Off The Record: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు దర్యాప్తులో ఏం జరుగుతోంది? ఓవైపు కేసును సీబీఐకి అప్పగిస్తూనే…మరోవైపు ఏసీబీ దూకుడు పెంచడాన్ని ఎలా చూడాలి? కేసును సీబీఐ టేకప్ చేస్తుందా లేదా అన్న డౌట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా? అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎక్స్ట్రా ఎంతమంది అధికారులకు సంబంధించిన సమాచారం కొత్తగా వచ్చింది?
Read Also: Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏసీబీలో ముగ్గురు అధికారుల అవినీతిపై విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో స్టేట్ విజిలెన్స్ ఒక నివేదికను ఏసీబీకి పంపింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 33 మంది అక్రమార్కులు ఉన్నారని, వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరపాలని కోరింది. ఆ మేరకు విచారణకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. అయితే ఇక్కడే ఒక ప్రాధమికమైన ప్రశ్న వస్తోంది అందరికీ. ఓవైపు సీబీఐ దర్యాప్తు కోరుతూనే.. మరోవైపు ఏసీబీ విచారణలో దూకుడు పెంచడం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డ అధికారుల మీద చర్యలకు రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇప్పటికే 33 మంది అధికారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏసీబీకి ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అవినీతిలో వాళ్ళ పాత్ర ఉన్నట్లు నిగ్గు తేల్చింది. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు కీలక అధికారుల మీద కేసులు బుక్ అయ్యాయి.
Read Also: Dangerous Stunts on Road: ఇవే తగ్గించుకుంటే మంచిది.. స్కూటీపై స్టంట్స్ చేస్తూ యువకుడి రచ్చ రచ్చ
అయితే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది. ఆ ముగ్గురి ఆస్తులు కలిపి దాదాపు వెయ్యి కోట్లకుపైనే ఉంటాయని తేల్చారు అధికారులు. ఈ క్రమంలోనే… ఇటీవల విజిలెన్స్ కమిషన్ తన నివేదికను ఏసీబీకి పంపించింది. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోమని కోరింది. అయితే డైరెక్ట్‌గా ఒక డిపార్ట్మెంట్ సిఫారసు చేస్తే.. ఏసీబీ కేసులు నమోదు చేయరు. అందుకే ఏసీబీ నేరుగా ప్రభుత్వానికి లేఖ రాసిందట. విజిలెన్స్ శాఖ నుంచి నివేదిక వచ్చిందని, అందులో 33 అధికారుల అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉందని, వాళ్ళని విచారించేందుకు అనుమతించాలని కోరింది.
Read Also: Tilak Verma: రేవంత్‌రెడ్డిని కలిసిన తిలక్ వర్మ.. సీఎంకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తిలక్..
ఇక, ప్రభుత్వం ఈ ఫైల్ని పరిశీలించి తదుపరి చర్యలకు ఆదేశించే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఏసీబీ దూకుడు పెంచి విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అటు సీబీఐ నుంచి ఇంకా సమాచారం రావాల్సిఉంది. ప్రభుత్వం లేఖ రాసినా.. ఇప్పటిదాకా అట్ముంచి నో రియాక్షన్. అందులో కూడా రాజకీయ నాయకులతో పాటు అధికారుల అక్రమాల చిట్టా ఉందట. అయితే ఒకవైపు కేంద్ర హోం శాఖ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉండగానే…ఏసీబీ దూకుడు పెంచడంలో అర్థం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. ఇన్ని రోజుల నుంచి రియాక్షన్ లేకపోవడంతో… ఒకవేళ సీబీఐ కేసు టేకప్ చేయకపోతే ఎలాగన్న డౌట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా అన్న చర్చ మొదలైంది. ఎటుపోయి ఎటొచ్చినా దర్యాప్తులో తేడా పడకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోందా అన్న సందేహాలు వస్తున్నాయట తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో.