నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు. ‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా? చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్‌ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు…