమాచారం. అయితే స్థానిక రాజకీయ పరిస్థితులు.. సమీకరణాలు.. పార్టీ అవసరాలకు అనుగుణంగా కామ్రేడ్లు నిర్ణయం తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. మరి.. ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు ఎవరికి ఎర్ర తివాచీ పరుస్తాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • khammam
  • MLC ELECTIONS
  • off the record
  • telangana

తాజావార్తలు

  • MI Captaincy: “సూర్యను కెప్టెన్ చేయకపోతే హార్దిక్‌కు కష్టాలు తప్పవు”.. దిగ్గజ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు!

  • India Lok Sabha Seats Increase: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. 2029 ఎన్నికల నుంచే అమలు, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయంటే?

  • AI+ Nova 2 Ultra 5G: ఏఐ+ నోవా 2 అల్ట్రా 5జీ నోటిఫికేషన్ రింగ్ లైట్ ఫీచర్‌ తో.. రిలీజ్ కు రెడీ..

  • Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్

  • Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions