Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Leaflets In Anantapur Tdp

అనంతపురం టీడీపీలో కరపత్రాల కలకలం..!

Published Date :October 31, 2021 , 2:13 pm
By Lakshmi Narayana
అనంతపురం టీడీపీలో కరపత్రాల కలకలం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీ కొట్లు.. రచ్చబండల మీద జరిగే చర్చలు యమ రంజుగా ఉంటాయి. రాజకీయాలపై చాలా ఆసక్తిగా చర్చలు అక్కడ జరుగుతుంటాయి. ఒక మాజీ మంత్రిపై ఆ నియోజకవర్గంలో అలాంటి చర్చే నడుస్తోందట. చర్చకు కారణం ఆయనపై వచ్చిన ఒక కరపత్రం. ఆ కరపత్రాల టాక్స్‌ టీకొట్ల వరకు ఆగితే ఓకే.. పార్టీ అధినేత వరకు వెళ్తే ఏంటన్నదే ప్రశ్నగా మారింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..!

కాల్వ చుట్టూ టీడీపీలో విమర్శలు..!

గతంలో అనంతపురం జిల్లా టీడీపీలో ఎంతో క్రమశిక్షణ కనిపించేది. ఇప్పుడంతా వర్గ విబేధాలు.. గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపైనా విమర్శలు, ఆరోపణలు తప్పడం లేదు. జిల్లా టీడీపీలో కాల్వ కీలకం. చంద్రబాబు నమ్మే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇప్పుడు ఆయన చుట్టూనే విమర్శలు తిరుగుతున్నాయి. తాజాగా శింగనమల నియోజకవర్గం మొత్తం ఈ మాజీ మంత్రి పేరే వినిపిస్తోంది.

కాల్వ టార్గెట్‌గా శింగనమలలో కరపత్రం చక్కర్లు..!

కాల్వపై ఒక కరపత్రం శింగనమల నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఆ కరపత్రంలో మాజీ మంత్రి పేరు ప్రస్తావిస్తూనే శింగనమలలో టూమెన్‌ కమిటీ.. టీడీపీ ఇంఛార్జ్‌ బండారు శ్రావణి మధ్య ఉన్న వర్గ విబేధాలలోకి లాగారు. శింగనమల ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గం. ఇక్కడ పార్టీ ఇంఛార్జ్‌ బండారు శ్రావణిని కాదని.. అగ్రవర్ణాలకు చెందిన నాయకులతో టూమెన్ కమిటీని వేసింది టీడీపీ అధిష్ఠానం. ఆ టూమెన్ కమిటీ కర్త కర్మ క్రియ అన్నీ కాల్వ శ్రీనివాసులే అని ఆ కరపత్రంలో ఆరోపించారు.

కరపత్రంలోని అంశాలపై ఆసక్తికర చర్చ..!

ఇప్పటికే శ్రావణి వర్గీయులు టూమెన్‌ కమిటీని వ్యతిరేకిస్తూ జిల్లా టీడీపీ ఆఫీస్‌లో కాల్వతో గొడవపడ్డారు. తరచూ రోడ్డెక్కుతున్నారు స్థానిక నాయకులు. ప్రస్తుతం శింగనమల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ కరపత్రాలే కనిపిస్తున్నాయి. అందులోని అంశాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ కరపత్రాలు రావడానికి కారణం మీరంటే మీరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉద్యమానికి సిద్ధమనేలా కరపత్రంలోని అంశాలు..!

గత ఎన్నికల్లో శింగనమలలో టీడీపీ ఓటమికి కారణాలంటూ కొన్ని అంశాలను ఆ కరపత్రంలో ప్రస్తావించారు. గడిచిన రెండేళ్లుగా ఎలాంటి కార్యక్రమం చేపట్టని వారిని కమిటీలో వేశారని విమర్శించారు. దళితులకు అన్యాయం చేస్తున్నారని.. అణగదొక్కుతున్నారని.. దానికి వ్యతిరేకంగా దళిత నాయకుల యునైటెడ్ ఫ్రంట్, ఏపీ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం.. ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేర్లతో ఉద్యమానికి సిద్ధమన్న సంకేతాలు సూచించేలా ఆ కరపత్రం ఉంది.

కాల్వను టార్గెట్‌ చేసిన ఒక సామాజికవర్గం..!

ఇన్నాళ్లూ ఎటువంటి విభేదాలు లేకుండా ఉన్న కాల్వ తనదికాని నియోజకవర్గం విషయంలో చిక్కుకుని వివాదాస్పదం అయ్యారు. ఒక సామాజికవర్గం అంతా కాల్వను టార్గెట్‌ చేసింది. అది ఎక్కడ తన నియోజకవర్గంలో తన కొంపముంచుతుందనే ఆందోళనతోపాటు.. అధినేతకు ఆ కరపత్రం చేరితే వచ్చే సమస్యలు ఏంటో అర్థంకాక తల పట్టుకున్నారట కాల్వ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anantapur tdp
  • off the record
  • tdp

తాజావార్తలు

  • Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • Pakistan: మిడిల్ ఈస్ట్‌కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..

  • Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions