తెలంగాణ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలు డిఫరెంట్. ఎప్పుడు ఏ జెండా కిందకు వెళ్తాయో.. ఎలాంటి అజెండాను ఎత్తుకుంటాయో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం కొత్త దోస్తీకి కసరత్తు చేస్తున్నట్టు టాక్. ఇంతకీ ఏంటా పార్టీలు? టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడానికి ఉన్న అభ్యంతరాలేంటి?తెలంగాణలో రాజకీయం కాక మీద ఉంది. రెండు, మూడు నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలనొప్పే అని డిసైడ్ అయినట్టు ఉంది టీఆర్ఎస్. కొత్తగా…